ఇటీవల ఏపీ బిజెపి అధ్యక్షుడిని మార్చిన బీజేపీ హైకమాండ్… ఎలాగైనా ఏపీ అసెంబ్లీ లోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు మరోపక్క వార్తలు వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ని టార్గెట్ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఆర్థికంగా మరియు రాజకీయ పరంగా అదే రీతిలో సామాజిక వర్గ పరంగా చూసుకుంటే ఏపీలో గంటా శ్రీనివాస్ ట్రాక్ రికార్డు అదరగొట్టే రీతిలో ఉండటంతో పార్టీకి ఎంతగానో ఉపయోగపడతాడాని గంటా శ్రీనివాసరావు చేత రాజీనామా చేపించి రాజ్యసభ టికెట్ ప్రతిపాదన గంటా ముందు ఇటీవల బిజెపి పార్టీ పెద్దలు పెట్టినట్లు టాక్.
ఆ తరువాత గంటా నియోజకవర్గంలోనే ఆ ఎమ్మెల్యే సీటుని బిజెపికి చెందిన మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కి ఇప్పించి, జరిగే ఉప ఎన్నికలలో మద్దతు ఇచ్చి గెలిపించుకోవాలని గంటా శ్రీనివాస్ రావు కి బిజెపి ఆఫర్ ఇచ్చినట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందుకోసం ఢిల్లీ నుండి బీజేపీ నేతలు లాబీయింగ్ స్టార్ట్ చేసినట్లు కూడా విశాఖలో వార్తలు వస్తున్నాయి. మరోపక్క టీడీపీ హయాంలో గంటా శ్రీనివాసరావు మంత్రిగా పనిచేసిన టైమ్ లో జరిగిన అవినీతిని వెలికి తీసే పనిలో వైస్సార్సీపీ ఉంటూ రాజకీయంగా గంటాకి చెక్ పెట్టాలని లేదా లొంగ తీసుకోవాలని అస్త్రాలు సంధిస్తోంది. ఇటువంటి నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు ఎటూ తేల్చుకోలేకపోతున్నారని టాక్.