YS Jagan: ప్రకాశం జిల్లా అధికారుల అత్యుత్సాహం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పరిణామానికి దారి తీసింది.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే ఆగ్రహం తెప్పించే వరకు ఇది వెళ్లింది.ఆయన ఆదేశాలతో ఆగమేఘాలపై విచారణ జరిపి ఈ ఘటనకు సంబంధించి రవాణా శాఖ అధికారిణి సంధ్యతోపాటు హోంగార్డు తిరుపతిరెడ్డిలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అసలేం జరిగిందంటే!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఒంగోలులో మహిళా సాధికారత సదస్సు లో పాల్గొనడానికి వస్తున్నారు.ఈ నేపథ్యంలో ఆయన పర్యటనకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇంతవరకు బాగానే ఉంది.అయితే సీఎం కాన్వాయ్ లో ఉపయోగించడానికి కారులు తక్కువయ్యాయి అంటూ రవాణా శాఖ అధికారులు, పోలీసులు వాటి వేటలో పడ్డారు.ఈ క్రమంలో పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన ఒక కుటుంబం వారి బారిన పడింది.

- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తిరుపతి వెళుతుంటే కారు లాక్కున్నారు!
వినుకొండకు చెందిన వేముల శ్రీనివాస్ కుటుంబం తిరుమలేశుని దర్శనానికి సొంత ఇన్నోవా కారులో బుధవారం మధ్యాహ్నం బయలుదేరింది.ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఇద్దరు పిల్లలు ఆ కారులో ఉన్నారు.రాత్రి పది గంటల సమయంలో ఆ కుటుంబం ఒంగోలు పట్టణంలోని హోటల్ ముందు కారు ఆపి టిఫిన్ చేస్తుండగా ఒక కానిస్టేబుల్ వారి దగ్గరకు వచ్చాడు.కారు తాళాలు ఇమ్మని అడిగాడు.ఎందుకంటే సీఎం పర్యటనలో కాన్వాయ్ లో వాడుకోవడానికని చెప్పాడు.తాము తిరుపతి వెళుతున్నామని చెప్పినా అతడు వినిపించుకోలేదు.

- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఉన్నతాధికారుల ఆదేశాలతోనేనట!
అయితే ఆ కానిస్టేబుల్ తానేమీ చేయలేనని,సీఎం పర్యటనకు ఉన్నతాధికారులు కార్లు సమకూర్చమని తమను ఆదేశించారని,ఇప్పుడా డ్యూటీ చేస్తున్నానని వారికి చెప్పాడు.డ్రైవర్ తో సహా కారును తీసుకొని వెళ్ళిపోయాడు.దీంతో ఆ కుటుంబం నడిరోడ్డుమీద అర్థరాత్రిపూట నిలబడిపోయింది.ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో వారు దిక్కులు చూస్తూ ఉండటం మీడియా దృష్టికి వచ్చింది.వారు విషయాన్ని వన్టౌన్ సీఐ సుభాషిణి దృష్టికి తీసుకురాగా తాను విచారిస్తారని చెప్పారుగానీ ఆమె చేసిందేమీ లేదు.

- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మండిపడ్డ సీఎం జగన్!రవాణా శాఖ అధికారిణి పై వేటు
ఈ వార్త మీడియాలో రావడంతో విషయం సీఎం జగన్ దాకా వెళ్లింది.దీంతో ఆయన మండిపడ్డారు.ప్రజలను ఇబ్బంది పెట్టడం ఏమిటంటూ సంబంధిత అధికారులను మందలించినట్లు సమాచారం.అంతేగాక ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ ని కూడా సీఎం ఆదేశించారు.దీంతో అన్ని కోణాల నుంచి విచారణ జరిపి ఇదంతా ఒంగోలు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంధ్య ఆదేశాల మేరకు హోంగార్డు తిరుపతిరెడ్డి చేసిన నిర్వాకమని తేల్చేశారు.ఈ మేరకు నివేదిక అందడంతో ప్రభుత్వం వారిద్దర్నీ గురువారం మధ్యాహ్నం సస్పెండ్ చేసింది.అంతేగాక బాధిత కుటుంబానికి ప్రభుత్వం అపాలజీ కూడా తెలిపింది