న్యూస్ రాజ‌కీయాలు

బిగ్ బ్రేకింగ్: చంచల్ గూడ జైలుకు…అఖిల ప్రియ..!!

Share

బోయిన్ పల్లి కిడ్నాప్ కేస్ లో A1 గా ఆరోపణలు ఎదుర్కొంటున్న అఖిల ప్రియ మూడు రోజులపాటు పోలీసు కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. న్యాయస్థానం తీర్పు మేరకు ఈరోజుతో కస్టడీ ముగియడంతో పోలీసులు జడ్జి నివాసంలో అఖిలప్రియ ని హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో అఖిలప్రియ తరఫున న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. కాగా బెయిల్ పిటిషన్ పై విచారణ ఎల్లుండికి వాయిదా వేశారు. దీంతో తిరిగి అఖిలప్రియ ని చంచల్ గూడ జైలుకు పోలీసులు తరలించారు.

Andhra Tourism Minister Bhuma Akhila Priya irked by father's aide, latter lashes out | The News Minuteమూడు రోజులు కస్టడీలో రోజుకి వంద ప్రశ్నలు చొప్పున 300 ప్రశ్నలు బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్ లో అఖిల ప్రియా కి పోలీసులు వేసినట్లు.. వాటిలో కొన్ని ప్రశ్నలకు మాత్రమే ఆమె సమాధానం చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. విచారణలో అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ గురించి కూడా ప్రస్తావన వచ్చినట్లు మీడియా సర్కిల్స్ లో కథనాలు వస్తున్నాయి.

 

ఏదిఏమైనా కేసు తీవ్రత బట్టి చూస్తే ప్రస్తుతం మాత్రం అఖిలప్రియ కి బెయిలు వచ్చే అవకాశం లేదని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. కోర్టు సెలవుల కారణంగా న్యాయమూర్తి నివాసంలో విచారణకు హాజరు కాకముందు అఖిల ప్రియా కి వైద్యపరీక్షలు గాంధీ ఆసుపత్రిలో నిర్వహించారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఈ తరుణంలో మూడు రోజులు కస్టడీలో విచారణకు జరిపించిన స్టేట్మెంట్ ని పోలీసులు న్యాయమూర్తికి అందించారు. అనంతరం అఖిలప్రియ ని చంచల్ గూడా మహిళా జైలుకు పోలీసులు తరలించడం జరిగింది. 


Share

Related posts

F 3 : ఎఫ్ 3 లో తమన్నా, మెహ్రీన్ తో పాటు వకీల్ సాబ్ హీరోయిన్ కూడా..?

GRK

Mango leaves: మామిడాకు ను ఎలా వాడాలో.. ఎందుకోసం వాడాలో తెలిస్తే అసలు వదిలిపెట్టరు ??

Kumar

Relationship tips: మీ భాగస్వామి  తో ఇలా ప్రవర్తించడం వలన.. పడక గదిలో ఏమి జారుతుందో తెలుసా?

Kumar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar