NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

కాల్ ఎత్తితే బూతులా లేక స్పాట్ ఆ??

 

 

దేవినేని ఉమాకు రాత్రి నుంచి 10 సార్లు కాల్ చేశా.. నా కాల్ తీయడం లేదు.. మీరైనా ఫోన్ చేయండి. లేకపోతే మీ టీవీ లో డిబేట్ పెట్టండి. నేనే వస్తా… అంటూ మరోసారి పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మరోసారి దేవినేని ఉమా మీద ఓ టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ రెచ్చిపోయారు… గొల్లపూడి లో వైసిపి టిడిపి పోటాపోటీ ఈ కార్యక్రమాల్లో భాగంగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తోపాటు మైలవరం ఎమ్మెల్యే వసంత మోహం కూడా గొల్లపూడికి రావడంతో అక్కడే ఎన్టీఆర్ బొమ్మ దగ్గర దీక్షకూర్చుందాం అని వచ్చిన మాజీ మంత్రి దేవినేని ఉమ ను పోలీసులు అరెస్టు చేయడం తర్వాత టిడిపి కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు ఘర్షణ పెద్ద వివాదానికి దారి తీసింది. ఈ సమయంలోనే కొడాలి నాని ఇంటర్వ్యూ ఇస్తూ ఇప్పటికి పది సార్లు దేవినేని ఉమా కు కాల్ చేశాను అని… చెప్పడం అదే పదే పదే టీవీలో చూపించడం ఓ మంత్రి కి తగిన మాటలా లేక ముఖ్యమంత్రి జగన్ వీరిని కంట్రోల్ చేయడంలో ఎక్కడైనా లోపం ఉందా అనేది అర్థం కావడంలేదు.

ఫోన్ లో మాట్లాడితే ఎం చేస్తారు?

ఒకవేళ దేవినేని ఉమా పై కొడాలి నాని ఫోన్ కి స్పందించి ఫోన్ లిఫ్ట్ చేస్తే ఏం మాట్లాడేవారు..? ఏమైనా బూతులతో కలిపి వార్నింగ్ ఇస్తే… దానికి దేవినేని ఉమా కామ్ గా ఉంటారా? లేక డైరెక్టుగా డిబేట్ విటమిన్-ఇ ప్రోత్సహించడంలో ఆంతర్యమేమిటి? అంతేకాదు దేవినేని ఉమా ను కొడతానని బహిరంగంగా మంత్రి చెప్పడం ఎం రాజకీయం?? భౌతిక దాడులు ప్రజా ప్రతినిధులు చేయడం.. మంత్రులే కొడతామని హెచ్చరించడం కింది స్థాయి కార్యకర్తలకు, ప్రజలకు ఎలాంటి సందేశాన్ని సంకేతాలను ఇస్తోంది అన్నది మంత్రి కొడాలి నాని అసలు ఆలోచిస్తున్నారా అన్నదే ప్రధాన ప్రశ్న.

 

జగన్ ఎందుకు మౌనం!

మంత్రి హోదాలో కొడాలి నాని ఇష్టానుసారం ఆ ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడుతున్న వ్యవహరిస్తున్న దానికి ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఏమాత్రం స్పందించకపోవడం, కనీసం మంత్రిని మందలించపోవడం ఆయనే మంత్రిని ప్రోత్సహిస్తున్నారు అని అనుమానం అందరిలో కలగక మానదు. కొడాలి నాని వ్యాఖ్యలు చేత ల వల్ల వైఎస్ఆర్సిపి కార్యకర్తల కు కాస్త ఉత్సాహం నింపి వచ్చేమో గానీ సాధారణ ఓటరుకు మధ్యతరగతి వారికి ఈ వ్యాఖ్యలు భయం గొలిపే విధంగా ఉంటాయి. వైఎస్ఆర్సిపి పార్టీకి నష్టం చేకూర్చే విధంగానే ఉంటాయి. దీనిని జగన్ గుర్తించాలి. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి కానీ భౌతిక దాడులు, ఘర్షణలు కొట్లాటలు వల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయి. ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేది గానీ మంచిది కాదు.

వంశీ మధ్యలోకి..

మొన్నటి వరకు మంత్రి కొడాలి నాని కి దేవినేని ఉమామహేశ్వరరావు కి మధ్య ఉన్న వారిలో కి ఇప్పుడు గన్నవరం ఎమ్మెల్యే వంశీ కూడా వచ్చి చేరారు. వంశీ, కొడాలి నాని ప్రాణ మిత్రులు. ఇద్దరు టిడిపిలో ఉన్నప్పుడు ఒక్కటిగానే ఉండేవారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వైయస్సార్ సిపి లోకి వచ్చినప్పుడే గన్నవరం ఎమ్మెల్యే వంశీ కూడా వస్తారని అందరూ భావించారు. అయితే అప్పట్లో టీడీపీ లోనే ఉండి పోయిన వంశీ తర్వాత వైఎస్ఆర్సిపి పార్టీకి అనుబంధ ఎమ్మెల్యే గా కొనసాగుతున్న వైఎస్ఆర్ సీపీ పార్టీలోనే ఉన్నారు. ఇప్పుడు దేవినేని ఉమా గొడవలు సైతం స్నేహితుడికి సాయంగా, దేవినేని ఉమ తో తనకు ఉన్న పాత వివాదాలు దృష్టిలో పెట్టుకొని ఆయన సైతం రంగంలోకి దిగారు. దీంతో ఇది ఎటువైపు వెళుతుందో నన్నా ఆందోళన అందరిలో నెలకొంది.

ఎందుకీ సవాళ్లు!

ఏదైనా సమస్య మీద ప్రజా ప్రతినిధుల మధ్య చర్చ జరగడం అందరూ ఆహ్వానిస్తారు. ఆ చర్చలో ఆ సమస్యకు తగిన పరిష్కారం లభిస్తే మరీ మంచిది. అలా కాకుండా ఇలా వ్యక్తిగత విషయాల మీద, మాటలు కొట్లాటలు ప్రజాస్వామ్య దేశంలో అంత మంచిది కాదు. ఇది రాజకీయ వేడిని పెంచేది… వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ఉత్సాహాన్ని ఇచ్చేది వరకు మాత్రమే. దీని వల్ల వచ్చే ప్రయోజనం సున్నా. దీనినే అధికార విపక్షాల గుర్తిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఓ మంచి రాజకీయాలు అందుబాటులోకి వస్తాయి.

author avatar
Comrade CHE

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju