బ్రేకింగ్ : ఏపీ హెల్త్ మినిస్టర్ అత్యవసర ఆదేశాలు !

దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజుకి దాదాపు లక్షకు దగ్గరగా కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వాలు వణికిపోతున్నాయి. మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా పాజిటివ్ కేసులు ఊహించని రీతిలో బయటపడుతున్నాయి. అదేవిధంగా మృతుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉంటున్న తరుణంలో కరోనా డెడ్ బాడీ ల వద్ద కొంతమంది చేతివాటం చూపిస్తున్నట్లు శవాల మీద ఉన్న బంగారాన్ని దోచేసిన ఘటనలు ఇటీవల బయటపడ్డాయి.

Alla Nani flays Naidu | YSR Congress Partyతిరుపతి స్విమ్స్ శ్రీ పద్మావతి స్టేట్ కరోనా కేర్ ఆస్పత్రిలో కరోనా బారిన పడి మృతిచెందిన వ్యక్తి నుంచి బంగారం ఖరీదైన మొబైల్ కావటం ప్రభుత్వంపై విమర్శలకు తావిచ్చింది. గత కొంత కాలం నుండి స్విమ్స్ కరోనా హాస్పిటల్ లో డెడ్ బాడీ లపై బంగారు ఆభరణాలు మాయమవుతున్న ఘటనలు బయటపడటంతో హాస్పిటల్ యాజమాన్యంపై మరియు జిల్లా వైద్య ఆరోగ్య పై విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. పరిస్థితులు ఇలా ఉండగా చౌడేపల్లి కి చెందిన వెంకటరత్నం నాయుడు అనే వ్యక్తికి కరోనా వైరస్ సోకి హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఆయన ఇటీవల మరణించడంతో ఆయన చేతికి ఉన్న బంగారంతో పాటు ఖరీదైన మొబైల్ ని పీపీకిట్లతో ఉన్న వ్యక్తి తీసుకోవటం గురువారం సీసీ ఫుటేజ్ లో స్పష్టంగా కనిపించింది. ఈ విషయం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని దృష్టి వరకు రావటంతో ఈ ఘటనపై సీరియస్ అయ్యారు.

అంతే కాకుండా సదరు హాస్పిటల్ డైరెక్టర్ తో నేరుగా ఫోన్లో మాట్లాడి ఈ చర్యకు పాల్పడినవారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా మిగతా ప్రభుత్వ కరోనా ఆసుపత్రి డైరెక్టర్లకు కూడా కరోనా డెడ్ బాడీస్ విషయంలో సరికొత్త ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఇలాంటి పొరపాట్లు మళ్లీ జరగకుండా అన్ని ప్రభుత్వ కరోనా హాస్పిటల్ కి మంత్రి ఆళ్ల నాని సరికొత్త ఆదేశాలు ఇచ్చినట్లు టాక్.