RRR: “బాహుబలి” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న “RRR” సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ ఏడాదికిపైగా జరుగుతూ ఉంది. సినిమా స్టార్ట్ చేసిన సమయంలో మొదటిలో 2020 జూన్ మాసం లో రిలీజ్ చేయాలని ..డేట్ కూడా ప్రకటించడం జరిగింది. కానీ షూటింగ్ మొదలుపెట్టిన ప్రారంభంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ గాయాలు కావడం జరిగింది. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోయిన్ సెలక్ట్ చేయడం కోసం చాలా టైం పడగా .. తర్వాత షూటింగ్ మొదలు పెట్టే టైం కి లాక్ డౌన్ దెబ్బకు గత ఏడాది చివరి వరకు సినిమా షూటింగ్ మొదలు కాని పరిస్థితి.
కొద్దిపాటి బ్యాలెన్స్ షూటింగ్ కలిగిన ఈ సినిమా షూటింగ్ ఇటీవల స్టార్ట్ అయింది. అయితే ఇంతలోనే ప్రస్తుతం దేశంలో సెకండ్ వేవ్ ఉద్రిక్తత వాతావరణం ఎక్కువగా ఉండటంతో తాజాగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కి మళ్లీ బ్రేక్ పడినట్లు ఇండస్ట్రీ వర్గాల లేటెస్ట్ టాక్. మేటర్ లోకి వెళితే అతి పెద్ద భారీ బడ్జెట్ సినిమా పైగా చాలా మంది టెక్నీషియన్లు ఒక్కచోటే పనిచేసే పరిస్థితి ఉండటంతో.. వైరస్ విస్తరించే అవకాశం ఉండటంతో ‘ఆర్ఆర్ఆర్’ మేకర్స్ ప్రస్తుతం కొనసాగుతున్న షెడ్యూల్ను వెంటనే నిలిపివేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్.
ప్రస్తుతం కొద్దిపాటి సూచన మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు ఇది కేవలం ఇరవై ఐదు రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉందని సినిమా యూనిట్ తెలియజేస్తూ ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది అనుకొన్న టయానికి అనగా అక్టోబర్ 13న రిలీజ్ సినిమా రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ భావిస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?