NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BJP Meeting: అమిత్ షా ప్రసంగానికి భిన్నంగా కేసిఆర్ పేరు ఎత్తకుండా మోడీ ప్రసంగం..ఇవీ హైలెట్ పాయింట్స్

BJP Meeting: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ (BJP) ఏర్పాటు చేసిన విజయ సంకల్ప బహిరంగ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) తన దైన శైలిలో కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) ప్రసంగానికి భిన్నంగా ప్రసంగించారు. మోడీ తన ప్రసంగం మొదట్లో మోడీ తెలుగులో మాట్లాడి అలరించారు. తెలంగాణ బీజేపీని ఆశీర్వదించడానికి ఎంతో దూరం నుండి వచ్చిన కార్యకర్తలకు, సోదర సోదరీమణులకు, మాతృమూర్తులకు అందరికీ కృతజ్ఞతలు అంటూ పేర్కొన్నారు. తెలంగాణ గడ్డకు ఈ సందర్భంగా శిరసు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. ఈ సభకు హజరైన ప్రజల ప్రేమను చూసి ముగ్దుడ్నవుతున్నానని వెల్లడించారు. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే.. అమిత్ షా తన ప్రసంగంలో కేసిఆర్ ను, తెలంగాణ సర్కార్ ను విమర్శిస్తూ తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. మోడీ మాత్రం కేసిఆర్ పేరు ఎక్కడా తన ప్రసంగంలో ఉశ్చారణ చేయకుండా తెలంగాణ సంస్కృతి, ప్రాముఖ్యత, కేంద్రం ఇప్పటి వరకూ తెలంగాణలో అభివృద్ధికి కేటాయించిన నిధులు, అభివృద్ధి పనులను వివరించారు.

BJP Meeting PM Modi Speech in Hyderabad
BJP Meeting PM Modi Speech in Hyderabad

Read More:BJP: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఇంటెలిజన్స్ గూఢచర్యంపై కలకలం .. అధికారిని పట్టుకున్న బీజేపీ నేతలు

 

BJP Meeting: కేటిఆర్ ను సీఎం చేయడమే కేసిఆర్ చింత

అమిత్ షా మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందనీ, ఇప్పుడు తెలంగాణ ప్రజలకు అవి అందాయా అని ప్రశ్నించారు. కేసిఆర్ అవినీతి పాలనను అంతమొందిస్తామని అన్నారు. కేసిఆర్ కు ఉన్న చింత ఒక్కటేననీ, అది కేటిఆర్ ను సీఎం చేయడమేనన్నారు. తెలంగాణ పోరాటానికి మొదటి నుండి బీజేపీ మద్దతుందని, రాష్ట్ర విభజన ను కాంగ్రెస్ అసంపూర్తిగా చేసిందని విమర్శించారు. గతంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు సమస్య రాలేదని ఆయన అన్నారు. కేసిఆర్ మూడ నమ్మకాలతో సచివాలయాన్ని కూల్చారని విమర్శించారు. కేసిఆర్ సచివాలయానికి వెళ్లక ఎన్ని రోజులు అయ్యిందని ప్రశ్నించారు అమిత్ షా. రాబోయే రోజుల్లో సచివాలయానికి వెళ్లేది బీజేపీ ముఖ్యమంత్రేనన్నారు. టీఆర్ఎస్ సర్కార్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని విమర్శించారు. ఎంఐఎం కోసమే కేసిఆర్ విమోచన దినోత్సవం జరపడం లేదని వ్యాఖ్యానించారు అమిత్ షా.

Read More: Konda Visveswara Reddy: బీజేపీలో చేరిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి

డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం తెలంగాణ ప్రజలు పట్టాలు వేస్తున్నారు

ప్రధాన మంత్రి మోడీ మాట్లాడుతూ భాగ్యనగరం అన్ని వర్గాల వారికి అండగా నిలుస్తొందని అన్నారు. హైదరాబాద్ నగరం ప్రతిభకు పట్టం కడుతుందని వ్యాఖ్యానించారు. యాదాద్రి నరసింహస్వామి, అలంపూర్ జోగులాంబ, వరంగల్లు భద్రకాళి లతో కూడిన పవిత్ర భూమి తెలంగాణ అని వారి ఆశీస్సులు దేశం మొత్తానికి ఉంటాయని పేర్కొన్నారు. ప్రతాపరుద్రుడు, రాణి రుద్రమదేవి నుంచి కొమురం భీమ్ వరకూ తెలంగాణ పరాక్రమానికి ప్రతీకలు అని మోడీ వివరించారు. భద్రాచలం రామదాసు నుండి పాల్కురికి సోమనాధుడి వరకూ సాహితీ సౌరభాలు వెదజల్లించినవారేనని, భారతదేశానికి ఎనలేని నిధి వంటి వారని కొనియాడారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, వాస్తు శిల్పకళలు అందరికీ గర్వకారణమని అన్నారు. తెలంగాణ ప్రజలు లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఆదరించారనీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీకి మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. తెలంగాణ ప్రజలకు బీజేపీపై నమ్మకం ఎన్నో రెట్లు పెరిగిందని వెల్లడించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం తెలంగాణ ప్రజలు పట్టాలు వేస్తున్నారని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్న రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని వివరించారు.

 

రాష్ట్రంలో మౌలిక వనతుల కల్పనకు కేంద్రం ఎంతో కృషి చేస్తొందన్నారు మోడీ . తెలంగాణలో మెగా టెక్స్ టైల్ పార్క్ నిర్మిస్తామని చెప్పారు. హైదరాబాద్ లో సైన్స్ సిటీ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని, బయో మెడికల్ సైన్సెస్ కేంద్రాలు ఏర్పాటవుతాయని అన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభించామని గుర్తు చేస్తూ.. తెలంగాణలో అయిదు నీటి ప్రాజెక్టులకు కేంద్రం సహకరిస్తొందని అన్నారు. రైతుల కోసం కనీస మద్దతు ధర ను పెంచామనీ, హైదరాబాద్ లో రూ.1500 కోట్లతో ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ ఎక్స్ ప్రెస్ లు నిర్మిస్తున్నామని, రూ.350 కోట్లతో హైదరాబాద్ కు మరో రీజనల్ రింగ్ రోడ్డు మంజూరు చేశామని మోడీ ప్రకటించారు. తొలుత జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు ప్రసంగించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju