NewsOrbit
Featured రాజ‌కీయాలు

కేసీఆర్ ఆగవోయ్..! ఆ విషయంలో చంద్రబాబు తర్వాత ముమ్మాటికీ జగనే…!!

కేసీఆర్ ఓ పెద్ద మూడిష్టు… ఎప్పుడు ఎవరిపై, ఏ అంశంపై దాడి చేస్తారో తెలియదు. ఎప్పుడు కనిపిస్తేరో, లేదో కూడా తెలియదు..! ఓ సారి ప్రతిపక్షాలను ఆడుకుంటారు.., మరోసారి వీళ్ళు మాకు పోటీనే కాదు అంటారు…! ఓ సారి మోడీని విమర్శిస్తారు…, ఓ సారి మోడీ బాగా చేస్తున్నారంటారు…! ఓ సారి ఫెడరల్ ఫ్రంట్ అంటారు.., ఓ సారి తెలంగాణ ముఖ్యం అంటారు…!

ఈ మూడిజానికి ఉన్న ఏకైన లక్ష్యం మాత్రం కొడుకుకి సింహాసనం ఎక్కించేసి తానూ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేయడమే..!! అందుకే తెరవెనుక పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఇక కొత్త సచివాలయం వచ్చేస్తే ఆ తంతు ముగిసినట్టే. కొడుకుని సీఎం కుర్చీ ఎక్కించడం సులువే.., కానీ తాను జాతీయ రాజకీయాల్లో కుర్చీ వేసుకోవడమే కష్టం.., కనీసం కుర్చీపై కర్చీఫ్ వేయడం కూడా కష్టమే…!! ఎందుకు, ఎలా..? అనేది చూద్దాం…!!

 

chandrababu and jagan better than kcr in-that type politics
chandrababu and jagan better than kcr in that type politics

కేసీఆర్ ని జాతీయ స్థాయిలో గుర్తిస్తున్నారా…??

అసలు కేసీఆర్ అంటే ఎవరు..? జాతీయ స్థాయిలో అతన్ని గుర్తిస్తున్నారా అంటే అనేక అనుమానాలు..!!
* మొన్నటి ఇండియాటుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో పీఎం గా ఎవరు బాగా పని చేస్తారు..? అనే ప్రశ్నలో అసలు కేసీఆర్ పేరునే ప్రస్తావించలేదు.
మోడీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, అమిత్ షా, నితిన్ గడ్కరీ, యోగి ఆదిత్యానంద, కేజ్రీవాల్, మాయావతి, శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రే తదితరులు ఉన్న ఆ సర్వేలో అసలు కేసీఆర్ పేరు లేదు. పాపం… 45 ఏళ్ళ చంద్రబాబు పేరు కూడా లేదు.


* అదే సర్వేలో బెస్ట్ సీఎం సర్వేలో కేసీఆర్ ఎక్కడో తొమ్మిదో స్థానంలో ఉన్నారు. కేవలం మూడు శాతం మంది మాత్రమే మద్దతు పలికారు. యోగి, కేజ్రీవాల్, జగన్ ఈ జాబితాలో తోలి మూడు స్థానాల్లో ఉన్న సంగతి తెలిసిందే.
* శాసనసభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేసీఆర్ తన తొలి ప్రసంగంలోని ఇక జాతీయ రాజకీయాలు లక్ష్యం అని ప్రకటించారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ ఓటర్లు “అయ్యా కేసీఆర్ నువ్వు తెలంగాణ కి చాలు, జాతీయాలకు వద్దు అని చెప్పకనే చెప్పి, సగం స్థానాలే గెలిపించారు.

వీళ్ళని కలుపుకుని వెళ్లడం తేలికా…??

ఫెడరల్ ఫ్రంట్ అంటే కేసీఆర్ తోడు జగన్ ఒక్కరే ఉంటె చాలదు… స్టాలిన్, మమతా బెనర్జీ, శరద్ పవర్, అఖిలేష్ యాదవ్, కేజ్రీవాల్, ఉద్ధవ్ థాక్రే, నవీన్ పట్నాయక్ వీళ్ళందరూ నీతో కలిసి రవళి. వచ్చినా… వీరిలో మమతా, శరద్ పవర్, నవీన్ పట్నాయక్ ల కంటే కేసీఆర్ జూనియర్. వీళ్ళు చంద్రబాబుకి లొంగినంతగా కేసీఆర్ కి లొంగరు.


* నిజానికి 2019 ఎన్నికలకు ముందు బీజేపీ యేతర ఫ్రంట్ కోసం చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. ఆ ఫలితంలో చంద్రబాబు విఫలమయ్యారు కానీ… ప్రయత్నంలో విఫలమవ్వలేదు. కానీ కేసీఆర్ తన ప్రయత్నంలోనే విఫలమయ్యారు. ఎవర్ని కలిసి పెద్దగా స్పందించలేదు. మమతా, శరద్ పవర్, కేజ్రీవాల్ వద్ద చంద్రబాబుకి వచ్చినంత సానుకూల స్పందన కేసీఆర్ కి రాలేదు.

ఇంట గెలిచి… బయట గెలవాలి…!!

కేసీఆర్ ఏమి తెలియని నేత కాదు. ఇంట గెలిచి, బయట గెలవాలని అనే ప్రాధమిక సూత్రం తెలియని వారు కాదు. అంటే తన ఇంట తెలంగాణాలో 16 కి కనీసం 13 , 14 గెలిస్తే జాతీయ రాజకీయానికి ఆమోదం లభించినట్టే. కేసీఆర్ మాటలకు, కేటీఆర్ నాయకత్వానికి… తెలంగాణాలో కాంగ్రెస్, బీజేపీ బలహీనతలకు… కేసీఆర్ కి అది పెద్ద కష్టం కాకపోవచ్చు.., కానీ బయట గెలవడమే కష్టం. మహా అయితే జగన్ మాత్రమే కేసీఆర్ కి తోడు నడిచేందుకు సిద్ధమవుతారు. కానీ జగన్ కూడా జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతాం అనుకుంటే కేసీఆర్ వెనక్కు పోవాల్సిందే. అందుకే జాతీయ స్థాయిలో రాజకీయం చేయాలంటే చంద్రబాబు తర్వాత జగన్ కి అవుతుంది తప్ప కేసీఆర్ కి కష్టమే.

 

author avatar
Srinivas Manem

Related posts

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri