Mahanadu 2022: “అఖండ” సినిమా పేరు చెప్పి జగన్ పై చంద్రబాబు విమర్శలు..!!

Share

Mahanadu 2022: నటసింహం నందమూరి బాలయ్య బాబు వరుస ఫ్లాపుల్లో ఉన్న సమయంలో గత ఏడాది అఖండ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కడం తెలిసిందే. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య బాబు నటించిన ఈ మూడో సినిమా.. రికార్డ్ స్థాయి వసూళ్లు రాబట్టింది. విదేశాలలో సైతం బాలయ్య కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది.

అటువంటి “అఖండ” సినిమా పేరు చెప్పి తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు… ఏపీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఒంగోలు జిల్లాలో మహానాడు కార్యక్రమం జరుగుతున్నది. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ.. సినిమా పరిశ్రమ పై జగన్ పెత్తనం ఏంటి అని నిలదీశారు. ఇంకా అనేక వ్యాఖ్యలు చేస్తూ బాలకృష్ణ సినిమా “అఖండ” కి ఏపీలో అనేక ఆంక్షలు పెట్టారని ఆరోపించారు. “అఖండ” స్పెషల్ షో లకు జగన్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదని.. అయినా కానీ బాలకృష్ణ ఎక్కడ వెనక్కి తగ్గకుండా ప్రజల పై నమ్మకంతో సినిమా విడుదల చేసి అద్భుతమైన విజయం సాధించారని కొనియాడారు.

సీఎం జగన్ చేతకాని దద్దమ్మ సినిమా ఇండస్ట్రీనీ కూడా గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నారు. రాబోయే రోజుల్లో నేను ముఖ్యమంత్రి అయ్యాక జగన్ పేపర్ టీవీ.. భారతి సిమెంట్ లకి తానే పర్మిషన్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని చంద్రబాబు హెచ్చరించారు. దీంతో “మహానాడు”లో బాబు చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలోనూ రాజకీయవర్గాలలో సంచలనం రేపుతున్నయి. అంతమాత్రమే కాదు ఇదే సమయంలో పోలీసులను ఉద్దేశించి కూడా చంద్రబాబు వార్నింగ్ ఇచ్చే రీతిలో ప్రసంగించారు.


Share

Recent Posts

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

42 mins ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

1 hour ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

2 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

3 hours ago

కడుపు ఉబ్బరం సమస్యకు ఇలా చెక్ పెట్టేయండి..!

ఆహారం లేకుండా జీవించాలంటే చాలా కష్టం.ఆహా అయితే ఒక రెండు మూడు రోజులు ఉండగలం. కానీ ఆహారం లేకుండా మాత్రం మనిషి మనుగడ లేదు.గుప్పెడు అన్నం మెతుకుల…

3 hours ago

లాల్ సింగ్ చడ్డా సినిమా కోసం నాగచైతన్య ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడంటే..!

  అక్కినేని నాగచైతన్య మరో రెండు రోజుల్లో (ఆగస్టు 11న) థియేటర్స్‌లో రిలీజ్ కానున్న 'లాల్‌ సింగ్‌ చడ్డా' సినిమాతో బాలీవుడ్‌ డెబ్యూ ఇవ్వనున్నాడు. ఆమిర్‌ ఖాన్‌…

4 hours ago