హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్‌… ముంబైకి ఎంత టైంలో చేరిపోతారంటే..

Share

బుల్లెట్ ట్రైన్‌… అనేక మంది క‌ల‌. ఎక్క‌డో ఉండే న‌గ‌రాల్లో ఈ సేవ‌ల గురించి విన్న‌వారు మ‌న సిటీల్లో ఇలాంటివి ఉండాల‌ని అనుకుంటారు. అయితే, ఆ క‌ల నెర‌వేర‌నుంది.

దేశ ఆర్థిక రాజ‌ధాని అనే పేరున్న ముంబైకి. మ‌న రాజ‌ధాని న‌గ‌ర‌మైన హైదరాబాద్‌కు ఈ సేవ‌లు అందుబాటులోకి వ‌స్తున్నాయి. హైద‌రాబాద్‌ నుంచి ముంబైకి సూపర్​ఫాస్ట్​ ఎక్స్​ప్రెస్​ అయినా రైల్లో 12 గంటల జర్నీ తప్పనిసరి. అదే 300 కి.మీ స్పీడ్​తో దూసుకెళ్లే బుల్లెట్​ ట్రైన్​ ద్వారా జస్ట్​ 4 గంటల్లోనే ముంబై వెళ్లవచ్చు. ప్రయాణ ఇబ్బందులూ ఉండవు. అది నిజమయ్యే రోజులు రాబోతున్నాయి.

హైద‌రాబాద్‌కు బుల్లెట్ రైల్‌

దేశం మొత్తం 7 రూట్లలో బుల్లెట్​ ట్రైన్​ కారిడార్లను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ముంబై టు హైదరాబాద్​ రూట్​ ఒకటి. ముంబై–పుణె–హైదరాబాద్​ బుల్లెట్​ ట్రైన్​ కారిడార్​కు స్పీడ్​గా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న రైల్వే ట్రాక్​లు 80 నుంచి 160 కిలోమీటర్ల స్పీడ్​ను మాత్రమే తట్టుకుంటాయి. కాబట్టి బుల్లెట్​ ట్రైన్స్​ కోసం కొత్త ట్రాక్​లు వేయాలి. అందుకోసమే ఇప్పుడు టెండర్ల ప్రాసెస్‌ మొదలు కానుంది. 711 కి.మీ పనులకు నవంబర్​లోనే కేంద్ర ప్రభుత్వం టెండర్లను పిలవనుంది. వచ్చే ఏడాది పనులు ప్రారంభమయ్యే చాన్స్​ ఉంది. బుల్లెట్​ ట్రైన్​తో జర్నీ టైం తగ్గడమే కాకుండా వాణిజ్య పరంగానూ మరిన్ని వ‌స‌తులు అందనున్నాయి.

టెండ‌ర్లు ఎప్పుడంటే…

డీపీఆర్​ (డీటెయిల్డ్​ ప్రాజెక్ట్​ రిపోర్ట్​)పై చర్చించేందుకు నవంబర్​ 5న ప్రీ బిడ్​ సమావేశాన్ని నిర్వహించనుంది. మీటింగ్​లో కారిడార్​పై సర్వేతో పాటు అండర్​గ్రౌండ్​ వసతులు, సబ్​స్టేషన్లకు కరెంట్​ సరఫరా వంటి విషయాలపై చర్చించనున్నారు. నవంబర్​ 11న టెండర్లను పిలవనున్నారు. 18న టెండర్లను ఓపెన్ చేస్తారు. వచ్చే ఏడాది పనులను ప్రారంభించి మూడు నాలుగేళ్లలో బుల్లెట్​ ట్రైన్​ కారిడార్​ పనులను పూర్తి చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం అహ్మదాబాద్​– ముంబై రూట్​లో బుల్లెట్​ ట్రెయిన్​ కారిడార్​ పనులు నడుస్తున్నాయి. హైద‌రాబాద్ రూట్​తో పాటు మరికొన్ని రూట్ల నిర్మాణం కోసం నేషనల్​ హైస్పీడ్​ రైల్​ కార్పొరేషన్​ లిమిటెడ్​ సన్నాహాలు మొదలు పెట్టింది.


Share

Related posts

వకీల్ సాబ్ టార్గెట్ మిస్ అయినట్టేనా ..?

GRK

“ఎఫ్3” లో మరో మెగా హీరో..??

sekhar

బేబీ ఆయిల్ ని పెద్దవాళ్లు కూడా ఈ విధం గా వాడుకోవచ్చు!!

Kumar