NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీలో.., ఈ 19 మందిలో ఉండేదెవరు..? ఊడేదెవరు..?? (పార్ట్ – 1 )

పాపం టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు చంద్రబాబుకి షాకులు ఇస్తూనే ఉన్నారు. పటియికి అత్యంత కంకణ బద్ధులుగా ఉంటారన్న నేతలు కూడా మారిపోతుండడం బాబుకి మింగుడుపడడం లేదు. వల్లభనేని వంశి, కరణం బలరాం, మద్దాల గిరి, వాసుపల్లి గణేష్ ఈ నలుగురు చంద్రబాబుకి సొంత మనుషుల్లా ఉండేవారు. వీరిలోనూ వంశీ, కరణం బలరాం అయితే మరింత చనువుతో ఉండేవారు. కానీ వీరిచ్చిన షాక్ తో బాబు ఇంకా తేరుకోలేదు. ఇది ఇక్కడితో ఆగదు అని వైసిపి చెప్తుంది. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారంటూ వైసీపీ వర్గాల నుండి పుకార్లు వస్తున్నాయి. అదే జరిగితే బాబుకి ప్రతిపక్ష హోదా గల్లంతవడం ఖాయమే.! అందుకే ఇప్పుడున్న 19 మందిలో ఉండేదెవరు..? ఊడేదెవరు అనేది చూద్దాం..!! “న్యూస్ ఆర్బిట్” కి ఉన్న సోర్సులు, సమాచార సేకరణ వ్యవస్థ ద్వారా ఈ ప్రత్యేక కథనం..!!

బెందాళం అశోక్ (ఇచ్చాపురం) – యువకుడు (38 ఏళ్ళు). విద్యావంతుడు(పంటి వైద్యుడు). స్థానికంగా మంచి పేరుంది, జనంలో పట్టుంది. 2014 లో గెలిచిన తర్వాత వివాద రహితుడిగా, తన పని తాను చేసుకునే వాడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. అందుకే 2019 లో వైసీపీ గాలిలో కూడా 7 వేల ఆధిక్యతతో గెలిచారు. ఇప్పుడు వైసిపి నుండి ఈయనకు ఆహ్వానం ఉంది. కొద్దికాలంగా చర్చలు జరుపుతున్నారు. సమకాలీయం రాజకీయ వ్యవస్థకు ఈయన ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. అందుకే పార్టీ మారే ఉద్దేశం, అవకాశం లేదు.

Read also >> టీడీపీలో ఉండేదెవరు..? ఊడేదెవరు..!? (పార్ట్ – 2 )

అచ్చెన్నాయుడు (టెక్కలి) – టీడీపీ ఆవిర్భావం నుండి ఆ పార్టీలోనే ఉన్న కుటుంబం. ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు తో కలిసి జిల్లాలో, రాష్ట్రంలో కీలక నేతగా ఉన్నారు. పార్టీ మార్పు అసాధ్యం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడుగా కూడా ఈయన పేరు పరిశీలనలో ఉంది.

వెలగపూడి రామకృష్ణ (విశాఖ తూర్పు) – టీడీపీ నుండి వరుసగా మూడు సార్లు గెలిచారు. మాస్ లీడర్. ఆ నియోజకవర్గంలో ఆసాంతం తెలిసిన వ్యక్తి. ఈయన సొంత ప్రాంతం కృష్ణా జిల్లా. కానీ వ్యాపారాల రీత్యా కొన్ని దశాబ్దాల కిందట విశాఖలో సెటిల్ అయ్యారు. కాలేజిలు ఉన్నాయి. టీడీపీ హయాంలో కొన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వాటిపై ఇప్పుడు కొన్ని ఒత్తిళ్లు నడుస్తున్నాయి. ఇటువంటి నాయకుడి అవసరం పార్టీకి ఉందని గ్రహించిన వైసీపీ ఈయనను ఆహ్వానిస్తుంది. కొన్ని చర్చలు, ఒత్తిళ్లు కొనసాగుతున్నాయి. కానీ సామాజికవర్గం, చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం, నియోజకవర్గ సెంటిమెంట్ దృష్ట్యా ఆయన పార్టీ మారే అవకాశం లేదు అంటున్నారు.

