NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

ఒక వ్యక్తి.. రెండు ముఖాలు..! రెండు మాటలు.! సోము ఏం సాధిస్తున్నట్టు..!?

ఒక వ్యక్తికి రెండు నాలుకలు ఉంటె ఆయన చంద్రబాబు అవుతారు..!
ఒక పార్టీకి రెండు విధానాలు ఉంటె అది టీడీపీ అవుతుంది..!
ఒక పార్టీకి అసలు విధానాలే లేకపోతే అది జనసేన అవుతుంది..!
ఒక పార్టీకి రెండు విధానాలు.., పార్టీలో ఒక్కో వ్యక్తికీ ఒక్కో విధానమూ ఉంటె అది బీజేపీ అవుతుంది..!
ఒకే వ్యక్తికీ రెండు విధానాలు, రెండు ముఖాలు, రెండు మాటలు ఉంటె ఆయన సోము వీర్రాజు అవుతారు..!

సీన్ 1 ; అమరావతిలో ఉన్నవి అన్ని తాత్కాలిక భవనాలే. రూ 7200 కోట్లు నిధులతో ఒక్క శాశ్వత భవనం కూడా నిర్మించలేదు. రైతులను చంద్రబాబు నట్టేట ముంచేశాడు. అందుకే జగన్ రాజధాని మారుస్తా అంటున్నాడు ; సోము (నవంబర్ 21న)
రాజధానిగా అమరావతి ఉండాలి. రైతులకు అన్యాయం జరగకూడదు. అక్కడ నిర్మించిన భవనాలు వృథా కాకూడదు. పరిపాలన అక్కడి నుండే జరగాలి ; సోము (జులై 28న)
మూడు కాదు. రాష్ట్రంలో 13 రాజధానులు ఉండాలి. ప్రతీ జిల్లాని రాజధానిగా మార్చాలన్నదే బీజేపీ విధానం ; సోము..!!

సీన్ 2 ; పోలవరానికి కేంద్రం నిధులిస్తుంది. పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే ; సోము (అక్టోబర్ 29న )
పోలవరం పూర్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. కేంద్రం అన్యాయం చేయదు ; సోము
పోలవరంలో టీడీపీ అవినీతి చేసింది. జగన్ దాన్ని బయటకు తీయాలి. పోలవరం డబ్బుతో చంద్రబాబు విజయవాడలో భవనాలు కట్టుకున్నారు ; సోము..!!

సీన్ 3 ; స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి దౌర్జన్యాలకు పాల్పడింది. ఎన్నికల కమీషన్ మంచి నిర్ణయం తీసుకోవాలి. అయిదేళ్లకోసారి స్థానిక ఎన్నికలు జరిగాలన్నదే బీజేపీ విధానం ; సోము (అక్టోబర్ 28న లేఖలో)
స్థానిక ఎన్నికలు నిర్వహణకు నిమ్మగడ్డను అంత కంగారెంటీ..? ఆయన ఎవరి డైరెక్షన్ లో పని చేస్తున్నారు..? ;సోము (నవంబర్ 22న)
ఇలా రాజధాని, పోలవరం, స్థానిక సంస్థల ఎన్నికలు ఎటువంటి కీలక విషయాల్లో కూడా బీజేపీకి ఒక వైఖరి లేదు. సోముకి ఒక స్పష్టత లేదు. ఒక వ్యక్తి, ఒక్కో సారి ఒక్కోలా మాట్లాడుతున్నారు.

why somu is being targeted on cast bias
why somu is being targeted on cast bias

వ్యూహం మంచిదే కానీ చులకనవుతున్నారు..!!

ఇక్కడ పాయింట్ సోము కాదు. బీజేపీ పార్టీనే ఒక గందరగోళంలో ఉంది. సాధారణంగా ఎక్కడైనా బలం ఉంటె వారికి ఒక విధానం, ఒక వైఖరి ఉంటుంది. కానీ బలం లేని చోట ఇవేమి ఉండవు. ఏపీ లాంటి రాష్ట్రాల్లో బలం పెంచుకోవాలి అనుకునే చోట మాత్రం స్పష్టతతో ఉండాలి. కానీ బీజేపీలో అది లేదు. టీడీపీని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి.., బీజేపీ ఆ స్థానాన్ని ఆక్రమించాలి.. వైసిపికి ప్రత్యామ్నాయంగా తాము మాత్రమే ఉండాలి అనేది బీజేపీ వ్యూహం. అందుకే సోము, జీవీఎల్ లాంటి వారు టీడీపీని, చంద్రబాబుని టార్గెట్ చేస్తున్నారు. కానీ.. ఇక్కడ బీజేపీ వ్యూహాత్మక తప్పిదాలని., పొరపాట్లని చెప్పుకోవాలి.

ప్రతిపక్షాన్ని తిడుతూ ప్రజల్లోకా..!?

ప్రజలకు మేలు చేయాల్సింది అధికార పక్షం. పాలన బాధ్యత అధికార పక్షానిది. కానీ ఇప్పుడు జరిగే ప్రతీ ఇన్సిడెంట్ ని నాటి టీడీపీ పాలనతో పోలుస్తూ.. చంద్రబాబుని తిట్టడం వలన బీజేపీ బలపడుతుంది అనుకుంటే సోము లాంటి మేథావుల పొరపాటే. వైసిపి బలపడుతుంది. వైసిపి మద్దతు సోముకి లభిస్తుంది. కానీ తటస్థ ఓటర్లు, చివరికి జగన్ వ్యతిరేక బీజేపీ ఓటర్లు కూడా బీజేపీకి దూరమయ్యే అవకాశం ఉంటుంది. అధికార పక్షాన్ని విమర్శిస్తూ.., తప్పులు చూపుతూ ప్రజల్లోకి వెళ్తేనే.., అధికార, ప్రతిపక్షాలను ఒకే తరహాలో చూస్తేనే బీజేపీకి ఏమైనా భవిష్యత్తు ఉండొచ్చు. పైగా సోము వైసిపితో టచ్ లో ఉంటె.. పవన్ టీడీపీతో టచ్ లో ఉంటున్నారు. మరి ఈ ఇద్దరి స్నేహం.., ఈ రెండు పార్టీల పొత్తు ఏ ప్రాతిపదికన.., ఏ విధివిధానాలతో నడుస్తున్నట్టో సగటు బీజేపీ- జనసేన అభిమానికి అంతు చిక్కడం లేదు..!

 

 

author avatar
Srinivas Manem

Related posts

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N