NewsOrbit
రాజ‌కీయాలు

చంద్రన్నకు చిర్రెత్తింది

అమరావతి, ఫిబ్రవరి 1: విభజన హామీలను విస్మరించిన కేంద్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఎప్పుడూ లేని విధంగా ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహంతో మాట్లాడారు.  కేంద్ర ప్రభుత్వం గురించి బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చెప్పిన మాటలు చంద్రబాబుకు ఆగ్రహాన్ని తెప్పించాయి.

బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, కేంద్రం రాష్ట్రానికి ఏమీ అన్యాయం చేయలేదని, వేల కోట్ల రూపాయలు విడుదల చేసిందని అన్నారు. అయినా భారతీయ జనతా పార్టీపై బురదచల్లారనీ అన్నారు. బ్లాక్ డే అని చెప్పి సీఎంతో సహా అధికార పార్టీ ఎమ్మెల్యేలు నల్లడ్రస్సులను ధరించి  అసెంబ్లీకి రావడం మంచి పద్ధతి కాదని అన్నారు. కేంద్రం ఏదో తీరని అన్యాయం చేసిందని అభాండాలు వేయడం దారుణమని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉంది. చట్టంలో లేనటువంటివి ఎన్‌‌సిఆర్‌టి, ఫ్యాషన్ టెక్నాలజీ తదితర సంస్థలను కూడా కేంద్రం ఇచ్చిందని విష్ణుకుమార్ రాజు అంటుండగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్క సారిగా లేచి సిగ్గులేకుండా మట్లాడుతున్నారు అంటూ విరుచుకుపడ్డారు.

ఈ సంస్థలు ఎవరి కోసం ఇస్తారు, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలకు ఏం ఇచ్చారు. మనకు ఏం ఇచ్చారు అని ప్రశ్నించారు. ఏం తమాషాలు ఆడుతున్నారు, ఏమనుకుంటున్నారు. ప్రజా ప్రతినిధిగా ఉండానికి మీకు అర్హత లేదు, మీరు ఊడిగం చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దశలో ‘అడిగే వారు లేరనుకుంటున్నారు, మమ్మల్ని ఏం చేస్తారు?, జైలులో పెడతారా? కొత్త రాష్ట్రం ఏర్పడితే సహకరించాల్సింది పోయి సిగ్గు విడిచి మాట్లాడుతున్నారు. బిజిపి నేతలను తిరగనివ్వరు జాగ్రత్త’ అంటూ మండిపడ్డారు. వినేవాళ్లు ఉంటే చెవులో పూలు పెడతారు, యు ఆర్ అన్‌ఫిట్ ఫర్ ఎమ్మెల్యే అంటూ చంద్రబాబు ఊగిపోయారు. చంద్రబాబు ఆవేశపూరిత ప్రసంగంతో విష్ణుకుమార్ రాజు సభ నుండి వెళ్లిపోయారు.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

Leave a Comment