NewsOrbit
రాజ‌కీయాలు

మీడియాపై నిర్భయ కేసులా?

అమరావతి: సీఎం జగన్ తిక్క చేష్టలతో రాష్ట్రం పరువు పోతోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మీడియాపై తప్పుడు కేసులు బనాయించడాన్ని ఆయన ఖండించారు. గత ఎనిమిది నెలలుగా ఏపీలో నిరంకుశ పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పాత్రికేయులకు రక్షణ లేకుండా పోతోందని, మీడియా స్వేచ్ఛను హరించే నియంతృత్వ వైఖరులను ఖండిస్తున్నామన్నారు. మందడంలోని పాఠశాలలో తరగతి గదులను పోలీసులు ఆక్రమించారని ఆరోపించారు.

విద్యార్ధులను బయటకు పంపడంపై మీడియాకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. విధి నిర్వహణలో భాగంగా విలేకరులు, ఫొటోగ్రాఫర్లు పాఠశాలకు వెళ్లారని తెలిపారు. తరగతి గదుల్లో ఆరేసిన పోలీసుల దుస్తులను ఫొటోలు తీశారు, ఛానళ్లలో ప్రసారం చేశారని చెప్పారు. దానిపై అక్కసుతోనే ముగ్గురు విలేకరులపై అక్రమ కేసులు పోలీసులు పెట్టారని ఆరోపించారు. తరగతి గదుల్లో పోలీసులు దుస్తులు ఆరేసిన ఘటనను ఫొటోలు తీసినందుకు విలేకరులపై కేసులు నమోదు చేయడాన్ని ఏమని భావించాలని ప్రశ్నించారు. మీడియాపై నిర్భయ కేసు పెట్టడం ప్రభుత్వ కక్ష సాధింపునకు పరాకాష్ట అని మండిపడ్డారు. తునిలో విలేకరి హత్య జరిగిందని, చీరాలలోనూ ఓ మీడియా ప్రతినిధిని చంపే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారం చేపట్టగానే ముగ్గురు మంత్రులు సమావేశం పెట్టి ఎంఎస్ వోలను బెదిరించారని ఆరోపించారు. రెండు ఛానళ్ల ప్రసారాలపై ఆంక్షలు పెట్టారని, అసెంబ్లీ ప్రసారాలు చేయకుండా మూడు ఛానళ్లపై నిషేధం విధించారన్నారు. జోవో 2430 తెచ్చి మీడియాపై ఉక్కుపాదం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాపై దౌర్జన్యాలు చేసిన వైసీపీ నేతలను ఏం చేశారని ప్రశ్నించారు. మీడియా గొంతు నులిమే నియంత పోకడలను ఖండిస్తున్నామని చెప్పారు. ఇలాంటి నియంతలంతా కాలగర్భంలో కలిసిపోయారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

 

Related posts

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

Leave a Comment