NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

48 గంటల తర్వాత చంద్రబాబు ఏం చేయనున్నారు..??

chandrababu-given-48hours-time-to-jagan-government

టీడీపీ అధినేత చంద్రబాబుకు కోపం వచ్చింది. రాజధాని వికేంద్రీకరణపై ఎలా పోరాటం చేయాలా ఆలోచిస్తున్న చంద్రబాబు ఒ నిర్ణయానికి వచ్చారు. దాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వానికి 48 గంటల గడువు ఇచ్చారు. ఈ రోజు అమరావతిలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతి సమస్య ఏ ఒక్కరిదో కాదని అయిదు కోట్ల మంది ప్రజల సమస్య అని అన్నారు.

chandrababu-given-48hours-time-to-jagan-government
chandrababu given 48hours time to jagan government

వైసీపీ నేతలు ఎన్నికల ముందు రాజధాని మార్చబోమని చెప్పి ప్రజలను వంచించారని విమర్శించారు. అసెంబ్లీని రద్దు చేసి ప్రజా తీర్పునకు సిద్ధం కావాలని సీఎం వైఎస్ జగన్ కు సవాల్ విసిరారు చంద్రబాబు.

పోరాటంపై సర్వత్రా ఉత్కంఠ..!

మూడు రాజధానుల విషయంలో తెలుగుదేశం పార్టీ మాట నెగ్గకపోవడం, అమరావతిని రాజధానిగా కొనసాగించకపోవడంపై తెలుగుదేశం పార్టీ ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏ విధంగా పోరాటం చేస్తారు? రాజీనామాలు చేస్తారా? దీక్షలు చేస్తారా? ధర్నాలు చేస్తారా? ఆందోళనలు చేస్తారా? అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

తెలుగుదేశం పార్టీ కూడా ఈ విషయమై అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యేలతో, పార్టీ సీనియర్ నాయకులతోనూ మంతనాలు జరిపి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం అమలు చేయడానికి ప్రభుత్వానికి 48 గంటలు గడువు ఇచ్చారు. ఈ 48 గంటల్లో ప్రభుత్వం స్పందించకపోతే చంద్రబాబు.. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి, నిరాహారదీక్షలు చేయిస్తారని సమాచారం.

ఈ 48 గంటల్లో జిల్లాల వారీగా ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని కూడా తెలుగుదేశం పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా రాజధాని విషయంలో తెలుగుదేశం పార్టీకి గట్టి పోరాటానికే సిద్ధం అవుతోంది. ఒ వైపు కరోనా, మరో వైపు లాక్ డౌన్, ప్రాణభయం ఇవన్నీ వెంటాడుతున్నప్పటికీ తమ ముద్ర పోతుందన్న ఆందోళనతో తెలుగుదేశం పార్టీ మాత్రం పోరాటం వీడే ప్రసక్తే లేదు అన్నట్టు రకరకాల ఆలోచనలు చేస్తోంది.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju