ఎట్టెట్టా..? ఏమా లెక్క..? జనసేన + ప్రరాపా = 2024 వ్యూహమా…?

Share

పేకాటలో జోకర్ పడినోడిది ఆట కాదు…! లైఫ్ ఉన్నోడిది ఆట…!
అన్నయ్యకి మూడు జోకర్లు… తమ్ముడికి రెండు జోకర్లు మొత్తం కలిసి షో చూపించేస్తాం అంటే ఎట్టా కుదురుద్ది..? సోమూ ఎట్టా కుదురుద్ది..??

క్రికెట్ లో పరుగులు కొట్టినోడిదే ఆట…!
యువరాజ్ 90 కొట్టి అవుటైతే… ఆ తర్వాత మ్యాచ్ లో హర్భజన్ చివర్లో 10 పరుగులు చేసాక…, యువరాజ్ సెంచరీ చేసేసాడు అంటే ఎట్టా కుదురుద్ది..? సోమూ ఎట్టా కుదురుద్ది..??

2009 లో ప్రజారాజ్యం ఓట్లు…, 2019 లో జనసేన ఓట్లు కలిసి 2024 లో బీజేపీ ఓట్లు అవుతాయంటే… ఎట్టా కుదురుద్ది..?? ఆహా..! ఎట్టా కుదురుద్ది…?? సోమూ.. ఏమా లెక్క, ఏమా లాజిక్కు..??

“2024 లో బీజేపీకి భారీగా ఓట్లు వచ్చేస్తాయని.., వచ్చిన ఓట్లని ఏం చేసుకోవాలో కూడా తెలియడం లేదని.., అందుకే కొన్ని తగ్గితే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారేమో సోము వీర్రాజు గారు…!! ఇటీవల ఆయన ఏమని సెలవిచ్చారంటే…!! “2009 లో ప్రజారాజ్యం పార్టీకి వచ్చిన ఓట్లు 18 శాతం.., 2019 లో జనసేన కి వచ్చిన ఓట్లు 5 శాతం… 2024 కి 24 శాతం అవుతాయి. మా ఓట్లు అప్పటికి కనీసం 10 శాతానికి చేరతాయి. అంటే 2024 ఎన్నికల్లో మాకు 35 ఓట్లు ఖాయం అనే లెక్కలు విడమర్చి చెప్పారు”..! ఇక్కడ అనేక సందేహాలు, అనేక అనుమానాలు, అనేక ప్రశ్నలు ఆయనే వేసుకునే బాగుండేది..? కానీ అధ్యక్ష కుర్చీ ఎక్కిన ఆయన అసలు కిందకు చూసేలా లేరు. ఆ లెక్కలు, లాజిక్కులు చూస్తుంటే 2024 నాటికి గెలుపు ఖాయమని ఇప్పటికే ఫిక్స్ అయినట్టున్నారు. అందుకే సీఎం గా ఎవరు అనేది ఇక చర్చించుకోవాలేమో…!!

 

2009 లో సంగతి మర్చిపోయారేమో…!!

2009 లో రాష్ట్రం కలిసి ఉంది. చిరంజీవికి 74 లక్షలు అంటే సుమారుగా 18 శాతం ఓట్లు, 18 సీట్లు వచ్చాయి. తెలంగాణాలో ఆశించిన స్థాయిలోనే ఓట్లు వచ్చాయన్నది సోము మరిచారు. నాడు చిరంజీవి వెనక ఉన్న బలమైన నాయకులు గంటా శ్రీనివాసరావు, కాపు రామచంద్రయ్య ఇప్పుడు ఆయనతో లేరు. నాటి ప్రజారాజ్యం లేదు, ఆ నాయకులూ లేరు, ఆ ఓట్లు, సీట్లు ఏమయ్యాయో స్పష్టత లేదు. ఇక ప్రజారాజ్యం కాంగ్రెస్ లో కలిపినా తర్వాత చిరంజీవికి కాపుల్లోనే శతృవులు ఎక్కువయ్యారు. ఇక జీవితంలో నమ్మబోమని తెగేసి చెప్పారు. అక్కడక్కడా ఆయన దిష్టి బొమ్మలను కూడా తగలబెట్టారు. ఆ తర్వాత కూడా కాపు రిజెర్వేషన్ పై ఏమి మాట్లాడలేదని, రాష్ట్రం విభజన సమయంలోనూ పదవి కోసం దిష్టి బొమ్మలా మారిపోయారని చిరంజీవికి రాజకీయంగా నెలకు దించేసి పనయ్యింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఆయన స్వయంగా ప్రచారం చేసిన ఎక్కడా బోణీ కొట్టలేదు. అలా “అన్నయ్య” రాజకీయం మసకబారింది.

