NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

BJP ; ఆ సీక్రెట్ సర్వేలో ఏం తెలిసింది..!? బీజేపీ సైలెన్స్ వెనుక కారణాలేంటి..!?

BJP ; దేశం మొత్తం మీద బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాలను 29 లైనుగా చేరిస్తే.. ఒకటిలో గుజరాత్, రెండులో యూపీ.., ఉంటె.., దిగువన 29 లో ఆంధ్ర ప్రదేశ్, 28 లో తమిళనాడు, 27 లో తెలంగాణ రాష్ట్రాలు వస్తాయి..! అంటే దేశంలో బీజేపీ (BJP) ఉనికి మొదలైన 1989 నుండి ఆ ఎన్నికల్లోనూ ఏపీలో బీజేపీ సొంతంగా గెలవలేదు. 1989 నుండి 2021 మధ్య ఈ 32 ఏళ్లలో బీజేపీ బలం 1200 సాయమ్ పెరిగింది. యూపీలో మొదలైన బీజేపీ బలం అక్కడి నుండి 20 రాష్ట్రాలకు పాకింది. దక్షిణాన ఏపీ, తమిళనాడు, తెలంగాణ, కేరళ, ఒడిశా తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాల్లో బీజేపీ(BJP), Amith shah ఎంతో కొంత మంచి స్థితిలోనే ఉంటుంది. అన్నిటి కంటే ఏపీలోనే ఆ పార్టీకి కనీసం ఆదరణ దక్కడం లేదు. కానీ.. బీజేపీ అవకాశం ఉన్న ప్రతీసారి ఏపీలో ఎదగడానికి ఏదో ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇన్నాళ్ల ప్రయత్నాలు వేరు.., 2019 ఎన్నికల తర్వాత వేరు. ఇప్పుడు కొంచెం సిన్సియర్ గా, సీరియస్ గా ఏపీలో ఎదగడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది.

bjp-secret-survey-shocking-party
bjp secret survey shocking party

BJP; బీజేపీ ఎదిగే ప్రయత్నాలు ఇవీ..!

ఏపీలో బీజేపీ నాలుగు ఓట్లు, కొన్ని సీట్లు సంపాదించుకునే ప్రయత్నాల్లో ఉంది. 2019 ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసిన ఆ పార్టీకి కేవలం ఒక్కశాతం ఓట్లు మాత్రమే దక్కాయి. ఆ తర్వాత జనసేనతో కలిసి బలం పెంచుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. * ఏపీకి మేమె దిక్కు, ఏపీని అభివృద్ధి చేయాలంటే.., రాజధాని నిర్మించాలంటే.., పోలవరం కట్టాలంటే.. మేమె దిక్కు అంటూ ఆ నాయకుల చేత బాగా ప్రచారాలు చేసుకుంది. కానీ ఏపీలో ఎక్కడా బీజేపీ పప్పులు ఉడకడం లేదు. “ఏపీ ఇలా ఉండడానికి మీరే కారణం.., ఏపీ నాశనం చేస్తున్నది మీరే.., ఏపీని కనీసం ఎదగకుండా చేస్తున్నది మీరే” అంటూ ఏపీ ఓటర్లు బీజేపీని తిరస్కరిస్తున్నారు. * అద్దె బలంగా ఉన్న జనసేన పవన్ కళ్యాణ్ తో ప్రస్తుతం బీజేపీకి పొసగడం లేదు. ఇద్దరి మధ్య సమన్వయము లేదు, బలవంతపు పొత్తు నడుస్తుంది. * చివరికి బీజేపీకి బాగా కలిసివచ్చే హిందూ విగ్రహాల రాజకీయం కూడా మొదలు పెట్టింది. రాష్ట్రస్థాయి నుండి జిల్లాస్థాయి వరకు హిందూ దేవాలయాలపై దాడులు అంటూ పోరాటాలు, ఉద్యమాలకు పిలుపునిచ్చి.. ఉద్యమం కంటే ఎక్కువ యావతో ప్రచారం చేసుకుంటుంది..! కానీ బీజేపీ పరిస్థితి మారడం లేదు.

ఇదీ చదవండి ; “ఓటుకి నోటు” విషయంలో చంద్రబాబుకీ – మోడీకి ఇదే తేడా..!!

bjp-secret-survey-shocking-party
bjp secret survey shocking party

BJP ; సర్వేలో షాకింగ్ నిజాలు..! అమిత్ షా ఆగ్రహం..!?

ఇక ఏపీలో బీజేపీ పరిస్థితిపై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక్కడ క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. అందుకే 2020 జూన్ లో ఓసారి.., 2021 జనవరిలో ఓ సారి ఏపీలో బీజేపీ తీరుపై సర్వే చేయించారు. తాజాగా ఆ నివేదిక, ఈ నివేదిక పోల్చి చూస్తే.. ఆరునెలల్లో బీజేపీ మరింత పతనం అయినట్టు తెలిసిందట. 2020 జూన్ నాటికి కనీసం నాలుగు జిల్లాల్లో బీజేపీ హవా కొంచెం కనిపించింది. 5 శాతం ఓట్లు వరకు బలం పుంజుకున్నట్టు తేలిందట. కానీ తాజాగా అందిన సర్వే వివరాలు మేరకు… ఏపీలో బీజేపీ పరిస్థితి ఏమాత్రం బాలేదని వెల్లడయింది. దీంతో ఏపీ బీజేపీ నేతలు, కొందరు పరిశీలకులపై కేంద్ర పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.

అమిత్ షా ; త్వరలోనే నేరుగా రంగంలోకి..!!

బీజేపీకి పెద్ద దిక్కు ప్రస్తుతం అమిత్ షా మాత్రమే. నరేంద్ర మోడీ పరిపాలన వ్యవహారాలు చూసుకుంటే.., అమిత్ షా పార్టీపరంగా కీలక అంశాలు చూస్తుంటారు. ప్రస్తుతం ఆయన దృష్టి మొత్తం పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై ఉంది. బీజేపీకి పంటిలో రాయిలా ఉన్న మమతా బెనర్జీని ఎలాగైనా ఓడించాలనేది బీజేపీ టార్గెట్..! అందుకే అమిత్ఆ షా కనుసన్నల్లోనే 60 మంది ప్రత్యేక బృందం అమిత్ షా కార్యాలయం నుండి పశ్చిమ బెంగాల్ లో పార్టీ పరిస్థితిని పరిశీలిస్తుంది. డైరెక్షన్ మొత్తం ఆయనే చేస్తున్నారు. దీని తర్వాత తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాల్లో ఎన్నికలపై ఈ టీమ్ పని చేస్తుంది. ఆ ఎన్నికల తర్వాత అంటే ఈ ఏడాది ఆగష్టు నుండి అమిత్ షా ఏపీ రాజకీయ వ్యవహారాలపై దృష్టి పెడతారని.. మూడు నెలల పాటూ ఏపీలో పార్టీ బలోపేతంపై ఆయన మార్కు మార్పులు ఉంటాయని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి..!!

 

 

 

author avatar
Srinivas Manem

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju