AP News: జగన్ ని గుడ్డిగా ఫాలో అయిపోతున్న చంద్రబాబు..!?

chandrababu following cm jagan
Share

AP News: వాలంటీర్ల వ్యవస్థను గతంలో విమర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చేసిన పని వాలంటీర్ల వ్యవస్థను తీసుకురావడం. సీఎం జగన్ పాలనాపరంగా తీసుకున్న అద్ధుతమైన నిర్ణయంగా సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను చెప్పాలి. ప్రజలకు పథకాలు నేరుగా అందించడం.. ప్రభుత్వ సేవలను దగ్గర చేయడం వీటి ఉద్దేశం. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన (AP News) వాలంటీర్ల వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించింది టీడీపీ. వాళ్ల ద్వారా ప్రభుత్వం లబ్ది పొందుతోందని చంద్రబాబు సైతం విమర్శలు చేశారు. అయితే.. ఇప్పుడదే వాలంటీర్ల వ్యవస్థను తామూ తీసుకొస్తామని చంద్రబాబు చెప్పడం విశేషం.

chandrababu following cm jagan
chandrababu following cm jagan

AP News: వలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు..

స్వతహాగా ప్రభుత్వం చేసిన ఏ పనిని కూడా ప్రతిపక్ష పార్టీ అంగీకరించదు.. ఇది ఎవరికైనా వర్తించేదే. అయితే.. ప్రస్తుత వాలంటీర్ల వ్యవస్థపై ఎన్ని విమర్శలు చేసినా ప్రజలకు అందుతున్న లబ్ది, సౌకర్యాన్ని ప్రతిపక్షాలు కాదనలేవు. టీడీపీ ఇందకు మినహాయింపేమీ కాదు. ఈ విషయాన్ని గ్రహించిన చంద్రబాబు పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జిల సమావేశంలో.. తాము అధికారంలోకి వస్తే ఇప్పుడు కష్టపడే వారినే (AP News)  వాలంటీర్లగా నియమిస్తామని ప్రకటించేశారు. గ్రామ, వార్డు కమిటీల నియామకం ఈనెల 15లోగా పూర్తి చేయాలని.. మండల, బూత్, క్లస్టర్ కమిటీల నియామకం పూర్తి చేయాలన్నారు. బూత్ లలో ప్రతి వంద మంది ఓటర్ల బాధ్యత ఒకరికి అప్పగించాలని.. అధికారంలోకి వచ్చాక వారినే వాలంటీర్లగా నియమిస్తామని ప్రకటించారు.

గతంలో చంద్రబాబు ఇలా..

తాము వాలంటీర్ల వ్యవస్థ ప్రవేశపెడతామని చంద్రబాబు.. పరోక్షంగా వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవస్థను అంగీకరించనట్టైంది. గతంలో చంద్రబాబు హయాంలో మెప్మా, డ్వాక్రా గ్రూపుల ద్వరా.. ప్రతి 50 కుటుంబాలకు ఒక లీడర్ ను నియమించారు. అయితే.. ఆ విధానం సక్సెస్ కాలేదు.. చంద్రబాబుకు కలిసి రాలేదు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన (AP News) వాలంటీర్ల వ్యవస్థను మెచ్చుకోకనే తాను అధికారంలోకి వస్తే ప్రవేశపెడతానని చెప్పడం చూస్తుంటే.. తనకెందుకు ఈ ఐడియా రాలేదని చంద్రబాబు అనుకోవడమేనా..? జగన్ ను చంద్రబాబు ఫాలో అయిపోతున్నారనే అనుకోవాలా..!


Share

Related posts

TRS : గండంగా గా మారిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు! గులాబీ పార్టీలో గుబులు!!

Yandamuri

Corona: క‌రోనా థ‌ర్డ్ వేవ్ ఎప్పుడో తెలిస్తే షాకే..ఎస్‌బీఐ ఏం చెప్తుందదంటే…

sridhar

Big Breaking: షర్మిల ఇంటి వద్ద ఏపీ రైతులు ధర్నా..!!

P Sekhar