how long bjp and janasena friendship continues
how long bjp and janasena friendship continues

తమ్ముడి పరిస్థితి చూద్దాం..!!

ఇక 2019 లో తమ్ముడి పరిస్థితి చూద్దాం..! అన్నయ్య కి 2009 లో ఏపీలో వచ్చిన ఓట్లు 9 శాతం మాత్రమే. కనీసం ఈ 9 శాతం తమ్ముడికి వచ్చినా కనీసం 10 సీట్లు గెలిచేవాడు కదా…?? జనసేన పవర్ కూడా కలుపుకుని అంటే 5 శాతం కూడా కలిస్తే మొత్తం 15 సీట్లు రావాలి కదా..?
పోనీ కాపులు దండిగా ఓట్లేసి గెలిపించేస్తారు అనుకున్నా…!!
కాపుల ఓట్లు దండిగా ఉన్న పాలకొల్లులో… 2009 లో చిరంజీవి ఎందుకు ఓడినట్టు..? అది చిరంజీవికి సొంత నియోజకవర్గం. అక్కడ వైశ్య మహిళను ఎందుకు గెలిపించినట్టు…??
2019 లో కాపుల ఓట్లు దండిగా ఉన్న… తనకు సేఫ్ అనుకున్న గాజువాక, భీమవరంలో పవన్ కళ్యాణ్ ఎందుకు ఓడిపోయినట్టు..??

లెక్కల మాష్టారు సోము గుర్తించని లెక్కలు…!!

2019 ఎన్నికల్లో వైసీపీకి 156 లక్షల ఓట్లు వచ్చాయి… టీడీపీకి 123 లక్షల ఓట్లు వచ్చాయి. జనసేనకు 21 లక్షలు, బీజేపీకి 2 . 85 లక్షల ఓట్లు వచ్చాయి. బీజేపీ, జనసేన ఆశలు పెట్టుకుంటున్న, సోము అనే లెక్కల మాష్టారు లెక్కలు వేసుకుంటున్న కాపుల ఓట్లు మొన్నటి ఎన్నికల్లో 65 శాతానికి పైగా జగన్ కి పడ్డాయి.


* నిజంగా సోము చెప్పుకుంటున్నట్టు… కాపులకు తమ నాయకుడు పవన్ పై అంత అభిమానం, తిరుగులేని విశ్వాసం ఉంటె 2019 లోనే వేసేవారు కదా..?? అన్నయ్య చిరంజీవిపై నమ్మకం ఉంటె 2009 లోనే వేసేవారు కదా..? 2009 లో చిరంజీవిని నమ్మినంతగా కూడా 2019 లో పవన్ ని కాపులు నమ్మలేదు కదా… అందుకే కనీసం చిరుకి వచ్చిన 9 శాతం కూడా రాలేదు కదా…?? ఆ ఎన్నికల్లో లేని విశ్వాసం..? 2024 నాటికి ఎలా వచ్చేస్తుంది..?? “హేమిటో…!! బీజేపీకి అన్ని ఓట్లు వచ్చేస్తే ఎక్కడ దాచుకుంటారో హేమిటో..”


Share

Related posts

తెరపైకి ఆర్టికల్ 356!!జగన్ ఎం చేయబోతున్నారు??

Comrade CHE

గీతం అనుమతులకు ఎసరు..!? “న్యూస్ ఆర్బిట్” ముందే చెప్పింది..!!

Srinivas Manem

Today Horoscope డిసెంబర్ 21st సోమవారం రాశి ఫలాలు

Sree matha