NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

తిరుపతి లో పోటీ చేసి పరపతి పోగొట్టుకోవడం అవసరమా వీర్రాజుగారూ? అంటున్న కమలనాథులు!

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధమని ప్రకటించిన ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుని కొందరు వెనక్కు లాగుతున్నారని సమాచారం.

bjp says somu veeraju dont loose status in tirupati elections
bjp says somu veeraju dont loose status in tirupati elections

ఇందుకు రకరకాల కారణాలు వినవస్తున్నాయి.నిజానికి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధం కాకుండా బిజెపి గనుక అభ్యర్థిని నిలబెడితే మద్దతు ఇవ్వాలని యోచిస్తోంది.వాస్తవానికి ఎవరి దమ్ము ఎ౦తో చూసుకోవలసింది వైసిపి టిడిపిలే.వాస్తవానికి ఏపీలో వైసీపీ తో పోటీ పడే స్థాయిలో ఇంకా బీజేపీ లేదన్నది నిర్వివాదాంశం.ఈ పరిస్థితుల్లో అక్కడ బీజేపీ పోటీచేసి ఓడిపోవడం కంటే అసలు ఎన్నికలకు దూరంగా ఉండటం మంచిదని కమలనాథులు అభిప్రాయపడుతున్నారు.అంతకుమించి ఈ ఎన్నికల్లో కనుక బిజెపి ఏ పరిస్థితుల్లోనైనా టిడిపి మద్దతు తీసుకుంటే అది ఇంకా పార్టీని డ్యామేజ్ చేయగలదని వారు ఆందోళన చెందుతున్నారు.ఎలాగూ గెలిచే అవకాశం లేనపుడు అసలు పోటి చేయటం ఎందుకన్నది కొందరి ప్రశ్న.

టిడిపి మద్దతు తీసుకుంటే దాన్ని ఎలా సమర్థించుకోగలమని మరికొందరు పార్టీని అడుగుతున్నారు.ఇప్పటికే రాష్ట్రంలో జనసేనతో బీజేపీకి పొత్తు ఉంది.మరోవైపు జనసేనకు టిడిపితో లోపాయికారి అవగాహన ఉందన్న అభిప్రాయం లేకపోలేదు.ఇప్పుడు బిజెపి గనుక అటు టిడిపి ఇటు జనసేన మద్దతు తీసుకుంటే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని పార్టీ సీనియర్లు చెబుతున్నారు.అంతేగాక ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో బిజెపికి చెందిన పరిమళ నత్వాని అనే వ్యాపారికి ఎంపీగా వైసిపి అవకాశం ఇవ్వడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. దీనికి తోడు అకాలీదళ్ ఎన్డీఎకు దూరమయ్యాక ఆ స్థానాన్ని వైసీపీ హస్తినలో భర్తీ చేయడానికి సిద్ధంగా ఉంది. మోడీ ప్రభుత్వానికి అన్ని విధాల జగన్ మద్దతు ఇస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో గెలవలేని ఉప ఎన్నికల్లో పోటీ చేసి వైసీపీకి శత్రువుగా మారడం అవసరమా అని బిజెపి వర్గాలు తర్జనభర్జన పడుతున్నాయి. పోటీకి దూరంగా ఉంటే కనీసం పరువైనా మిగులుతుందని అంతే గాక భవిష్యత్తులో వచ్చే కొన్ని రాజకీయ పరమైన ఇబ్బందులను కూడా తప్పించుకోవచ్చునని వారు సోమువీర్రాజు చెవిలో పోరుతున్నారట.ఈ నేపథ్యంలో బిజెపి కూడా పోటీ నుండి తప్పుకుంటే తిరుపతి లోక్సభ స్థానం ఏకగ్రీవంగా వైసీపీకి దక్కుతుంది ఒకవేళ పోటీ జరిగినా వన్సైడ్ వార్ గా మిగులుతుంద౦టున్నారు.

author avatar
Yandamuri

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!