NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

మునిగిపోతున్న నావ ఆంధ్రప్రదేశ్ : కాగ్ చెప్పిన నిజమీదే

 

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మునిగిపోతోంది.. దేశంలో ఏ రాష్ట్రం లేనంత దారుణమైన పరిస్థితిలోకి వెళ్తోంది. పెద్ద రాష్ట్రాల కంటే అధిక మొత్తంలో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతుంది.. మళ్లీ బయటికి రాలేని చందంగా మారిపోతుంది. ఇదంతా ఏమిటనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్ పీకల్లోతు అప్పుల్లో మునిగి పోతోంది…. కనీసం రాష్ట్రాన్ని నడిపించే లేని స్థితిలో కి వెళ్ళిపోతుంది.. ఇది ఎవరో చెప్పింది కాదు… కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్( కాగ్) చెబుతున్న చేదు వాస్తవం.

ఇటు అప్పు లోనూ అటు ఖర్చులు లోనూ ఏపీ అగ్రస్థానంలో ఉంది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ ఈ విషయంలో చాలా ముందుందీ. ఎంత ముందు అంటే కనీసం ఎవరు దగ్గరకు రాని దూరంలో అప్పుల్లో అగ్రభాగంలో కొనసాగుతోంది.
దేశంలోని ఇతర పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే… ఆంధ్రప్రదేశ్‌ తన ఖర్చుల్లో ఎక్కువ భాగం.. అప్పుల రూపంలోనే సమీకరించినట్లు కాగ్ గణాంకాలు తేల్చాయి.
** ప్రతి వంద రూపాయల ఖర్చులో 51 రూపాయలు రుణాల ద్వారా తెచ్చుకున్నవేనని స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయంలో మిగతా రాష్ట్రాలు ఏపీ దరిదాపుల్లో కూడా లేవు.
** మరో వైపు బడ్జెట్‌ అంచనాల మేరకు ఎక్కువగా ఖర్చు చేస్తున్నదీ ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో దేశంలోని ఇతర పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే… ఆంధ్రప్రదేశ్‌ తన ఖర్చుల్లో ఎక్కువ భాగం అప్పుల రూపంలోనే సమీకరించింది.
** మిగిలిన కొన్ని ముఖ్య రాష్ట్రాల్లో ఇలా అప్పు రూపంలో తెచ్చుకున్నది 100 రూపాయలకు 30 రూపాయలు మించలేదు. అప్పు అంటే తిరిగి ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంది అది వడ్డీ రూపంలో.. భారం సైతం ఈ అప్పటి నుంచే మళ్లీ ఏపీ కడుతోంది.
** అక్టోబర్‌ వరకు కంప్ట్రోలర్ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌- కాగ్‌ లెక్కలు తెలిస్తే తేలిన పరిస్థితిది.
కేరళ, తెలంగాణలు 100 రూపాయల ఖర్చుల్లో దాదాపు 40 రూపాయలు అప్పు రూపంలో తీసుకుని ఖర్చు చేశాయి. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, పశ్చిమబెంగాల్‌, కేరళ రాష్ట్రాలతో మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను, ఇతర అంశాలను పోల్చి చూసినపుడు ఈ విషయం తెలుస్తోంది.
** కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితులు తలకిందులై పన్ను ఆదాయాలు చాలా రాష్ట్రాల్లో తగ్గిపోయాయి.
ఆంధ్రప్రదేశ్‌ కన్నా కొన్ని ఇతర రాష్ట్రాల్లోనే పన్నుల రూపంలో లభించిన ఆదాయం ఎక్కువగా ఉంది.
** బడ్జెట్ అంచనాల మేరకు ఖర్చు చేస్తున్నదీ ఏపీ మాత్రమే. అంటే ఓ ప్రణాళిక ప్రకారం వేసుకున్న బడ్జెట్ను అదే ప్రణాళికతో ఖర్చు చేస్తున్నది ఆంధ్ర ప్రదేశ్. ఇది జగన్ సర్కారుకు సానుకూల పరిణామం. తర్వాతి స్థానాల్లో కర్ణాటక, కేరళ ఉన్నాయి.


** సాధారణంగా బడ్జెట్‌ సమయంలో అనేక అంచనాలు వేస్తుంటారు రకరకాల కేటగిరీల్లో ఖర్చులు చూపిస్తుంటారు.
అయితే అసలు బడ్జెట్‌లో మాత్రం పొంతన లేని విధంగా ఆర్థిక బండి నడుస్తుంటుంది. ఏడాది చివరికి బడ్జెట్‌ ప్రతిపాదించిన రోజుల్లో చెప్పిన మేరకు ఖర్చు ఉండదు.
** కరోనా విజృంభించి ఆర్థిక కార్యకలాపాలు తగ్గినా.. ఏపీలో బడ్జెట్‌ అంచనాల మేరకు ఖర్చు చేస్తూ వస్తున్నారు. వంద రూపాయలు ఖర్చు చేస్తామని ప్రణాళిక రూపొందిస్తే… ఏపీలో తొలి ఏడు నెలల్లో ఇప్పటికే దాదాపు 56 రూపాయలు ఖర్చు చేశారు.
** కర్ణాటకలో 53, కేరళలో 49 రూపాయలు ఖర్చు చేశారు. ఇక చాలా రాష్ట్రాలు అంచనాలకు దూరంగానే ఉన్నాయి.
** జగన్ ప్రభుత్వం అన్ని రూపాల్లోనూ అప్పులను తెస్తోంది. సెక్యూరిటీలు బాండ్ల రూపంలో నేనూ అలాగే రిజర్వ్ బ్యాంకు దగ్గర పరిమితికి మించి అప్పు చేయడంలోనూ ఏపీ ముందు ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఏపీ కనీసం రాష్ట్ర నిర్వహణ చేయడం సాధ్యం కాదని కాగ్ తేల్చి చెప్పింది.

author avatar
Comrade CHE

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!