NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

సంచలన నిర్ణయం దిశగా కేంద్రం..! గవర్నర్ పై బాంబ్..??

Governor CM Meet: Key Issues to be discuss

ఏపీలో వేగంగా జరుగుతున్న రాజకీయ, పరిపాలనా విషయాలను గమనిస్తున్న కేంద్ర ప్రభుత్వం..గవర్నర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకునున్నదని వార్తలు వస్తున్నాయి. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు, కానగరాజ్ నియామకం విషయంలో గవర్నర్ ఆమోదించిన ఆర్డినెన్స్ ను హైకోర్టు కొట్టి వేసిన విషయం తెలిసిందే. ఈ కీలకమైన ఆర్డినెన్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం, న్యాయ నిపుణులను సంప్రదించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అనుకుంటున్నారు.

Governor CM Meet: Key Issues to be discuss
Ap governor harichandan

 

రాష్ట్ర ప్రభుత్వం పొరపాటు గానో, అనాలోచితంగానో ఏదయినా బిల్లులను గానీ ఆర్డినెన్సు లను గవర్నర్ ఆమోదం కొరకు పంపితే..అవి చట్ట పరిధిలో లేకపోతే సవరణలు చేసి పంపాలని ప్రభుత్వానికి సూచిస్తూ ఫైల్ ను వెనక్కు పంపవచ్చు. ఆ అధికారం గవర్నర్ కు ఉంటుంది. ఎన్ టీ రామారావులో హయంలో గానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో గానీ అప్పటి గవర్నర్ లు పలు సందర్భాలలో చట్టపరిదిలో లేని ఫైల్ లను తిప్పి పంపిన సందర్భాలు ఉన్నాయి. సాధారణంగా కీలక విషయాల్లో గవర్నర్ నిర్ణయాలు తీసుకున్నారు అంటే కేంద్రం కు చెప్పే అనుమతి తీసుకొని ఉంటారని అందరూ అనుకుంటారు.

కానీ నిమ్మగడ్డ విషయంలో ప్రభుత్వం ఆవేశపూరితంగా తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ ఓకే చెప్పడం, ఆ తరువాత కోర్టు ఆదేశాల మేరకు మళ్ళీ అయననే నియమించాల్సి రావడం, ఇటీవల సీఆర్డీఏ బిల్లు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులను గవర్నర్ ఆమోదించడం తెలిసిందే. ఒ పక్క రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుండగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కేంద్రాన్ని సంప్రదించకుండానే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఇది కేంద్రానికి తలనొప్పిగా మారుతోందట. ఈ నేపథ్యంలో గవర్నర్ బిశ్వభూషణ్ ను తప్పించి అయన స్థానంలో వేరే వారిని నియమించాలని కేంద్రంలోని బీజేపీ యోచన చేస్తుందని ప్రచారం జరుగుతోంది. అయన స్థానంలో పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ భేడీ పేరు తెరపైకి వస్తున్నది. గతంలో బిశ్వభూషణ్ హరిచందన్ నియామకం కంటే ముందు కూడా కిరణ్ భేడీ గవర్నర్ గా రానున్నారని ప్రచారం జరిగింది. జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఉందా లేదా అనేది తేలాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

author avatar
sharma somaraju Content Editor

Related posts

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju