NewsOrbit
Featured రాజ‌కీయాలు

ఆ ముగ్గురి పదవులు పీకే వరకు బాబు వదలరు…!

అందరికీ గుర్తుండే ఉంటుంది… జగన్ సీఎం కాక ముందు ఆ 23 మంది ఎమ్మెల్యేలు.. ఆ 23 మంది ఎమ్మెల్యేలు అనేవారు. ఆ 23 మంది ఎమ్మెల్యేలు నాటి ప్రతిపక్ష వైసీపీని వీడి, అధికార టీడీపీలోకి జంపయ్యారు. అందుకే జగన్ కి బాగా కాలి రెండేళ్లకు పైగా వారిని బాగా గుర్తు పెట్టుకున్నారు. వారి పదవులు పోవాలని, మళ్ళీ ఎన్నికలకు రావాలని జగన్ అనేక సార్లు సవాలు చేసారు…!

ఇప్పుడు సేమ్ ఓ ముగ్గురు ఎమ్మెల్సీల విషయంలో చంద్రబాబుకి అదే పరిస్థితి ఎదురయింది. మరి జగన్ కంటే బాబు సీనియర్, ముదురు, కాస్త రాజకీయ తెలివి ఎక్కువ, పైగా మండలిలో చైర్మన్ గా తన మనిషి ఉన్నారు. అందుకే ముగ్గురు ఎమ్మెల్సీల విషయంలో బాబు పట్టు వీడడం లేదు.

 

ఈ ముగ్గురు చిక్కరు… దొరకరు…!

నిజానికి న్యాయ సూత్రాలు ప్రకారం చుస్తే ముగ్గురు ఎమ్మెల్సీ దొరికిపోయినట్టే. నాడు రాజధాని వికేంద్రీకరణ బిల్లుని అడ్డుకోవాలని తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా విప్ జారీ చేసింది. ఎమ్మెల్సీలు ముగ్గురు పోతుల సునీత, శివనాథ్ రెడ్డి, శమంతకమనిలు కచ్చితంగా పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ఓటు వేయాల్సిందే.., లేకపోతే వేటు తప్పదు అంటూ విప్ ఇచ్చేసింది. కానీ ఈ ముగ్గురు ధిక్కరించారు. అందుకే టీడీపీ పిర్యాదు చేసింది. విచారకు చైర్మన్ స్వీకరించారు. కానీ ఈ ముగ్గురు విచారణకు రావడం లేదు. నోటీసులు అందుకుని, గమ్మునుంటున్నారు. పార్టీ మారారు.., కానీ పదవులు ఉండాలంటున్నారు..! విచారణకు సిద్ధమే అంటున్నారు… కానీ మండలి చైర్మన్ పిలిస్తే రావడం లేదు. మూడు సార్లు విచారణకు హాజరు కాలేదు. ఇంకా ఇంకా సాకులు చెప్తూ సమయం అడుగుతున్నారు. తాజాగా ఈ నెల 2 న కూడా విచారణకు వెళ్లకపోవంతో… చైర్మన్ కి మాత్రం ఎంతకాలం సహనం ఉంటుంది. బాగా కాలింది.., ఇక చివరిగా మళ్ళీ నోటీసులిచ్చారు.

పాపం పోతుల సునీత…!

ఈ ముగ్గురు ఎమ్మెల్సీ నిజానికి అనుకున్నది ఒకటి అయినది ఒకటిగా మారింది. వీరితో పాటూ మరో పదిమంది వస్తారు. అందరూ కలిసి బిల్లు తిరస్కరిస్తే… కీలక బిల్లుకి మద్దతు ఇచ్చినందుకు జగన్ దగ్గర మంచి ప్రాధాన్యత దక్కుతుంది అనుకున్నారు. కానీ ఇది బెడిసికొట్టింది. ఈ ముగ్గురి రాకను కూడా జగన్ ఏమాత్రం అంగీకరించలేదు. కానీ స్థానిక పరిస్థితులు, అధికార దాహంతో పార్టీ మారిపోయారు. వీరిలో సమంతకమానికి మరో ఏడాది మాత్రమే వ్యవధి ఉంది. శివనాథ్ రెడ్డికి మూడేళ్లు, పోతుల సునీతకి రెండున్నరేళ్లు వ్యవధి ఉంది. పోతుల సునీత పార్టీ మారిన తర్వాత ఎటూ కాకుండా అయిపోయారు. కేవలం కార్యక్రమాల్లో ఫోటోల కోసం ఒంగోలు కలెక్టరేట్ కి వెళ్లి వస్తుంటారు. ఎమ్మెల్సీ అనే హోదా ఉన్నప్పటికీ అధికార పార్టీలో సాధారణ కార్యకర్తకు ఉన్న గుర్తింపు కూడా లేక అవస్థలు పడుతున్నారు. ఈమె స్థాయికి మించి చంద్రబాబు నాడు ఎమ్మెల్సి పదవి ఇచ్చినా.. ఆశపడి, ప్రలోభానికి లొంగి వైసిపిలోకి వెళ్లారని అపవాదు మూటగట్టుకున్నారు. ఇటు టీడీపీ కి దూరమై, అటు వైసిపిలో ప్రాధాన్యత లేక రాజకీయంగా ఇక తన భవిష్యత్తుని తాకట్టు పెట్టేశారని విమర్శలు ఉన్నాయి.

author avatar
Srinivas Manem

Related posts

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju