NewsOrbit
రాజ‌కీయాలు

బాబు “మేనేజ్మెంట్” పెద్ద పరీక్ష..! సుప్రీమ్ ఏం చేస్తుందో..!?

chandrababu naidu under tough circumstances

‘ఓటుకు నోటు’.. దేశంలోనే సంచలనం రేపిన కేసు అది. ‘అత్యంత సీనియారిటీ ఉన్న నాయకుడిని.. 40 ఏళ్ల రాజకీయ అనుభవం.. ముఖ్యమంత్రిగా 14 ఏళ్ల ప్రస్థానం నాది’ అని చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 2015లో ఓ కేసులో ఇరుక్కున్నారు. నిజానిజాలేంటో తెలీకపోయినా ఆ కేసులో చంద్రబాబుదే కీలక పాత్ర అని ఆ సంఘటన చూసిన, మాటలు విన్న వారు చెప్పే మాట. దీనిని ఆధారంగా చేసుకునే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో చంద్రబాబుపై 2017లో కేసు వేశారు. అధికారంలో ఉండబట్టి చంద్రబాబు ఆ కేసును పెద్దగా పట్టించుకోలేదు కానీ.. ఇప్పుడు మాత్రం ఆయన్ను వణికిస్తోంది.. ‘ఓటుకు నోటు’.

chandrababu naidu under tough circumstances
chandrababu naidu under tough circumstances

చంద్రబాబు ‘స్టే’లకు కాలం చెల్లినట్టేనా..!

చంద్రబాబుకు రాజకీయ వర్గాల్లో, సొంత పార్టీ నేతల్లో కూడా ఉన్న పేరు.. వ్యవస్థలను మేనేజ్ చేస్తారనే. అయితే.. ఇన్నాళ్లూ ఆ కేసులో ఏ1 నుంచి ఏ5 వరకే విచారణ జరుపుతున్నారనేది రామకృష్ణారెడ్డి వాదన. ఇప్పుడు ఈ కేసును మళ్లీ సుప్రీంకోర్టులో ఎర్లీ హియరింగ్ పిటిషన్ వేయగా ఈ కేసులో కదలిక వచ్చింది. 2021 జూలైలో కేసును విచారిస్తామని పేర్కొంది. దీంతో నాలుగేళ్ల తర్వాత ఈ కేసులో కదలిక వచ్చింది. ఇది చంద్రబాబుకు వణుకు తెప్పించే విషయమే. ఇన్నాళ్లూ కోర్టు కేసులపై సీఎం జగన్ ను మాత్రమే విమర్శించే చంద్రబాబుకు ఇది షాక్ ఇచ్చే వార్తే. ఎందుకంటే చంద్రబాబుపై లక్ష్మీపార్వతి వేసిన అక్రమాస్తుల కేసులో కూడా దాదాపు 20 స్టేలు తెచ్చుకున్నారనే అపవాదు కూడా ఉంది. ఇన్ని వెనుకున్నా చంద్రబాబు ఇతరుల కేసులపై చేసే వ్యాఖ్యలు మాత్రం విడ్డూరంగానే ఉంటాయి.

చంద్రబాబుకు వరుస షాకులు..

అయితే.. ఇటివల సీఎం జగన్ హైకోర్టు తీర్పులు ప్రభావితం అవుతున్నాయని ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాయడం.. దానిని మీడియాకు వెల్లడించడం దేశంలోనే అతిపెద్ద సంచలనం. ఇందులో చంద్రబాబు పేరు కూడా పరోక్షంగా ఉంది. ఈ నేపథ్యంలో మొన్న మాజీ అడ్వొకేట్ జనరల్ విషయంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం తప్పుబట్టింది.. నిన్న ఉదయసింహ అరెస్టు జరిగింది.. ఈరోజు ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై అదే సుప్రీంకోర్టులో కదలిక వచ్చింది. ఈ గ్యాప్ లో సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి అమిత్ షాని కలవడం కేసులో కదలిక రావడం కీలక పరిణామంగా మారింది. జగన్ లేఖ రాయడం, సుప్రీం వ్యాఖ్యలు చేయడం చంద్రబాబుకు, ఆయన సామ్రాజ్యానికి ఈ చలికాలంలో కూడా చెమటలు పట్టించేవే. మరి.. చంద్రబాబు ఏమంటారో..!?

 

 

 

author avatar
Muraliak

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk