NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

మండలికి ‘మర్రి’ ఎంపిక..? రద్దు లేనట్టేనా..?

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే , సీనియర్ వైకాపా నేత మర్రి రాజశేఖర్ కు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన రెండు హామీల్లో ఒకటి నెరవేరుస్తున్నారు. ఎన్నికల ముందు వైకాపాలో చేరిన ఎన్ఆర్ఐ విడతల రజని కోసం మర్రి రాజశేఖర్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని త్యాగం చేశారు. ఈ సందర్భంలో జగన్ ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. దీనితో పార్టీని వీడటానికి సైతం సిద్ధపడ్డ రాజశేఖర్.. విభేదాలను పక్కన పెట్టి ఎన్నికల్లో విడతల రజని గెలుపునకు కృషి చేశారు. ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన నాటి మంత్రి పత్తిపాటి పుల్లారావుపై విడతల రజని విజయం సాధించారు. కాగా 2004 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుండి పత్తిపాటి పుల్లారావుపై కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన మర్రి రాజశేఖర్ 2009, 2014 ఎన్నికల్లో పత్తిపాటి పుల్లారావు పైనే పరాజయం పాలయ్యారు. 2009 కాంగ్రెస్ తరపున, 2014లో వైకాపా తరపున మర్రి పోటీ చేశారు. 2014 ఎన్నికల తరువాత మర్రి వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా నియమితులు అయ్యారు.

మండలి రద్దు లేనట్టేనా?

శాసనమండలి రద్దు చేయకూడదని జగన్ నిర్ణయం తీసుకున్నారు కాబట్టే మర్రి రాజశేఖర్ కు ఇచ్చిన ఎమ్మెల్సీ హామీని నెరవేరుస్తున్నారని  అనుకుంటున్నారు. గవర్నర్ కోటాలో మర్రి రాజశేఖర్ ను ఎమ్మెల్సీగా ఎంపికకు ఖరారు చేసినట్లు  తెలుస్తోంది. మండలిలో టీడీపీ సంఖ్య బలం ఎక్కువ ఉండటంతో పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను ఆమోదించకుండా సెలెక్ట్ కమిటీకి పంపిన నేపథ్యంలో ఆవేశంతో జగన్ మండలిని రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తేలిసిందే. అనుకున్నదే తడవుగా మంత్రి మండలిలో తీర్మానం కూడా చేయడం, అసెంబ్లీ ఆమోదించడం కేంద్రానికి పంపించడం చెకచెకా జరిగి పోయాయి. అయితే కేంద్రం ఇంత వరకు మండలి రద్దుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. త్వరలో మండలిలో వైసీపీ సంఖ్య బలం పెరుగుతున్న నేపథ్యంలో మండలి కొనసాగింపునకే జగన్ సుముఖంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి.

మంత్రి పదవీ ఇస్తారా?

ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ దాదాపు 30 మందికి ఎమ్మెల్సీ, మంత్రి పదవు లంటూ హామీలు ఇచ్చారు. చాలా మంది ఎమ్మెల్సీ పదవులపై, మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే మంగళగిరిలో నారా లోకేష్ పై పోటీ చేసిన ఆళ్ల రామకృష్ణా రెడ్డికి, చిలకలూరిపేట లో మర్రి రాజశేఖర్, రేపల్లె నియోజకవర్గంలో మోపిదేవి వెంకట రమణ కు మంత్రి పదవులు ఇస్తానని జగన్ నాడు బహిరంగ సభల్లోనే హామీ ఇచ్చారు. తొలి సారి మంత్రి వర్గంలోనే మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి లభిస్తుందని ఆ పార్టీ ముఖ్య నేతలు భావించారు. ముందుగానే ఆయనకు పలువురు శుభాకాంక్షలు కూడా చెప్పారు. అయితే కులాలు, ప్రాంతాలు, సీనియారిటీ తదితర ఈక్వేషన్ ల కారణంగా చాలా మందికి అవకాశం లభించలేదు. మోపిదేవి వెంకట రమణ ఎన్నికల్లో పరాజయం పాలైనా విధేయత కారణంగా మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీ గా నామినేట్ చేశారు. మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు రాజ్యసభ కు ఎన్నికైనందున త్వరలో ఈ రెండు మంత్రి పదవుల భర్తీ జరగనుందని అనుకుంటున్నారు. మోపిదేవి స్థానంలో ఎమ్మెల్సీగా మర్రి నామినేట్ అవుతున్నందున మంత్రి పదవి హామీ కూడా నెరవేర వచ్చేమో చూద్దాం.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju