ఎందుకని ప్రకాశం జిల్లాపై బాబు శీతకన్ను వేశారు?

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా మీద శీతకన్ను వేశారు. మొన్నటి తెలుగుదేశం పార్టీకి 23 స్థానాలు వస్తే అందులో 4 స్థానాలు ప్రకాశం జిల్లా నుంచి వచ్చాయి.దక్షిణ కోస్తా జిల్లాల్లో టిడిపి పరువు నిలిపింది ప్రకాశం జిల్లానే!చీరాల అద్దంకి పర్చూరు కొండపి నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్థులు కరణం బలరామ్,గొట్టిపాటి రవికుమార్ ఏలూరి సాంబశివరావు డివిబి స్వామి విజయ కేతన౦ ఎగరేశారు.వీరిలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ్ మాత్రం జగన్ కి జై కొట్టారు. మిగిలిన ముగ్గురు టిడిపిలోనే ఉన్నారు. అయితే ఎందుకో చంద్రబాబునాయుడు ప్రకాశం జిల్లాను పట్టించుకోవడం లేదు.

chandra babu planning on prakasam district
chandra babu planning on prakasam district

సోమవారం నాడు టిడిపి పొలిట్ బ్యూరో ,జాతీయ పార్టీ కార్యవర్గాన్ని చంద్రబాబు ప్రకటించగా అందులో ప్రకాశం జిల్లా నుంచి ఏ ఒక్కరికీ స్థానం లభించకపోవడం ఇందుకు నిదర్శనం.ఇరవై ఏడు మంది తో టిడిపి పార్టీ సెంట్రల్ కమిటీ ,ఇరవై అయిదు మందితో పొలిట్ బ్యూరోను చంద్రబాబు ఏర్పాటు చేశారు.కానీ వీరిలో ప్రకాశం జిల్లా ముఖం ఒక్కటి కూడా లేదు.గతంలో టీడీపీ పొలిట్ బ్యూరోలో ప్రకాశం జిల్లా నుండి కరణం బలరామ్ సిద్దా రాఘవరావు తదితరులు ఉండేవారు.అలాంటిది ఈసారి పోలిట్ బ్యూరోలో ప్రకాశం జిల్లాకు స్థానమే లేదు.పొరుగునున్న నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఒక్క అసెంబ్లీ స్థానాన్ని గెలవక పోయినప్పటికీ ఆ జిల్లాకు చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డికి పొలిట్ బ్యూరోలో అవకాశం కల్పించారు.మరో పొరుగున ఉండే గుంటూరు జిల్లాలో మొన్నటి ఎన్నికల్లో ఒక్క టిడిపి ఎమ్మెల్యేనే గెలిచినప్పటికీ ఆ జిల్లాకు చెందిన మాజీ మంత్రి నక్కా ఆనందబాబుకు పొలిట్ బ్యూరోలో స్థానం ఇచ్చారు.

chandra babu planning on prakasam district
chandra babu planning on prakasam district

అలాంటిది ముగ్గురు టిడిపి శాసనసభ్యులున్న ప్రకాశం జిల్లా నుండి ఎవరికి పొలిట్బ్యూరోలో స్థానం కల్పించకపోవడం విమర్శలకు తావిస్తోంది.ఇంకా విచిత్రంగా టిడిపికి రాజీనామా చేసిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తల్లి ,మాజీ మంత్రి గల్లా అరుణకుమారికి టిడిపి సెంట్రల్ కమిటీలో పదవి ఇవ్వడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.ప్రకాశం జిల్లాలో టిడిపికి అంకితమై పనిచేస్తున్న నాయకులందెరో ఉన్నారు.వీరు చంద్రబాబుకు ఎందుకు కనిపించడం లేదన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ.