బోర్డర్ లో భారత్ చేసిన పనికి బెదిరిపోతున్నా చైనా…!!

భారత్-చైనా సరిహద్దు వద్ద ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుంది. డ్రాగన్ కంట్రీ చర్చల పేరుతో చెప్పేదొకటి చేసే దొకటి కావడంతో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్ ఆర్మీ సిద్ధమవుతుంది. చైనా ని ఎదుర్కొనేందుకు యుద్ధ ట్యాంకులను భారత్ మోహరింప చేసింది. ఇప్పటికే యుద్ధానికి సిద్ధమైన భారత్ తూర్పు లడక్ లో T90, T72 యుద్ధ ట్యాంకులను మోహరింపాచేసి చైనా కి చెక్ పెట్టడానికి రెడీ అయింది. యుద్ధ బలగాలతో పాటు యుద్ధ ట్యాంకులను తరలించి 14,500 ఎత్తులో చైనాతో తలపడేందుకు భారత సాయుధ బలగాలు రెడీ అయ్యాయి.

What's wrong with India's Nirbhay cruise missile? — Indian Defence Newsరెండు దేశాల మధ్య జూన్ మాసం నుండి ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉన్నాయి. ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘిస్తూ చైనా భారత భూభాగంలోకి చోచ్చుకూ రావడంతో పాటు కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అప్పుడప్పుడే చైనాతో సత్సంబంధాలు కుదిరేలా లేకపోవటంతో శీతాకాలంలో సరిహద్దులను కాపాడుకోవడానికి భారత రెడీ అయ్యింది. ఇదిలా ఉండగా ఫైబర్ ఆప్టిక్ కేబుల్ తో భారత్ పై శాటిలైట్ ద్వారా నిఘా పెట్టడంతో… అప్పుడు బలహీనమైన ప్రాంతాలను గుర్తించి ఆక్రమించుకోవాలనే ఆలోచనలో చైనా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

పరిస్థితి ఇలా ఉండగా “నిర్భయ మిస్సైల్” బోర్డర్ లో దింపడంతో చైనా బెదిరిపోతున్నాట్లూ సమాచారం. నిశ్శబ్ద విధ్వంస క్షిపణి టార్గెట్లను చేదించడం లో ఆరు మీటర్ల పొడవుండే ఈ క్షిపణి 1000 కిలోమీటర్లు రేంజిలో టార్గెట్ ను నాశనం చేస్తుంది. ఇలాంటి క్షిపణి చైనా బోర్డర్ లో భారత్ ఆర్మీ దింపడంతో చైనా ఆర్మీ వర్గాలలో టెన్షన్ మొదలైనట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.