NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

విజయవాడలో ఆ కీలక రాజకీయ నేతని బుజ్జగించడం కోసం అనేక కష్టాలు పడుతున్న చంద్రబాబు..??

2019 ఎన్నికలలో టిడిపి చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఆ పరిణామంతో ఫలితాలు వచ్చిన తరువాత టీడీపీలో ఉండే కీలక నేతలు వేరే పార్టీ లోకి వెళ్లి పోవడం జరిగింది. మరోపక్క జగన్ ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తూ, సంక్షేమ పథకాలు కరోనా లాంటి కష్ట సమయాల్లో కూడా అమలు చేస్తూ చిత్తశుద్ధిగా పని చేస్తున్న తరుణంలో పార్టీలో మిగిలి ఉన్న కీలక నేతలు కూడా జంప్  అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా విజయవాడలో కీలక రాజకీయ నాయకుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి పేరొందిన వంగవీటి ఫ్యామిలీ వారసత్వం అందిపుచ్చుకున్న వంగవీటి రాధా కూడా పార్టీ మారాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Vangaveeti Radha likely To Join TDP meets CM Chandrababu Naidu2019 సరిగ్గా ఎన్నికల సమయంలో టిడిపి పార్టీలో వంగవీటి రాధా జాయిన్ అవ్వడం జరిగింది. అంతకుముందు వైసీపీలో కీలక నేతగా రాణించిన వంగవీటి రాధా ఎన్నికల టైంలో విజయవాడ ఈస్ట్ నుంచి పోటీ చేయడానికి టికెట్ అడగటంతో వైసిపి హైకమాండ్ ఇవ్వకపోవడంతో… నిరుత్సాహానికి గురి అయ్యి టీడీపీ లోకి వెళ్ళిపోయారు. కానీ రాధా టీడీపీలోకి వెళ్లడం చాలా మంది ఆయన అనుచరులకు మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వంగవీటి కుటుంబాన్ని ప్రేమించే వాళ్లు వ్యతిరేకించటం జరిగింది.

ఇదిలా ఉండగా అమరావతి ఉద్యమంలో టీడీపీకి మద్దతు తెలుపుతూ మొన్నటి వరకు ఉన్న రాధ, ఇటీవల టిడిపి పార్టీకి సంబంధించి ఎలాంటి కార్యక్రమంలో పాల్గొనటం లేదట. దీంతో వంగవీటి రాధా పార్టీ మారే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో చంద్రబాబు అదేవిధంగా కృష్ణా జిల్లా టిడిపి పార్టీ కీలక నేతలు రాధా నీ బుజ్జగించే ప్రయత్నాలు స్టార్ట్ చేయడం మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిలో భాగంగానే ఇటీవల రాధా పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు మరియు కృష్ణా జిల్లాకు చెందిన కీలక నేతలు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినట్లు సమాచారం. ముఖ్యంగా రాష్ట్రంలో ఇప్పటికే బీసీ ఓట్ బ్యాంక్ టీడీపీకి చాలావరకు దూరమైనట్లు గ్రౌండ్ రిపోర్ట్ లు రావడంతో చంద్రబాబు రాధా విషయంలో తెగ టెన్షన్ పడుతున్నారట. కారణం చూస్తే కాపు సామాజిక వర్గ ఓటర్లను ప్రభావితం చేసే రాజకీయ కుటుంబ నేపథ్యం కలిగిన కుటుంబం. దీంతో ఆయన్ని ఎలాగైనా టిడిపిలోనే కంటిన్యూ చేసే విధంగా చంద్రబాబు అనేక ఆఫర్లు ఇస్తూ బుజ్జగించడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నట్లు కృష్ణా జిల్లా రాజకీయాల్లో టాక్. మరి వంగవీటి రాధా టిడిపి లో కంటిన్యూ అవుతారో లేదో చూడాలి.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!