NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

పాపం ‘సుజనా’.. నిన్ను పట్టించుకునేదెవరు..??

సుజనా చౌదరి.. ఏపీ రాజకీయాల్లో రెండు దశాబ్దాలుగా బాగా వినిపిస్తున్న పేరు. చంద్రబాబు నాయుడు నీడ. చంద్రబాబు అధికారం కోల్పోయి వైసిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బిజెపిలోకి వెళ్ళి తన రక్షణ తాను చూసుకున్న ఫక్తు రాజకీయ నాయకుడు. పార్టీ మారినా మనసు మొత్తం టిడిపి పైనా, చంద్రబాబు పైనా వేసుకొని టీడీపీ వాదనను భుజాన మోస్తున్న ఒ గొప్ప చంద్రబాబు అభిమాని. నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలోనూ, మండలి రద్దు విషయం లోనూ, అమరావతి రాజధాని విషయంలోనూ బిజెపి ఏం మాట్లాడుతున్నదో లేదో తెలియదు కానీ సుజనా చౌదరి మాత్రం ఇదే బిజెపి నిర్ణయం అంటూ టీడీపీకి అనుకూలంగా ఉన్న నిర్ణయాన్ని తమ నిర్ణయంగా చెప్పుకుంటారు. ఇలా  ఇన్నాళ్లు నెట్టుకొచ్చారు. అయితే మూడు రాజధానులు, అమరావతి విషయంలో మాత్రం సుజనా చౌదరి మాటలకు బీజేపీలో ఏ మాత్రం విలువ లేదని, ఒక్క శాతం కూడా విలువ ఇవ్వడం లేదని తేలిపోయింది.

ఇప్పుడు ఏమి చేస్తారు సుజనా?

రాజధాని వికేంద్రీకరణ అంశం గడచిన ఏడు ఎనిమిది నెలల నుండి రాష్ట్రంలో నానుతోంది.
ఈ క్రమంలో ప్రతి 15 రోజులకు ఒక సారి సుజనా చౌదరి మీడియా ముందుకు రావడం రాజధాని అమరావతి ఉంటుంది అని చెప్పడం, కేంద్రం పెద్దలంతా చూస్తున్నారని, సరైన సమయంలో నిర్ణయం తీసుకున్నారంటూ మీడియాకు సర్ది చెప్పడం ప్రజల చెవ్వుల్లొనూ, మీడియా చెవుల్లో పూలు పెట్టడం జరుగుతూ వచ్చేది. నిజంగా సుజనా చౌదరి వంటి లాబీయిస్టు, జాతీయ వ్యాపారవేత్త, కోట్ల కు అధిపతి, మాజీ కేంద్ర మంత్రి ఇంతగా చెబుతున్నారంటే బీజేపీ మూడు రాజధానుల విషయంలో బాగా గట్టిగానే ఆలోచిస్తుందేమో అని అనుకునే వాళ్ళు అందరూ ఈ రోజుతో ఖంగు మీద కంగుతిన్నారు. మూడు రాజధానులు విషయంలో వైసీపీ తీసుకున్న నిర్ణయానికి ఒక్క శాతం కూడా అడ్డు చెప్పకుండా బిజెపి నెమ్మదించింది. దీంతో జగన్ ఏమనుకున్నారో రాజధానుల విషయంలో అదే జరిగింది. మరి అమరావతికే జై కొట్టిన సుజనా ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారు, ఏమి సమాధానం చెబుతారు. చక్కగా టిడిపిలో ఉంటూ చంద్రబాబు భజన చేసుకుంటూ టీడీపీ తరహా రాజకీయం చేసుకోకుండా కేసుల నుంచి రక్షణ కోసం బీజేపీ లోకి వెళ్లి మనసును కూడా ఇటు మళ్లించి ఇదే వాదనను వినిపిస్టే పస లేకుండానే నసగా ఉంటుంది. అందుకే టీడీపీలో ఉంటే నెంబర్ 2 తరువాత నెంబర్ 2 స్థాయి నీది. బీజేపీలో  వెళ్ళాక టీ కొట్టులో టీ గ్లాస్ గా మారిపోయింది అర్థం చేసుకో వయ్యా.

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?