16.2 C
Hyderabad
January 27, 2023
NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు వీడియోలు

ఆస్సామీ సింగర్‌పై కేసు

Share

గౌహతి(అస్సాం),జనవరి 27: భారతరత్న బిరుదుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రముఖ అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్‌ పై పోలీసులు కేసు నమోదు చేశారు.  ఈ నెల ప్రారంభంలో ఆయన భారతీయ జనతాపార్టీ, పౌరసత్వ సరవణ బిల్లుకు వ్యతిరేకంగా ‘పాలిటిక్స్ నో కొరిబా బాందో’ అనే  ఒక కొత్తపాటను విడుదల చేశారు. ఈ పాట వైరల్ అయ్యింది.

భారత రత్న బిరుదు గురించి గార్గ్ మాట్లాడిన ఆడియో టేపులు కూడా వైరల్ అయ్యాయి.

సవరణ బిల్లు గురించి అస్సాం ముఖ్యమంత్రి సరబానంద సోనోవాల్‌కు ఈనెల ఎనిమిదవ తేదీన గార్గ్ ఒక లేఖ రాశారు. తన ఫొటోతో పాటు లేఖను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ముఖ్యమంత్రి  ఆ లేఖపై స్పందించలేదు.

అస్సాం బిజెపి కిసాన్ మోర్చా నేత ఫిర్యాదు మేరకు గాయకుడిపై గౌహతి పోలీసులు కేసు నమోదు చేశారు.

2016 అస్సాం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గార్గ్ బిజెపికి అనుకూలంగా ఒక పాటను పాడారు. ఆయన పాట యువతను ఎంతో ఉత్సహా పరిచింది.

కేసుపై గార్గ్ స్పందిస్తూ తన పాటను వెనక్కు తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నాననీ, అయితే తన వల్ల బిజెపికి వచ్చిన ఓట్లను ఆ పార్టీ తిరిగి ఇవ్వగలదా అని ప్రశ్నించారు. జుబిన్ గార్గ్ ప్రస్తుతం కలకత్తాలో ఉన్నారు.

వివాదాస్పదమైన పాట కోసం క్లిక్ చేయండి:


Share

Related posts

ఆరవ శ్వేతపత్రం విడుదల

sarath

phone: ఫోన్ బ్యాటరీ లైఫ్ పెరగాలి అంటే ఈ టిప్స్ పాటించండి !!

siddhu

Corona: దేవుడా ర‌క్షించు నా దేశాన్ని … క‌రోనా థర్డ్ వేవ్ ఎంట్రీ!

sridhar

Leave a Comment