Corona: కరోనా రోగుల విషయంలో ఇద్దరు సీఎం లకు బంపర్ ఆఫర్ ఇచ్చిన కల్వరి టెంపుల్..!!

Share

Corona: కరోనా సెకండ్ వేవ్ ఇండియాలో విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజుకి లక్షల్లో కేసులు వేలల్లో మరణాలు. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉంది. కేసుల సంఖ్య ఊహించని విధంగా పెరుగుతూ ఉండటంతో.. కరోనా బారిన పడిన రోగులు బెడ్స్ లేక ఆక్సిజన్ కొరతతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సకాలంలో వైద్యం అందక ఆసుపత్రికి చేరుకున్న గాని గేటు బయటే ప్రాణాలు విడిచే పరిస్థితి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా రోగులు బెడ్స్, ఆక్సిజన్ కొరత విషయంలో ప్రభుత్వాలను వేడుకుంటూ ప్రాణాలు గాల్లోనే వదిలేస్తున్నారు. మరోపక్క ప్రభుత్వాలు శాయశక్తులా పని చేస్తూ ఉన్నా గాని కేసులు పెరుగుతూ ఉండటంతో .. చాలా మంది కరోనా రోగులకు వైద్యం అందని పరిస్థితి. ఇటువంటి తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లకు కల్వరి టెంపుల్ వ్యవస్థాపకులు సతీష్ కుమార్ బంపర్ ఆఫర్ ప్రకటించారు.

Calvary temple Bumper Offer to two state cms
Calvary temple Bumper Offer to two state cms

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం సృష్టిస్తున్న నేపథ్యంలో.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఎనిమిది బ్రాంచ్ చర్చిలను ఐసోలేషన్ వార్డులుగా ఉపయోగించుకోండి అంటూ ఇద్దరు ముఖ్యమంత్రులకు డాక్టర్ పి.సతీష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. కేవలం బ్రాంచ్ చర్చి లు ఇవ్వటం మాత్రమే కాక.. అక్కడికి వచ్చే రోగులకు ఫుడ్, బెడ్, మెడిసిన్ ఫ్రీగా కల్వరి టెంపుల్ యే అందిస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చి డాక్టర్స్ ని నర్స్ లని.. అందించగలిగి నట్లయితే.. ప్రభుత్వంతో పని చేయడానికి కల్వరి టెంపుల్ సిద్ధంగా ఉందని.. వ్యవస్థాపకులు సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఏ రీతిగా ప్రజల క్షేమం కోసం ప్రయాస పడుతుందో.. అదేరీతిలో సంఘంగా కల్వరి టెంపుల్ కూడా కలిసి పని చేయాలని అనుకుంటుంది.. అని తెలిపారు. ఎనిమిది బ్రాంచ్ చర్చి లు కొన్ని ఎకరాలలో ఉండటంతో..జగన్, కేసీఆర్ ప్రభుత్వాలు ముందుకు వస్తే చాలా మంది కరోనా రోగులను కాపాడినట్లు అవుతుందని అంటున్నారు.

 

 

ఇదిలా ఉంటే సతీష్ కుమార్ ఇచ్చిన పిలుపుకు చాలా మంది ప్రముఖులు రియాక్ట్ అవుతున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వాలు కల్వరి టెంపుల్ ఇచ్చిన ఆఫర్ నీ స్వీకరించి అనేక మంది ప్రాణాలను కాపాడాలని పిలుపునిస్తున్నారు. కేవలం మాటల్లో మాత్రమే కాక క్రియల్లో కూడా కల్వరి టెంపుల్ వ్యవస్థాపకులు సతీష్ కుమార్ ఇటువంటి కష్ట కాలంలో ప్రభుత్వాలకు ప్రజలకు అండగా నిలబడుతూ ఉండటంతో.. ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎనిమిది బ్రాంచ్ చర్చిలు కలిగిన ఈయన.. కరోనా వచ్చిన ప్రారంభంలో..లాక్ డౌన్ టైం లో అనేక మంది పేదలకు .. ఆపదలో ఉన్న వారికి కులం, మతం చూడకుండా ఎనిమిది వందల టన్నుల ఆహారాన్ని అందించడం జరిగింది.

 

గత ఏడాది హైదరాబాద్ లో వరదలు వచ్చిన సమయంలో…ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలులో వచ్చిన వరదల టైంలో కూడా.. అనేకమందిని ఆదుకున్నారు. ఏది ఏమైనా బోధిస్తున్న దాన్ని క్రియల్లో చూపిస్తూ అనేకమందికి ప్రేమను చాటుతున్న కల్వరి టెంపుల్.. చాలా కష్ట కాలంలో క్లిష్ట సమయంలో..దేశంలో మరణం భయంకరంగా సంచరిస్తున్న టైంలో అనేక మంది ప్రాణాలను కాపాడటానికి.. కరోనా రోగులకు వైద్యం అందించడానికి..ఫ్రీగా మందులు, భోజనం పెట్టడానికి కల్వరి టెంపుల్ ముందుకు రావడం పట్ల చాలా మంది ప్రముఖులు అభినందిస్తున్నారు. మరోపక్క సుప్రీంకోర్టు కూడా కరోనా రోగులను కాపాడటం విషయంలో అవసరమైతే.. దేశంలో చర్చిలు, మసీదులు, దేవాలయాలను ఐసోలేషన్ వార్డు లుగా ఉపయోగించుకోవచ్చు అంటూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇలాంటి తరుణంలో కల్వరి టెంపుల్ ముందుకు రావటం విశేషం.  


Share

Related posts

జ‌గ‌న్ పుట్టిన రోజు … రోజా నిజంగా గ్రేట్

sridhar

Tirath Singh Rawat : రేషన్ ఎక్కువ కావాలంటే ఏం చెయ్యాలో సలహా ఇచ్చిన నోటితీట సీఎం తీరత్ సింగ్! రాజుకున్న మరో వివాదం!

Yandamuri

మాజీ సిఐ మాధవ్ వైసిపిలో చేరిక

somaraju sharma