NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

పచ్చి అవకాశవాదం!

ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు ఉద్యోగాలలో, విద్యావకాశాలలో పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం తెచ్చిన బిల్లును పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయి. మంచిచెడ్డలు విచారించేందుకు బిల్లును ముందు సెలక్ట్ కమిటీకి పంపాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌కు ప్రభుత్వం ససేమిరా అంది. ఇది వివాదాస్పదమైన బిల్లు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధం. ఆర్ధికపరమైన వెనుకబాటుతనం అనే ఒక్క ప్రాతిపదికతో రిజర్వేషన్లు కల్పించడానికి వీలు లేదనీ, సామాజిక, విద్యా పరమైన వెనుకబాటుతనం కూడా ఉండాలనీ 1992లో ఇందిరా సాహ్నీ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

మోది ప్రభుత్వం తెచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లుకు మరో అడ్డంకి కూడా ఉంది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించడం  ఆర్టికల్ 14 ద్వారా సంక్రమిస్తున్న సమానత్వం హక్కును హరిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొన్నది.

ఈ రెండు అడ్డంకులనూ అధిగమించి ఇబిసి కోటా అమలులోకి వచ్చేదీ లేనిదీ ఇప్పుడే చెప్పడం కష్టం. మోదీ ప్రభుత్వానికి ఇవన్నీ తెలియక కాదు. వారికి కావాల్సింది రాజకీయ ప్రయోజనం. ఎన్నికలకు కొద్ది నెలల ముందు హఠాత్తుగా ఈ రాజ్యాంగ సవరణ ఎందుకు తలపెట్టిందీ పిల్లలకు కూడా అర్ధమవుతుంది. మోదీ మాత్రం ఎంచక్కా బుకాయిస్తారు. ఈ బిల్లు అంత ముఖ్యమైనదయితే, అంత అవసరమైనదయితే చర్చ సందర్భంగా ఉభయ సభలలో ఆయన ఎందుకు లేరో చెప్పాలి. రాజ్యసభలో బిల్లుపై చర్చ జరుగుతున్నపుడు ఆయన ఆగ్రాలో బహిరంగ సభకు వెళ్లారు. ముఖ్యమైన బిల్లు కన్నా ఆయనకు బహిరంగ సభలు ముఖ్యం.

మోదీకి పార్లమెంటుపై ఎంత గౌరవం ఉన్నదీ దేశ ప్రజలు  చాలాకాలంగా చూస్తూనే ఉన్నారు. ఆయన నిజానికి పార్లమెంటులో కూర్చున్నా చర్చ మరింత అర్ధవంతంగా జరిగేందుకు తోడ్పడేది ఏమీ ఉండదు. ముందే చెప్పుకున్నట్లు ఈ రాజ్యాంగ సవరణ బిల్లులో రెండు కీలకమైన అంశాలు ఇమిడి ఉన్నాయి. రెండూ కూడా రాజ్యాంగానికి సంబంధించిన అంశాలు. ఇంత బరువైన విషయంపై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నపుడు దానిని దేశప్రజలతో పంచుకోవాల్సిన అవసరం ఉందా లేదా? బిల్లు పార్లమెంటుకు వచ్చే  ముందే దానిపై చర్చ జరిగితే ఏమన్నా నష్టం సంభవిస్తుందా? గప్‌చిప్‌గా దొంగచాటుగా బిల్లును తీసుకురావాల్సిన అవసరం ఏముంది? బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టే వరకూ ఎవరికీ తెలియకుండా అంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది?

దీనిని బట్టే బిజెపి పెద్దల అంతరంగం ఏమిటో బయటపడుతోంది. ఆగ్రాలో మాట్లాడుతూ, ప్రధాని ఎన్నికల ముందు రాజకీయ ప్రయోజనాలను ఆశించి  బిల్లు తెచ్చారన్న వాదనను తోసిపుచ్చారు. దేశంలో ఎప్పుడు చూసినా ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగూనే ఉన్నాయంటూ, బిల్లు ఎప్పుడు తెచ్చినా ఈ విమర్శ వస్తుందని తనను తాను సమర్ధించుకున్నారు.

నిజమే, దేశంలో ఎప్పుడు చూసినా ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. అయితే అన్ని ఎన్నికలూ లోక్‌సభ ఎన్నికలు కావు. నరేంద్ర మోదీ ప్రధానిగా కొనసాగేదీ లేనిదీ అన్ని ఎన్నికలూ తేల్చవు. రేపు జరగనున్న లోక్‌సభ ఎన్నికలే తెలుస్తాయి. ఇంత చెబుతున్న మోదీ, తనకు గడచిన నాలుగున్నర ఏళ్లలో ఇబిసి కోటా ఎందుకు గుర్తుకు రాలేదో చెప్పగలరా?

author avatar
Siva Prasad

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Chandrababu: గాజువాక చంద్రబాబు సభలో రాయి దాడి  

sharma somaraju

ఇలా చేస్తే త‌ప్పా కూట‌మి స‌క్సెస్ కాదా… ఇదే ఆఖరి అస్త్రం..!

ఏడ్చి సీటు కొట్టేసిన టీడీపీ లీడ‌ర్ విక్ట‌రీ ప‌క్కా… భారీ మెజార్టీ కూడా..?

మంగ‌ళ‌గిరిలో గెలుపు కోసం లోకేష్ చివ‌ర‌కు ఈ ప్ర‌చారం కూడా చేస్తున్నాడే…!

Leave a Comment