ఎడాపెడా దాడులతో బాబు దడ దడ !

ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల్లో వైసీపీ ,రాయలసీమలో బిజెపి టిడిపి నేతలను లాగేసే పనిలో పడ్డంతో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

chandra babu fear about attacks
chandra babu fear about attacks

ఇప్పటికే వైసిపి ప్రకాశం గుంటూరు కృష్ణా విశాఖపట్నం జిల్లాలకు చెందిన నలుగురు టిడిపి ఎమ్మెల్యేలను లాక్కోవడం తెలిసిందే.మరో ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా ఉన్నారని వారిని కూడా పార్టీలోకి తెచ్చుకుని చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్ష నాయకుడి హోదా లేకుండా చేసే పనిలో వైసిపి ఉందని సమాచారం.వైసీపీకి అవసరం లేకపోయినప్పటికీ టిడిపి ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకోవటం వెనుక ఇదే అంతరార్థం.ఇక మరోవైపు బిజెపి రాయలసీమలో టిడిపి నేతలకు గాలం వేస్తోంది.సీమ‌లోని నాలుగు జిల్లాల్లో క‌ర్నూలు, అనంత‌పురం, క‌డ‌ప‌లో బీజేపీ నాయ‌కులు, సానుభూతి ప‌రులు ఉన్నారు. పైగా ఆయా జిల్లాల్లో వైసీపీ అంటే గిట్టని వారు కూడా క‌నిపిస్తారు. ఈ క్రమంలో ఇలాంటి వారిని త‌న గూటికి చేర్చుకునేందుకు బీజేపీ పావులు క‌దుపుతోంది. వీరిలో ఎక్కువ‌మంది కేంద్రంతో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాల‌నుకునేవారు ఉండ‌డం.. బీజేపీకి క‌లిసివ‌స్తున్న ప‌రిణామం.


రాయ‌ల‌సీమ‌లో పాత టీడీపీ క‌మ్మ నేత‌లుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వ‌ర‌దాపురం సూరి, అభిరుచి మ‌ధు ఇప్పటికే కాషాయం గూటికి చేరిపోయారు. కడప జిల్లాలో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి ఎప్పుడో బిజెపిలో బిజెపిలో చేరారు ఇక ఇదే లిస్టులో అనంత‌పురం జిల్లాకే చెందిన మాజీ క‌మ్మ ఎమ్మెల్యే ప్రభాక‌ర్ చౌద‌రి పేరు కూడా వినిపిస్తుంది. ఇక చిత్తూరు జిల్లాలోనూ కొంద‌రు క‌మ్మ టీడీపీ నేత‌లు బీజేపీ వైపు చూస్తున్నార‌ట‌. అలాగే రాజధాని జిల్లాల్లోని కొందరు టిడిపి నేతలు వైసిపి కంటే బిజెపిలో చేరడం బెటరన్న ఉద్దేశంతో ఉన్నారట.

chandra babu fear about attacks
chandra babu fear about attacks

ఇప్పుడు కోస్తా జిల్లాలకు చెందిన దగ్గుబాటి పురంధరేశ్వరి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కావడంతో ఆమె ఆధ్వర్యంలో కొందరు కోస్తా నేతలు బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయి.మొత్తంమీద చంద్రబాబు పరిస్థితి ముందు నుయ్యి…వెనుక గొయ్యి అన్నట్లు తయారైంది.ఈ పరిస్థితుల్లో 2024 ఎన్నికల వరకు టిడిపిని పరిరక్షించుకోవడమనేది చంద్రబాబు కి పెద్ద అగ్ని పరీక్షేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.మరి ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశంగా తీసుకుంటానని చెప్పే నారావారు ఏంచేస్తారో చూడాలి