NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

“దిస్ ఈజ్ షేమ్” సోమూ..! “వాట్ ఈజ్ దిస్” బండి..! షా పరువు తీయకండి..!!

ap-bjp-closing-soon-critical-stage

బీజేపీ అంటే వ్యవస్థలను శాసిస్తున్న ఓ వ్యవస్థ. రాజ్యాంగాన్ని, రాజులను ఎప్పుడైనా మార్చేయగల ఓ అతీత శక్తి.. నీతి/ నిజాయితీ/ అన్యాయం/ న్యాయం/ చట్టం/ ధర్మం అనేవి ఏమి పట్టవు. ఓటు/ సీటు/ కుర్చీ తప్ప ఇంకేం కనిపించవు. మధ్యప్రదేశ్ గెలిచామా..? బీహార్ గెలిచామా..? తర్వాత బెంగాల్ లో గెలిచామా..? అనేవే లక్ష్యాలు. మోడీ/ షా ద్వయం కుర్చీలు కదలకుండా.. వారు కూర్చున్న కుర్చీల నుండి కదలకుండా దేశ రాజకీయాలను శాసిస్తున్నారు. అటువంటి పార్టీకి పాపం ఏపీలో ఓట్లు, సీట్లు రావడం లేదు. ఎందుకొస్తాయిలే ఇక్కడ మరీ ఇలా సిల్లీ ట్రిక్స్ ప్లే చేస్తే..!!

ఏమిటండీ ఈ బీజేపీ..!? ఇలాగే రాజకీయం చేస్తే ఏపీలో ఆ ఒక్క శాతం కూడా పోతాయేమో..!?
ఎవరండీ ఈ సోము..!? ఎవరండీ ఈ బండి..!? ఇలాగే చేస్తే ఆ కొద్దిమంది కూడా దూరమవుతారేమో..!? ఆ కొద్ది ఓట్లు కూడా రాలవేమో..!? ఇదీ బీజేపీ/మోడీకి ఏపీలో ఉన్న కొద్ది మంది అభిమానుల ఆందోళన..!
కన్నా టీడీపీకి అనుకూలం, వైసీపీకి వ్యతిరేకమైపోయారని… సోముని తీసుకొస్తే ఈయన అసలైన వైసీపీ వాది కంటే కరుడుకట్టిన వైసీపీ వాదిలా మాట్లాడేస్తున్నారు. ఏవో లాలూచీలు, స్నేహాలు, బంధాలు ఉంటె లోలోపల చూసుకోవాలి. కానీ ఇలా సులువుగా.., మరీ ఈజీగా దొరికిపోయేలా మాట్లాడేస్తే ఎలా..!? ఇక్కడ సోము ఇలా ఉంటె.. అక్కడ బండి మరోలా భయానక రాజకీయాలు చేస్తున్నారు.

Somu Veerraaju

లేఖ ఇచ్చింది మీరే..? మళ్ళీ ప్రశ్నిస్తున్నది మీరే..!?

స్థానిక ఎన్నికల విషయంలో బీజేపీ వైఖరి ఏమిటన్నది గత నెల స్పష్టమైంది. ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గతనెల 28 న రాజకీయ పార్టీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సోము తరపున ఆ పార్టీ ప్రతినిధిగా పాకా సత్యన్నారాయణ పాల్గొన్నారు. “వైసిపి నేతలు మా కార్యకర్తల చేతులు నరికారు. హత్యాయత్నం చేసారు. ఆనాడు పిర్యాదు చేసినా పట్టించుకోలేదు. స్థానిక స్వపరిపాలనకు బీజేపీ పూర్తి అనుకూలం. తగు నిర్ణయం తీసుకోవాలి. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి” అంటూ ఓ అధికారిక లేఖని ఇచ్చారు. అంటే “స్థానిక ఎన్నికల విషయంలో ఎన్నికల కమీషన్ తీసుకునే నిర్ణయానికి మాకు అభ్యంతరం లేదు.., అధికార వైసిపి గతంలో అక్రమాలకు, బెదిరింపులకు పాల్పడింది. ఈ సారి అలా కాకుండా చుడండి” అని అచ్చమైన తెలుగులో చెప్పినట్టే..!!

తాజాగా నిన్న ఓ ప్రెస్ మీట్ లో సోము వారు ఏం సెలవిచ్చారంటే..!? “ఏం నిమ్మగడ్డ రాష్ట్రంలో ఎవరు చెప్తే మీరు స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్నారు..? ఎవరి డైరెక్షన్ లో మీరు ఎన్నికలు నిర్వహించడానికి అనుకుంటున్నారు..!” అంటూ ప్రశ్నించారు.

BJP Letter to EC Nimmagadda

బండి కూడా ఇదే తరహాలో..!!

ఏపీలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలి, వ్యవస్థని కాపాడాలి అంటూ పెద్ద పెద్ద మాటలతో లేఖ ఇచ్చిన బీజేపీ… తెలంగాణాలో కూడా దొరికిపోయింది. అక్కడ బండి సంజయ్ కూడా గ్రేటర్ లో వరద సాయం నిలిపివేయాలి. గ్రేటర్ ఎన్నికలు దృష్ట్యా సాయం ఇవ్వకుండా అధికార పార్టీని నిలువరించాలి అని లేఖ రాశారు. తద్వారా ప్రజలకు అందుతున్న సాయాన్ని ఆపించేసారు. ఆ తర్వాత రోజునే ఓ బహిరంగ మీటింగ్ లో “గ్రేటర్ లో వరద సాయం కూడా సరిగా ఇవ్వడం లేదు. మేము ఆపేయమన్నాం అని చెప్తున్నారు. మీకు సాయం ఇస్తే మేము ఎందుకు ఆపుతాం. మాకు ఓటేయండి. పాతిక వేలు సాయం ఇస్తాం” అంటూ హామీలిచ్చారు. అంటే దొడ్డిదారిన లేఖలిచ్చేసి.. ముందుకొచ్చి సవాల్ చేసినట్టు ఉంది. రెండు రాష్ట్రాల్లో బీజేపీ చీకటి వ్యవహారం ఇలా ఉంది. తెలంగాణాలో అంటే మరీ పెద్ద విషయాలేమి కాదు. అక్కడ జనం ఇవేమి పట్టించుకోరు. కానీ ఏపీ అలా కాదు. ప్రతీది పట్టించుకుంటుంది. ప్రతీ అడుగు చూస్తుంది. సోములా షేమ్ పనులు చేస్తే.., సులువుగా దొరికిపోయేలా సిల్లర పనులు చేస్తే.., పార్టీ గురించి చెప్పుకోడానికి “ఒకప్పుడు” అనే పదాలు వాడాల్సి వస్తుంది..!!

 

 

 

author avatar
Srinivas Manem

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju