వెళ్లవయ్యా ! బాబూ

అమరావతి, జనవరి 5:  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు  విదేశీ పర్యటనపై కేంద్రం విధించిన ఆంక్షలను సడలించింది. ఈ నెల 20 నుండి 26వ తేదీ వరకూ దావోస్‌ జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు  చంద్రబాబు వెళుతుండగా..ఆయన పర్యటనకు తొలుత కేంద్రం పలు ఆంక్షలు విధించింది. పర్యటనను నాలుగు రోజులకు కుదించుకోవాలని,  ఐదుగురే వెళ్లాలని సూచించిన విషయం విదితమే.  ఈ  ఆంక్షలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.  మరో మారు కేంద్రానికి ధరఖాస్తు చేయాలని సీఎంఓను  ఆదేశించారు. దీనిపై మనసు మార్చుకున్న కేంద్రం తన బృందంతో దావోస్ పర్యటనకు అనుమతి ఇస్తూ పర్యటన నాలుగు రోజులకు కుదించింది.