శ్రీకాకుళం నుంచే శ్రీకారం!

అమరావతి: చంద్రబాబు తన ఎన్నికల ప్రచారాన్ని శనివారం సాయంత్రం శ్రీకాకుళం నుంచి ప్రారంభించనున్నారు. గురువారం రాత్రి జరిగిన మీడియా సమావేశంలో చంద్రబాబు ఈ విషయాన్ని తెలియజేశారు.

చంద్రబాబు శనివారం ఉదయం తిరుమల వెళ్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తిరుపతిలో సేవామిత్ర, బూత్ కమిటీలతో సమావేశమవుతారు. సాయంత్రం శ్రీకాకుళం సభలో పాల్గొంటారు.

వరుసగా నాలుగు రోజులపాటు జిల్లాల్లో జరిగే ఎన్నికల ప్రచారాల్లో చంద్రబాబు పాల్గొనన్నారు.

17న విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో, 18న నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో, 19న కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలో చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు . ఈ సభల తర్వాత బస్సు యాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.