యాజ్ ఇట్ ఈజ్ గా జగన్ నే ఫాలో అవుతున్న చంద్రబాబు .. బొక్కబోర్లా పడ్డాతారు ?

2019 ఎన్నికల ఫలితాల  దెబ్బకి టిడిపి పార్టీ పరిస్థితి ఆల్మోస్ట్ ఆల్ దుకాణం సర్దేస్తున్నట్లే అనే కామెంట్లు వచ్చాయి. 2014 అధికారంలో ఉన్న పార్టీ 2019లో 23 మంది ఎమ్మెల్యేలకు పడిపోవడంతో చంద్రబాబు వయసు మీద పడటంతో టిడిపి సీన్ అయిపోయిందని భావించారు. కాని పరిస్థితి చూస్తే 23 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఏదో రకంగా పార్టీని నడిపించుకుంటూ ప్రభుత్వంపై పోరాడుతున్నారు. ఇదిలా ఉండగా చాలా నియోజకవర్గాలలో పార్టీ క్యాడర్ ని పట్టించుకునే నాయకులు లేనట్లు ఇటీవల చంద్రబాబు గుర్తించడంతో తాజాగా పార్టీకి సంబంధించి కొత్త కమిటీలు చంద్రబాబు వేస్తున్నారట.

Chandrababu Naidu Letter To YS Jagan About Narsipatnam Doctorఅయితే ఈ ఎత్తుగడలో చంద్రబాబు యజ్ ఇట్ ఈజ్ గా జగన్ ని ఫాలో అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళ్తే గతంలో ప్రతిపక్షంలో జగన్ ఉన్న సమయంలో గ్రామీణ స్థాయిలో కూడా పార్టీ బలోపేతం అయ్యే రీతిలో ప్రతి ఇంటికి పార్టీ విధివిధానాలు తెలిసేలా పార్లమెంటు నియోజకవర్గాలకు అధ్యక్షుడుని నియమించడంతో పాటు ప్రతి పల్లెకు వైసిపి ఇన్చార్జి ని జగన్ నియమించడం జరిగింది. దీంతో 25 పార్లమెంటు నియోజకవర్గాలకు 25 మంది అధ్యక్షులనీ వైసీపీ అధ్యక్షుడు జగన్ నియమించడం జరిగింది.

ఇప్పుడు ఇదే ఫార్ములా చంద్రబాబు ఫాలో అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 13 జిల్లాల అధ్యక్షులు స్థానంలో 25 పార్లమెంట్ నియోజకవర్గాల అధ్యక్షులు నియమించాలని చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలో రాష్ట్ర అధ్యక్షుడు పేరు ప్రకటించే సమయంలోనే పార్లమెంటు నియోజకవర్గాల అధ్యక్షులు కూడా టిడిపి హైకమాండ్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఇలాంటి విధానం వల్ల పార్లమెంటు నియోజకవర్గాల అధ్యక్షులకు ఎమ్మెల్యేలకు మధ్య వివాదాలు అయ్యే అవకాశముందని వైసీపీలో ఇదే ప్రస్తుతం గ్రూపు రాజకీయాలకు తావిస్తోందని మరోపక్క కామెంట్లు వస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు ఇదే గనుక ఫాలో అయితే టిడిపి బొక్క బోర్లా పడడం గ్యారెంటీ అనే టాక్ గట్టిగా వినబడుతోంది.