NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

BJP MIM : బీజేపీXఎంఐఎం.. హైదరాబాద్ యూటీ కేంద్రంగా మరో రాజకీయ రగడ..!?

BJP MIM  దాదాపు 30 ఏళ్ల క్రితం వచ్చిన రామ్ గోపాల్ వర్మ గాయం సినిమాలో ఓ సన్నివేశం ఉంటుంది. పొలిటీషియన్ అయిన కోట శ్రీనివాసరావుకు నగరం ప్రశాంతంగా ఉండటం ఇష్టం ఉండదు. అందుకే హిందు, ముస్లింల మధ్య కావాలనే తగాదా సృష్టిస్తాడు. దాంతో అల్లకల్లోలం జరుగుతుంది. తమ రాజకీయ ఉనికి కోసమో.. సమస్యను సృష్టించి రాజకీయంగా పబ్బం గడుపుకునే రాజకీయ నాయకుల తీరును దాదాపు 30 ఏళ్ల క్రితమే చూపించారు ఆర్జీవీ. ప్రస్తుతం ఇదే తంతును నేటి రాజకీయ నాయకులు అవలంబిస్తున్నారు. అసలే మాత్రం చర్చల్లో, వార్తల్లో లోని అంశాన్ని సృష్టించి రాజకీయ ప్రకంపనలు, గందరగోళం సృష్టించిన ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీరు అలానే ఉంది. హైదరాబాద్ ను యూటీ చేస్తారేమో.. అని పార్లమెంట్ లో చేసిన ప్రకటన రాజకీయ గందరగోళానికి దారి తీసింది.

BJP MIM political heat on hyderabad at status
BJP MIM political heat on hyderabad at status

BJP MIM  : ఒవైసీ కి హింట్ ఉందా..?

ప్రజలెప్పుడో మర్చిపోయిన మతపరమైన అంశాలను గత ఏడాది జరిగిన బీహార్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోకి తీసుకొచ్చాయి బీజేపీ, ఎంఐఎం పార్టీలు. కొత్తగా ప్రజల్లోకి మతపరమైన అంశాలను జొప్పించి ఎవరికి వారు లాభపడ్డారు. ఇందులో సందేహం లేదు. బీహార్లో 5 సీట్లతో ఎంఐఎం లాభపడితే.. ఏకంగా అధికారంలో కూర్చుంది బీజేపీ. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీ, ఎంఐఎం ఇద్దరూ పుంజుకునేలా ఓట్లు, సీట్లు తెచ్చుకోవడంతో సఫలీకృతమయ్యారు. మళ్లీ ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్టున్నారు ఒవైసీ. ఏకంగా హైదరాబాద్ యూటీ అంటూ ఇందులోకి బెంగళూరు, చెన్నైను కూడా లాగారు. ఇప్పటికిప్పుడు దీని వల్ల ఒనగూరేది ఏమీ లేకపోయినా.. చిలికి చిలికి గాలివానగా మారేందుకు ఇదొక గాలి తుంపరగా చెప్పుకోవచ్చు. రాజకీయంగా వేడి.. పార్టీల నాయకుల వాడి వేడి మాటలతో విషయం రాజుకుంటుంది. రాజకీయ అస్థిరతకు అవకాశం ఏర్పడుతుంది. దీనిపై మొదట తామే చర్చించామని ప్రజల్లోకి వెళ్లేందుకు అవకాశం ఏర్పడుతుంది. అసలు కేంద్రం నుంచి ఎటువంటి హింట్ కూడా బయటకు రాకుండా ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేసారంటే.. ఏమో.. ఒవైసీ చీకట్లో బాణం వేస్తే బీజేపీకి తగిలిందేమో.. చెప్పలేం..!

 

దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం చూపు..

దీనిపై బీజేపీ వెంటనే స్పందించింది. అసలు కేంద్రానికి అటువంటి ఉద్దేశం లేకుడా ఒవైసీ ఇటువంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒవైసీ వ్యాఖ్యలను ఖండించారు. నిజానికి దక్షిణాదిన ఉన్న బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాలు దేశానికి చాలా కీలకంగా మారాయి. ఆయా రాష్ట్రాల ఆర్ధికంగా పుంజుకోవడానికి.. విదేశీ పెట్టుబడులు ఆకర్షించడంలో ముందుంటున్నాయి. దీంతో కేంద్రం చూపు దక్షిణాది రాష్ట్రాలపై ఉందనేది వాస్తవం. ఆమధ్య హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధాని చేస్తారంటూ వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ నగరాలను కేంద్రం తన పరిధిలోకి తీసుకునేందుకు వెనుకాడదు అని కూడా చెప్పలేం. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మమత కూడా దేశానికి నాలుగు రాజధానులు ఉండాలని ఓ బాంబ్ వేసి వదిలేశారు. ఇంకా దానిపై రాజకీయ రగడ మొదలుకాకపోయినా.. ఒక చర్చకు ఆస్కారమిచ్చారు. ఒవైసీ కూడా ఇలానే నర్మగర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారా అనేది కూడా ఆలోచించాల్సిందే. రాష్ట్ర విభజన సమయంలో.. ఓటుకు నోటు కేసు అనంతర పరిస్థిల్లో తప్ప హైదరాబాద్ యూటీ అంశం మళ్లీ తెర మీదకు రాలేదు.

అదే జరుగుతుందా..?

అయితే.. ఒవైసీ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు కలుగుతున్నాయి. ఇటివల దక్షిణాదిలో పాగా వేయాలని బీజేపీ భావిస్తోంది. అనూహ్యంగా తెలంగాణలో బీజేపీ ఎదుగుతోంది. నిజామాబాద్ ఎంపీ, దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ బాగా రాణించింది. హైదరాబాద్ లో బీజేపీ గాలి కాస్త బలంగానే ఉండి టీఆర్ఎస్ కోటకు బీటలు పడేలా చేసింది. బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకే ఈ అంశాన్ని తెర మీదకు తెచ్చారా అనే వాదనలూ లేకపోలేదు. సహజంగానే హైదారాబాద్ యూటీ అంటే కేసీఆర్ గానీ, కాంగ్రెస్ కానీ ఒప్పుకోరు. ప్రజల్లోకి వెళ్లి బీజేపీకి వ్యతిరేకంగా ఎవరికి వారు బీజేపీకి ఎదురుతిరిగేలా.. వారి ఇమేజ్ ను దెబ్బకొట్టేలా చేస్తారు. ఇలా జరగాలనే ఒవైసీ ఒక ప్లాన్ ప్రకారమే యూటీ అంశాన్ని తెర మీదకు తెచ్చారని కూడా చెప్పొచ్చు. అందుకే బీజేపీ అంత వేగంగా రెస్పాండ్ అయి.. ఒవైసీప వ్యాఖ్యల్ని కొట్టిపారేసింది. మరి.. ఒవైసీ నిజంగానే గురి చూసి కొట్టారో.. చీకట్లో బాణం వేశారో చూడాలి.

author avatar
Muraliak

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju