NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

అదే మరి 40 ఏళ్ల ఇండస్ట్రీ పవర్ అంటే, చంద్రబాబు సరికొత్త ఎత్తుగడ..!!

తెలుగు రాజకీయాలలో ఓ వెలుగు వెలిగిన టిడిపి పార్టీ ఒకానొక సందర్భంలో జాతీయస్థాయి రాజకీయాలను కూడా శాసించడం జరిగింది. కానీ ప్రస్తుతం టిడిపి పార్టీ పరిస్థితి చూస్తే తెలంగాణలో పూర్తిగా దుకాణం సర్థుకోగా ఏపీలో కొన ఊపిరితో అన్నట్టు పరిస్థితి మారింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం కొద్దిపాటి ఎమ్మెల్యేలతో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు…. కొద్దో, గొప్పో పార్టీని లాకోస్తున్నారు. మరోపక్క అధికారంలో ఉన్న జగన్ ప్రజలలో బలమైన రాజకీయ నేతగా ఉన్న కొద్ది ఎదిగే పరిస్థితి కనబడుతోంది. మరోపక్క చంద్రబాబు వయస్సు మీద పడుతున్న పరిస్థితి. ఇటువంటి తరుణంలో వచ్చే ఎన్నికల దాకా పార్టీని నడిపించాలన్న, గెలవాలన్న చంద్రబాబుకి కత్తి మీద సాము అన్న పరిస్థితి ఏర్పడింది.

Chandrababu, Where Is Your Fight For Amaravati? | Gulte - Latest Andhra  Pradesh, Telangana Political and Movie News, Movie Reviews, Analysis, Photosకచ్చితంగా వచ్చే ఎన్నికలలో జగన్ ని అధికారం నుండి దింపాలి అంటే 2014 ఎన్నికల మాదిరిగా కూటమి ఏర్పాటు చెయ్యాల్సిందే అని బాబు డిసైడ్ అయ్యారట. ఇప్పటికే బీజేపీ జనసేన పొత్తు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్న సంగతి తెలిసిందే. పరిస్థితి ఇలా ఉండగా బిజెపి పార్టీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు చాలావరకు టిడిపిని బూచిగా చూపిస్తూ….. ప్రతిపక్షా స్థానాన్ని రీప్లేస్ చేయాలని రాజకీయాలు చేస్తున్నట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా ఇటీవల మతం కార్డు తీసి బిజెపి జగన్ ప్రభుత్వం పై ఏదోవిధంగా పోరాటానికి ఎగబడుతున్న పరిస్థితి. ఇటువంటి తరుణంలో త్వరలోనే చంద్రబాబు కూడా ఇదే రీతిలో బీజేపీతో కలిసి పోవటానికి ఢిల్లీలో బీజేపీ కీలక నాయకులతో మళ్లీ భేటీ అవడానికి పొత్తు గురించి మాట్లాడటానికి రెడీ అవుతున్నట్లు టాక్.

 

మరోపక్క రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం టీడీపీతో కలిసే ప్రసక్తి లేదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఖచ్చితంగా వచ్చే సార్వత్రిక ఎన్నికలలోపు బిజెపి తనని కలుపుకోవడం గ్యారెంటీ అనే ధీమాలో ఉన్నారట. ఎందుకంటే రాష్ట్రంలో బిజెపి పార్టీకి ఓటింగ్ శాతం తక్కువ కావటం తో పాటుగా మతం రాజకీయాలనూ ఏపీ ప్రజలు పెద్దగా పట్టించుకునే ప్రసక్తి లేదని, అదేవిధంగా ఈ మత రాజకీయాల వల్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి కూడా భారీ డ్యామేజ్ జరగటం గ్యారెంటీ అని నమ్ముతున్నారట.

 

దీంతో రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో రాష్ట్ర బిజెపి కి ఏపీ ప్రజలు షాక్ ఇవ్వడం గ్యారెంటీ అనే ఉద్దేశంతో చంద్రబాబు ప్రస్తుతం ఉన్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చివరాకరికి కి బిజెపి పార్టీకి తానే పెద్దదిక్కు అవుతానని…. చంద్రబాబు అనుకుంటున్నట్లు టాక్. ఒకవేళ బీజేపీ తనతో కలవకపోయినా గాని కచ్చితంగా ఈ మత రాజకీయాలతో పవన్ పెద్దగా రాజకీయం చేసే అవకాశం ఉండదని, ఎన్నికల నాటికి జనసేన అయినా తనతో కలిసి వస్తుందని అనుకుంటున్నారట. పైగా సినీ గ్లామర్ ఉన్న పవన్ కళ్యాణ్ నీ అన్ని వర్గాల ప్రజలు ఇష్టపడే హీరో అని, ఈ విధంగా మత రాజకీయాలు చేసుకుంటే ఒక పవన్ కళ్యాణ్ ని మాత్రమే కాక మెగా ఫ్యామిలీ ని మిగతావాళ్లు పక్కన పెట్టేసే పరిస్థితి ఉంటుందని చంద్రబాబు నమ్ముతున్నారట. కచ్చితంగా పవన్ కళ్యాణ్ మత రాజకీయాలతో రాణించే మనస్తత్వం ఉన్న మనిషి కాదని, ఎలాగైనా చివరాకరికి తనతో కలుస్తాడు అని బాబు బలంగా నమ్ముతున్నారట. ఇక జనసేన వస్తే బిజెపి కూడా రావడం జరుగుతుందని… ఏది ఏమైనా వచ్చే సార్వత్రిక ఎన్నికలకి కూటమి తన ఆధ్వర్యంలోనే మళ్ళీ ఏర్పడే అవకాశం ఉందని చంద్రబాబు మంచి ధీమా మీద ఉన్నట్లు సమాచారం.

Related posts

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N