NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

JC Brothers: చంద్రబాబు ని నమ్ముకుని నిండా మునిగిన జేసీ దివాకర్ రెడ్డి – కొంప మునిగే బ్రేకింగ్ న్యూస్ !

Advertisements
Share

JC Brothers: అనంతపురం జిల్లా రాజకీయాల్లో జేసీ దివాకరరెడ్డికి ప్రత్యేక స్థానం ఉంది. మూడు దశాబ్దాలకుపైగా రాజకీయాల్లో ఉన్న ఆయన వరుసగా తాడిపత్రి నుండి ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగానూ బాధ్యతలు నిర్వహించారు. తొలి నుండి కాంగ్రెస్ పార్టీ వాదిగా ఉన్న దివాకరరెడ్డి కుటుంబం రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పని ఏపీలో అయిపోవడంతో సోదరుడు ప్రభాకరరెడ్డి తో సహా టీడీపీలో చేరారు. దివాకరరెడ్డికి ఓటమి ఎరుగని నాయకుడుగా గుర్తింపు ఉంది. టీడీపీలో చేరిన తర్వాత 2014 లో దివాకరరెడ్డి అనంతపురం నుండి ఎంపిగా, ఆయన సోదరుడు ప్రభాకరరెడ్డి వారి సొంత సీటు తాడిపత్రి నుండి ఎమ్మెల్యే గా గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత అయిదేళ్లు తమ హవా కొనసాగించారు.

Advertisements

 

రాజకీయంగా వీరికి ఉన్న పట్టు గుర్తించిన ఇటు వైసీపీ, అటు బీజేపీ నుండి ఆహ్వానాలు వచ్చినా చంద్రబాబును నమ్ముకుని టీడీపీలోనే కొనసాగారు. అయితే 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. అనంతరం పార్లమెంట్, తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పోటీ చేసిన జేసీ బ్రదర్స్ వారుసులు పవన్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలు ఇద్దరూ ఓటమి పాలైయ్యారు. తమ వారసులను రాజకీయంగా గెలిపించి రాజకీయంగా రిటైర్ అవ్వాలని వారు ఆశించినా ఆ ఆశ నెరవేరలేదు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీ బ్రదర్స్ కు రాజకీయంగా, వ్యక్తిగతంగా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే తాడిపత్రిలో తమ హవా కాపాడుకునేందుకు ప్రభాకరరెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి తన సత్తా చాటుకున్నారు. మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైయ్యారు.

Advertisements

 

అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ జేసీ బ్రదర్స్ కు టీడీపీలో టికెట్ల ఇబ్బందులు ప్రారంభమైయ్యాయి అని అంటున్నారు. జేసీ ఫ్యామిలీలో ఒక్కటే టికెట్ అని చంద్రబాబు చెప్పేశారని ప్రచారం జరుగుతోంది. అంటే తాడిపత్రి అసెంబ్లీ సీటు ఒక్కటే. అనంతపురం పార్లమెంటరీ పార్టీ అధ్యక్ష బాధ్యతలను మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులుకు అప్పగించినందన జేసీ బ్రదర్స్ వారసుల్లో ఒకరు తాడిపత్రి నుండి పోటీ చేయాల్సి ఉంటుంది. జేసీ దివాకరరెడ్డి కుమారుడు పవన్ రెడ్డికి అనంతపురం టికెట్ కేటాయించడం అనుమానమేనని టాక్ నడుస్తొంది.  అనంతపురం పార్లమెంట్ టీడీపీ ఇన్ చార్జిగా కాల్వ శ్రీనివాసులును చంద్రబాబు ప్రకటించడంతో పార్లమెంట్ పరిధిలో పార్టీ పనులు అన్నీ ఆయనే చూసుకుంటున్నారుట. 2019 ఎన్నికల్లో బీసీ కార్డుతోనే వైసీపీ ఈ సీటును సొంత చేసుకున్న నేపథ్యంలో ఈ సారి టీడీపీ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన కాల్వ శ్రీనివాసులును ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించాలని భావిస్తున్నారుట.

Chandrababu

 

కాల్వ శ్రీనివాసులు గతంలో 1999లో ఒక పర్యాయం ఎంపీగా గెలిచారు. 2004, 2009 ఎన్నికల్లో రెండు సార్లు వరుసగా కాంగ్రెస్ అభ్యర్ధి అనంత వెంకట్రామిరెడ్డి చేతిలో పరాజయం పాలైయ్యారు కాల్వ శ్రీనివాసులు.  2014 లో రాయదుర్గం అసెంబ్లీ స్థానం నుండి కాల్వ శ్రీనివాసులు పోటీ చేసి విజయం సాధించారు. చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2019 ఎన్నికల్లో రాయదుర్గం నుండి పోటీ చేసి వైసీపీ అభ్యర్ధి కాపు రామచంద్రారెడ్డి చేతిలో పరాజయం పాలైయ్యారు. ఇప్పుడు మరల కాల్వ శ్రీనివాసులుని అనంతపురం లోక్ సభ స్థానం నుండి పోటీ చేయించాలని చంద్రబాబు భావిస్తున్నారుట.

 

ఇదే క్రమంలో తాడిపత్రి నుండి జేసి ప్రభాకరరెడ్డి వారసుడు కాకుండా ప్రభాకరరెడ్డే పోటీ చేయాలని పార్టీ అధిష్టానం కోరుతుందని సమాచారం. తాడిపత్రి సీటు చాలా ప్రతిష్టాత్మకమనీ, రిస్క్ చేయలేమని అంటున్నారుట. దీంతో జేసి బ్రదర్స్ వారసులకు ఈ సారి టికెట్ లు లేనట్లేనని ప్రచారం జరుగుతోంది. దీంతో  ఈ పరిణామాలను పరిశీలిస్తున్న సీనియర్ నేత జేసి దివాకరరెడ్డి తన వారసుడి విషయంలో ఏమి చేయాలో పాలుపోక తర్జనభర్జన పడుతున్నారని అంటున్నారు. సుదీర్ఘకాలం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పి ఓటమి ఎరుగని నాయకుడుగా ఉన్న జేసీ దివాకరరెడ్డి తన వారసుడి రాజకీయంపై ఎలా అలోచిస్తారో వేచి చూడాలి.

YS Viveka Case: వైఎస్ భాస్కరరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలకు హైకోర్టులో బిగ్ షాక్ .. బెయిల్ పిటిషన్ లు తిరస్కరణ


Share
Advertisements

Related posts

Bigg Boss 5 Telugu: అడుక్కోడానికి బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టలేదు.. ఆ కంటెస్టెంట్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

హోం లోన్స్‌పై త‌క్కువ వ‌డ్డీ రేట్ల‌ను అందిస్తున్న టాప్ 10 బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థ‌లు ఇవే..!

Srikanth A

17నుంచి తెలంగాణా అసెంబ్లీ

Siva Prasad