NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Ap New Districts : కొత్త జిల్లాల ఏర్పాటుకు బ్రేక్..! మరో ఏడాది తర్వాతేనా..!?

break for new districts in ap

Ap New Districts: కొత్త జిల్లాలు Ap New Districts ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం ఇప్పటిది కాదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జిల్లాల విభజన గురించి ఆలోచించారు. కానీ.. అమల్లోకి రాలేదు. ఈలోపు ఎన్నికలు రావడం టీడీపీ ఓటమి.. వైసీపీ అధికారంలోకి వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పాలనా పగ్గాలు చేపట్టడం జరిగింది. ఈనేపథ్యంలో ఏపీలో ప్రస్తుతమున్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా మార్చాలని నిర్ణయించారు. ఇందుకు 2020 జూలైలో పునర్ వ్యవస్థీకరణ కమిటీకి క్యాబినెట్ ఆమోదం కూడా లభించింది. అప్పటి సీఎస్ నేతృత్వంలో కమిటీ వేసి మూడు నెలల్లో నివేదిక సిద్ధం చేయాలని కూడా ఆదేశించారు.

break for new districts in ap
break for new districts in ap

రాష్ట్రంలోని 25 పార్లమెంటరీ నియోజకవర్గాలను ఒక్కో జిల్లా చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. ఇందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసరికి ఓ నిర్ణయం కూడా వెలువడాల్సింది. కానీ.. ఇప్పుడు ఈ ప్రక్రియ ఆగిపోయింది. కారణం.. దేశంలో జనగణన జరక్కపోవడమే. ప్రతి పదేళ్లకోసారి దేశంలో జరగాల్సిన జనగణన ఈసారి కరోనా వల్ల జరగలేదు. ఎప్పుడు జరుగుతుందో కూడా తెలీదు. ఈ నేపథ్యంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అంశం ఆగిపోయింది. జనగణన పూర్తయ్యేవరకూ ఏ రాష్ట్రంలో కూడా భౌగోళిక సరిహద్దులు మార్చడానికి వీల్లేదని భారత రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం స్పష్టం చేసింది. సమాచారహక్కు చట్టం కింద సామాజిక కార్యకర్త ఇనగంటి రవికుమార్ అడిగిన ప్రశ్నకు రిజిస్ట్రార్ జనరల్ శాఖ ఇచ్చిన సమాధానం మేరకు ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

దీంతో ఏపీలో జిల్లాల పునర్విభజన ఆగినట్టే. ఇలా చేస్తే గ్రామాలు, పట్టణాలు వాటి సరిహద్దులు మారతాయి. కొత్త పట్టణాలు, గ్రామాలు ప్రకటిస్తారు. కొన్ని విలీనం అవుతాయి.. మరికొన్ని వేరే ఊళ్లలో కలుస్తాయి. సరిహద్దులు మారతాయి. అన్నింటికీ మించి జిల్లాలే ఏర్పడతాయి. ఇవన్నీ జనగణనకు అడ్డంకిగా, ఇబ్బందిగా మారతాయి. అందుకే సరిహద్దులు మార్చేందుకు వీల్లేదని స్పష్టం చేసింది కేంద్రం. జిల్లాల పునర్విభజన వల్ల కొత్తగా కలెక్టర్లు, ఐపీఎస్, జిల్లా పరిషత్ లు, పరిపాలనా సౌకర్యం పెరుగుతుంది. సీఎం జగన్ తన పాదయాత్రలో కూడా కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. ఈమేరకు ఆయన అధికారంలోకి వచ్చాక పాలనాపరమైన నిర్ణయం తీసుకున్నా కరోనా వచ్చి ఈ ప్రక్రియను మరింత ఆలస్యం చేసింది.

author avatar
Muraliak

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju