NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

పయ్యావుల పై చంద్రబాబు గుస్సా! అసలు మేటర్ ఏమిటంటే ??

అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు పయ్యావుల కేశవ్ పక్కచూపులు చూస్తున్నాడని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అనుమానిస్తున్నట్లు కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.ఈ కారణం చేతే ఆయనకు ఇటీవల టిడిపి జరిపిన పదవుల పందేరంలో ఏ ఒక్కదానిని చంద్రబాబు ఇవ్వలేదంటున్నారు.నిజానికి చంద్రబాబు అనంతపురం జిల్లాలో పయ్యావుల కేశవ్ కి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారనే చెప్పాలి.2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోయినప్పటికీ తదుపరి చంద్రబాబు ఆయనను ఎమ్మెల్సీని చేశారు.

chandra babu fire on payyavula keshav
chandra babu fire on payyavula keshav

వైసిపి కూడా పయ్యావుల కేశవ్ ను టార్గెట్ చేసి అనేక ఆరోపణలు చేసింది. రాజధాని అమరావతిలో ఆయన ఇన్సైడ్ ట్రేడింగ్ కు పాల్పడ్డాడని ఆరోపించింది. కేశవు కూడా టీడీపీకి అత్యంత విధేయంగా పనిచేశారు ఆ పార్టీకి అనుకూలంగా వాయిస్ వినిపించే వారు. ఇక మొన్నటి ఎన్నికల్లో అయితే పయ్యావుల కేశవ్ జగన్ సునామీని అధిగమించి ఉరవకొండ నుండి విజయం సాధించారు.తదుపరి శాసనసభలో ఆనవాయితీగా ఉన్న ప్రతిపక్షానికి ఇచ్చే ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పదవిని చంద్రబాబు పట్టుబట్టి పయ్యావుల కేశవ్ కే ఇప్పించారు.ఆ తదుపరి కేశవ వైఖరిలో మార్పు వచ్చిందని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. పైగా ఆయ‌న ప్రజాప‌ద్దుల క‌మిటీ చైర్మన్‌గా ఉండి కూడా ఇసుక అక్రమాలు, గ‌నుల అక్రమాలు, నాడు-నేడులో జ‌రుగుతున్న దుర్వినియోగం.. వివిధ ప‌థ‌కాల్లో జ‌రుగుతున్న అవినీతిపై ఇప్పటివ‌ర‌కు ఆయన ఒక్క‌సారి కూడా స‌మావేశం నిర్వహించ‌క‌పోవ‌డం.. ప్రభుత్వంపై నివేదిక ఇవ్వక‌పోవ‌డాని వారు వేలెత్తి చూపుతున్నారు.

chandra babu fire on payyavula keshav
chandra babu fire on payyavula keshav

ప్రభుత్వం పై పోరాడటానికి ఇలాంటి ఆయుధం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి అత్యంత అవసరం.తన పార్టీ వాడే ఈ పదవిలో ఉన్నందున ఏదో ఒక విధంగా తమకు కొన్ని విమర్శనాస్త్రాలు అందిస్తారని చంద్రబాబు భావించారట.కానీ పయ్యావుల కేశవ్ ఆ ఊసే ఎత్తక పోగా తనకు లభించిన క్యాబినెట్ హోదా పదవిని ఎంజాయ్ చేస్తున్నారని టిడిపి వర్గాలు చెప్పుకుంటున్నాయి. అంతేగాకుండా ఇటీవలి కాలంలో పయ్యావుల కేశవ్ టిడిపి కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారట .ఇవన్నీ చంద్రబాబు దృష్టిలో పడడంతో ఆయన తన సామాజిక వర్గీయుడే అయినప్పటికీ పయ్యావుల కేశవ్ కు చెక్ పెట్టే కార్యక్రమం చేపట్టారట.పయ్యావుల కేశవ్ పార్టీలో కొనసాగడంపైనా అనుమానం పెంచుకున్న చంద్రబాబు ఇక ఆయనకు ఏ పదవి ఇచ్చే ఆలోచనను విరమించుకున్నారని టిడిపి వర్గాల సమాచారం.మొత్తం మీద చూస్తే పయ్యావుల కేశవ్ పార్టీ అధినేత చంద్రబాబు అనుగ్రహాన్ని కోల్పోయినట్లే స్పష్టమవుతోంది.

author avatar
Yandamuri

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju