NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబు చేసిన తప్పే జగన్ చేస్తున్నాడు…??

విభజనతో నష్టపోయి మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు విభజన జరగడం తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 13 జిల్లాల గా మిగిలి ఉన్న సంగతి తెలిసిందే. రాజధాని అదేవిధంగా సరైన రాబడి కూడా లేని రాష్ట్రంగా ఖజానా ఖాళీ అనే రీతిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉండగా 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు చాలా హామీలు ఇవ్వటంతో మరోపక్క ఆ హామీలను నెరవేర్చే విషయంలో బడ్జెట్ లేకపోవటంతో టిడిపి ప్రభుత్వంపై అతి తక్కువ కాలంలోనే వ్యతిరేకత రాష్ట్రంలో వచ్చినట్లు చాలామంది చెబుతారు.

Chandrababu Naidu writes to CM YS Jagan, thanks to him for using services of MedTech Zoneముఖ్యంగా చంద్రబాబు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి దాదాపు ఐదు సంవత్సరాల పరిపాలనలో రెండున్నర లక్షల కోట్ల అప్పులు చేయడం జరిగిందని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసిపి ఆరోపణలు చేసి అనేక విమర్శలు చేసింది. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చుతున్నట్లు పేర్కొన్నారు. పరిస్థితి ఇలా ఉండగా ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ కూడా అప్పట్లో చంద్రబాబు మాదిరిగానే అప్పులు చేసుకుంటూ పోతున్నారని ఆయనకి ఈయనకి పెద్ద తేడా ఏమీ లేదన్న విమర్శలు రాజకీయవర్గాల్లో వస్తున్నాయి.

 

జగన్ అధికారంలోకి వచ్చినాక ఖజానాలో 130 కోట్ల రూపాయలు మాత్రమే ఉండగా దాదాపు ఏడాదిన్నర కాలంలో లక్ష కోట్లకు పైగానే అప్పులు చేసినట్లు గుసగుసలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో రాష్ట్రంలో జగన్ భూములు అమ్మటానికి రెడీ అవుతున్నట్లు టీడీపీ ఆరోపణలు చేస్తోంది. అసలే ఇప్పటికే దారుణంగా అప్పులు చేయడంతో రాష్ట్రంలో రాబడి లేకుండా సంక్షేమ కార్యక్రమాల విషయంలో వైసీపీ ప్రభుత్వం ఆర్భాటాలకు పోతున్నట్లు కామెంట్ లో వస్తున్న తరుణంలో భూములు అమ్ముతున్నట్లు టీడీపీ ఆరోపణలు చేస్తున్న వాస్తవం అయితే జగన్కి పొలిటికల్ గా జనంలో డ్యామేజ్ అవ్వడం గ్యారెంటీ అని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా చంద్రబాబు చేసిన తప్పే జగన్ కూడా చేస్తున్నట్లు ఈ వార్త పై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

Related posts

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju