CBI: జగన్ కి సీబీఐ షాక్ తప్పదా..!? ఎల్లుండి ఏం జరగనుంది..!?

Share

CBI:  కోర్టు కేసుల నుండి.. సీబీఐ విచారణ నుండి.. ఎలా తప్పించుకోవాలి.. ఏ కారణాలు చెప్పాలి.. విచారణకు ఏ కారణాలు చెప్పి హాజరుకాకుండా ఉండాలి అని చూస్తున్న వైఎస్ జగన్మోహనరెడ్డికి సీబీఐ నుండి ఇక మీదట అటువంటి అవకాశాలు ఉండవు. జగన్ ఇకపై ఆ ఆలోచన చేయడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే సీబీఐలో దాఖలైన కేసులు ఇప్పుడు టైట్ అయ్యాయి. అదనంగా మరో రెండు చార్జిషీట్లు దాఖలు అయ్యాయి. దానితో పాటు ఈడీలో కేసులు కూడా టైట్ అయ్యాయి. ఇక మీదట విచారణ నుండి తప్పించుకునే అవకాశమే లేదు. కోర్టు విచారణకు హజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై తాజా అప్ డేట్ ఏమిటంటే.. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న కేసులో ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి ఇప్పుడు కొత్త చిక్కులు మొదలైయ్యాయి. అది ఏమిటంటే.. రెండు రోజుల క్రితం వ్యాన్ పిక్, లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసుల్లో సీబీఐ అదనపు చార్జి షీట్లు దాఖలు చేసింది. వీటిని సీబీఐ, ఈడీ ప్రత్యేక కోర్టులు స్వీకరించి అందులో ఉన్న నిందితులకు నోటీసులు ఇచ్చాయి. ఆ నిందితుల్లో ఏ 1గా జగన్మోహనరెడ్డి, ఏ 2 గా విజయసాయి రెడ్డి తో పాటు వాన్ పిక్ లో ప్రధానంగా వైసీపీ ఎంపి మోపిదేవి వెంకట రమణ, మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, బ్రహ్మనందరెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ప్రకాష్, రిటైర్డ్ ఐఏఎస్ లు శామ్యూల్, మన్ మోహన్ సింగ్ లు ఉండగా వీరందరికీ సీబీఐ నుండి సమన్లు అందాయి. వీరందరు సోమవారం జరగనున్న విచారణకు నేరుగా కోర్టు హజరుకావాల్సి ఉంది. మినహాయింపు కూడా దక్కేలా లేదు.

నిజానికి జగన్మోహనరెడ్డి సీఎం అయిన తరువాత ఆయన బెయిల్ షరతుల్లో ప్రధానంగా ఉన్న ప్రతి శుక్రవారం కోర్టు విచారణకు హజరు కావాలన్న షరతును ఉల్లంఘిస్తున్నారు. ఆయన సీఎంగా ఉండటం, ప్రత్యేక భద్రత తదితర అంశాలు, పరిపాలనా పరమైన కారణాలు, రాజ్యంగం కల్పించిన హక్కులు వీటన్నింటినీ చూపిస్తూ ప్రతి శుక్రవారం వాయిదాలకు హజరుకావడం లేదు. కానీ ఇప్పుడు తాజాగా దాఖలు చేసిన రెండు చార్జిషీట్లలో కూడా ఏ 1 గా జగన్మోహనరెడ్డి ఉన్నారు కాబట్టి ఈ విచారణను కూడా ఎలాగోలా తప్పించుకోవాలని జగన్మోహనరెడ్డి బృందం చూస్తుంటే వాళ్లను ఎలాగైనా టార్గెట్ చేసి చార్జి షీటులో ఉన్న అభియోగాలను నిరూపించాలని సీబీఐ ప్లాన్ చేస్తోంది. సీబీఐ కోర్టు కూడా ఈ సారి ఊరుకుండే అవకాశం లేదు. ఎందుకంటే ఇది తీవ్రమైన కేసు. వ్యాన్ పిక్ ల్యాండ్స్ దాదాపు 12 సంవత్సరాల నుండి ఎటుకాకుండా పోయాయి. దాదాపు 3 వేల ఎకరాలు ఈడీ, సీబీఐ కేసు కారణంగా ఎటుకాకుండా పోయాయి. ఈ కేసు ఏదో త్వరగా తేల్చేస్తే, దోషులను త్వరగా నిర్ధారిస్తే లేదా ఏ తప్పు లేదని తేల్చేసినా ఫరవాలేదు, ఏదో ఒకటి తేలాల్సి ఉంది. లేకుండా వాయిదాల మీద వాయిదాలతో వెళుతుంటే ఆ భూమి నిరుపయోగమే, దానికి భూములు ఇచ్చిన వాళ్లు, ఆ ప్రాజెక్టుకు పెట్టిన వేల కోట్ల ఖర్చు నిరుపయోగమే. అక్కడ ఫిషింగ్ హార్బర్, పోర్టు నిర్మించాలని అనుకున్నప్పటికీ ఏది నిర్మించలేకపోయింది.

వ్యాన్ పిక్ కేసు మాత్రం ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. వేలాది కోట్ల మేర అక్రమాలు జరిగాయని, తాము పెట్టిన పెట్టిన పెట్టుబడులు వెనక్కి ఇప్పించాలని నిమ్మగడ్డ ప్రసాద్ తో ఒప్పందం చేసుకున్న ఆల్ ఖైమా అనే సంస్థ ఇప్పటికే కోర్టుకు ఎక్కింది. ఆ కంపెనీ కూడా ఊరుకోవడం లేదు. సో.. మొత్తం మీద విదేశీ కంపెనీల ప్రమేయం ఉంది కాబట్టి మనీ లాండరింగ్, క్విడ్ ప్రొకో అనే కేసుల కిందకు కూడా వచ్చింది. ఇప్పుడు వీళ్లు ఎలాగొలా సీబీఐ లాయర్ ల ద్వారా కేసును ఏదో ఒకటి చేసి వాయిదా వేయాలని చూసినా అటు వైపు నుండి ఈ పిటిషన్ వేసిన విదేశీ కంపెనీలు, విదేశీ వ్యాపార సంస్థలు అంగీకరించే పరిస్థితి లేదు. కాబట్టి సీబీఐ మీద ఆ రకమైన ఒత్తిడి ఉంది. అందుకే కశ్చితంగా ఈ నెల 23 సోమవారం జరిగే విచారణకు జగన్మోహనరెడ్డి టీమ్ హజరుకావాల్సి ఉంది. అయితే జగన్మోహనరెడ్డి తరపు లాయర్లు మాత్రం విచారణకు ఆయన హజరుకాకుండా ఉండేందుకు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎటొచ్చీ సోమవారం అయితే హజరు అవ్వరు. నేరుగా జగన్మోహనరెడ్డి తరపు లాయర్ లు కోర్టుకు వెళ్లి ఎందుకు రాలేదో ఏమిటో కారణం చెప్పి వాయిదా కోరతారు. ఏదో ఒకటో రెండు వాయిదాలు అయితే ఇస్తారు కానీ మళ్లీ మళ్లీ అయితే వాయిదాలు ఇచ్చే అవకాశం లేనట్లు కనిపిస్తోంది. ఈ సీబీఐ కేసులో అదనపు చార్జి షీట్ల కారణంగా జగన్మోహనరెడ్డి మీద ప్రెజర్ అయితే ఎక్కువ అయిన మాట వాస్తవం.


Share

Related posts

బాబుకు కొలుసు సవాల్

somaraju sharma

బ్రేకింగ్: మళ్ళీ విషమించిన ఎస్పీ బాలు ఆరోగ్యం!

Vihari

Job Notification : ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్..!!

bharani jella