గంటా శ్రీనివాసరావు (విశాఖ ఉత్తర) – ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన చరిత్ర కాదు. మొదటి నుండి పార్టీలు మారుతూ, ఆధిపత్యం చేస్తూ ఇప్పుడు టీడీపీలో ఉండలేక ఉంటున్నారు. తన రాజకీయ జీవితంలో తొలిసారి ఇలా అధికార పార్టీకి దూరంగా ఉండడం. అందుకే ఓ క్షణమైనా దూకేయ్యడానికి సిద్ధమే. అక్కడి మంత్రి అవంతి శ్రీనివాసరావు, కీలక నేత విజయసాయి ఒప్పుకోవట్లేదు కానీ, లేకపోతే ఇప్పటికే గంటా జగన్ కి జేగంట కొట్టేసేవారు.

Read also >> టీడీపీలో ఉండేదెవరు..? ఊడేదెవరు..!? (పార్ట్ – 2 )

గణబాబు (విశాఖ పశ్చిమ) – టీడీపీ కి ఆ జిల్లాలో కీలక, చంద్రబాబుకి నమ్మదగిన ఎమ్మెల్యే. 2014 , 2019 వరుసగా రెండు ఎన్నికల్లో గెలిచారు. మంచి ఆధిక్యత ఉంది. నియోజకవర్గంలో అందుబాటులో ఉంటారు, వివాదాలకు దూరం అనే పేరుంది. పార్టీ మారే అవకాశాలు కొట్టి పారేయలేం. చర్చల దశలో ఉంది. ఇటీవల జగన్ కి జై కొట్టిన గణేష్ కుమార్ తో ఉన్న స్నేహం, సాన్నిహిత్యం.., స్థానికంగా అధికార పార్టీ ఒత్తిళ్ల కారణంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ టీడీపీ, చంద్రబాబు అనే సెంటిమెంట్ బలంగా ఈయనతో ఉంది.

ఆదిరెడ్డి భవాని (రాజమండ్రి సిటీ) – ఎర్రన్నాయుడు కుమార్తె. 30 వేల ఆధిక్యతతో గెలిచారు. ఈ కుటుంబానికి ఉన్న పేరు, రాజమండ్రి ప్రాంతంలో పార్టీ పట్టు కారణంగా సులువుగా గెలిచారు. అయితే వైసీపీ వల ఆరంభమయింది. ఈమె మామ ఆదిరెడ్య్ అప్పారావు వైసిపిలో ఎమ్మెల్సీ గా ఉంటూ 2016 లో టీడీపీలో చేరారు. ఆ పరిచయాలు, ఒత్తిళ్లు, కొన్ని చర్చల నేపథ్యంలో ఇప్పుడు అంతర్గత దశలో చర్చలు ఉన్నాయి. అయితే టీడీపీలో ఆమెకి మంచి భవిష్యత్తు ఇస్తామని చంద్రబాబు భరోసా ఇస్తున్నారు. పార్టీ మారే అవకాశాలు స్వల్పమే.

గోరంట్ల బుచ్చయ్య చౌదరి (రాజమండ్రి గ్రామీణం) – టీడీపీకి, చంద్రబాబుకి, ఆ సామజిక వర్గానికి అత్యంత నమ్మకస్తుడు. జగన్ అంటే ఒంటికాలిపై లేచే ఎమ్మెల్యే ఈయన. పార్టీ మారడం అసాధ్యం.

జోగేశ్వరరావు (మండపేట) – కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీకి, నియోజకవర్గానికి అంకితమైపోతారు. అటువంటి కొద్దిమంది నేతల్లో ఈయన ఒకరు. వరుసగా మూడు ఎన్నికల్లో గెలిచారు. మండపేటలో మంచి క్యాడర్ ఉంది. పార్టీలో పట్టుంది. వివాద రహితుడు. పార్టీ మారే అవకాశాలు లేవు.

చినరాజప్ప (పెద్దాపురం) – టీడీపీకి, చంద్రబాబుకి అత్యంత నమ్మకస్తుడు. రెండు దశాబ్దాల పాటు పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. పార్టీ ఏం చెప్తే అది చేసే కొద్దీ మంది నేతల్లో ఈయన ఒకరు. పార్టీ వారే అవకాశాలే లేవు.

note : కంటిన్యూషన్ రెండో పార్ట్ ఈరోజు సాయంత్రం..!

Read also >> టీడీపీలో ఉండేదెవరు..? ఊడేదెవరు..!? (పార్ట్ – 2 )

author avatar
Srinivas Manem

Related posts

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N