వర్ల రామయ్య కి వరాలు కురిపించిన చంద్రబాబు ? 

Share

టిడిపి పార్టీ తరఫున మీడియా ముందు వాయిస్ వినిపించడం లో ఎప్పుడూ ముందుంటారు వర్ల రామయ్య. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ పదవిలో వర్ల రామయ్య కొనసాగుతూ టిడిపి పార్టీలో కీలకంగా రాణించారు. ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో టిడిపి పార్టీ తరఫున పోటీకి దిగడం జరిగింది. పార్టీ ఓడిపోయినా అధికారంలో ఉన్న పార్టీ కోసం కష్టపడే నేతగా వర్ల రామయ్య కి పార్టీ కేడర్ లో  మంచి గ్రిప్ ఉంది.

టీడీపీ రాజ్యసభ అభ్యర్థిగా వర్ల రామయ్య... ప్రకటించిన చంద్రబ..కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన వర్ల రామయ్యకి గత సార్వత్రిక ఎన్నికలలో నియోజకవర్గంలో ఉప్పులేటి కల్పన పార్టీలో ఎంట్రీ ఇవ్వడం తో ఎమ్మెల్యే టికెట్ మిస్ అయింది. ఆమె పోటీ చేసినా గాని పామరు నియోజకవర్గంలో ఓడిపోవడం జరిగింది. ఇన్చార్జిగా ఉన్న ఉప్పులేటి కల్పన పార్టీ గురించి ప్రస్తుతం ఏమి పట్టించుకోకపోవడంతో పైగా ఎన్టీఆర్ పుట్టిన గడ్డగా పేరొందిన నియోజకవర్గం లో టిడిపి పార్టీ క్యాడర్ కూడా కల్పన అనుసరిస్తున్న వైఖరిపై అసహనం ఉండటంతో వర్ల రామయ్యకి పార్టీ ఇన్చార్జ్ పదవి కట్టబెట్టాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు టాక్.

 

దీంతో వరుసగా చంద్రబాబు దగ్గర నుండి వర్ల రామయ్య వివరాలు వస్తున్న తరుణంలో…. ఈ సారి ఏకంగా ఎన్టీఆర్ పుట్టిన గడ్డకి ఇన్చార్జి పదవి అప్ప చెప్పడానికి చంద్రబాబు రెడీ అవడంతో పార్టీలో ఈ విషయం హైలెట్ గా మారింది. మరోపక్క రాష్ట్రంలో మరికొన్ని నియోజకవర్గాలలో ఇదే రీతిలో ఇన్చార్జిలు మార్చడానికి చంద్రబాబు రెడీ అవుతున్నట్లు సమాచారం. చాలా వరకు ప్రస్తుతం పార్టీ పదవుల్లో ఉన్న నాయకులు పార్టీ క్యాడర్ ని పట్టించుకోకుండా ఉంటున్నట్లు ఫిర్యాదులు చంద్రబాబు దాక రావడంతో…త్వరలోనే అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఇంచార్జి పదవులను మరొకరికి కట్టబెట్టడానికి బాబు రెడీ అవుతున్నట్లు టాక్.


Share

Related posts

Bigg Boss 5 Telugu: టికెట్ టూ ఫినాలే టాస్క్ గెలిచి..టాప్ ఫైవ్ లోకి చేరిపోయిన శ్రీ రామ్ చంద్ర..!!..!!

sekhar

చైనా కి భారత్ మరో దెబ్బ..! మరో 43 ఛైనీస్ యాప్స్ బ్యాన్

siddhu

Food: నీళ్ల బాటిల్ రూ.3వేలు, ప్లేట్ రైస్ రూ.7,500లు..! ఎక్కడో తెలుసా ..?

Srinivas Manem