NewsOrbit
రాజ‌కీయాలు

చిక్కుల్లో చైనా..! హైడ్రో ప్రాజెక్టుతో ఒంటరిగా మిగిలే అవకాశం..!!

china under trouble with hydro power project

చైనాకు దక్షిణ సరిహద్దులో భారత్, బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న యార్లంగ్ జాంగ్బో నదిపై హైడ్రోపవర్ ప్రాజెక్టు కట్టాలని భావిస్తోంది. అయితే.. దీనిని భారత్ వ్యతిరేకిస్తోంది. ఇది భారత్ లోని కొన్ని ప్రాంతాలపై ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. భౌగోళికంగా చైనా ఎదుగుదలకు, భారత్ లోని నది పరిసర ప్రాంతాల్లో నీటి లభ్యతపై ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. భారత్ – పాకిస్థాన్ దేశాల మధ్య నీటి పంపకాలపై ఒప్పందాలు ఉన్నాయి. కొన్ని వివాదాలు కూడా ఉన్నయి. కానీ.. ఇదే తరహా ఒప్పందానికి చైనాతో భారత్ విముఖంగా ఉంది.

china under trouble with hydro power project
china under trouble with hydro power project

చైనా ఉద్దేశం ఇదీ..

నిజానికి యార్లంగ్ జాంగ్బో నదిపై చైనా ప్రాజెక్టు కట్టాలని దశాబ్దాలుగా భావిస్తోంది. అయితే.. భారత్ నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతతో ఇన్నాళ్లూ సైలంట్ గానే ఉంది. ఈ ప్రాజెక్టు కడితే భారీస్థాయిలో అక్కడ విద్యుత్ జనరేట్ చేస్తుంది. సరిహద్దు ప్రాంతంలో ఇది చైనాకు మరిం బలం చేకూరుస్తుంది. దీనివల్ల చైనా నిర్దేశించుకున్న 2060 కార్బన్ న్యూట్రల్ గోల్ ను చేరుకోగలదు. ఈ విద్యుత్ ను ఉత్పత్తి చేయడం వల్ల ఇతర దేశాలకు విద్యుత్ ను విక్రయించే ఉద్దేశం కూడా చైనాకు ఉంది. ఇప్పటికే నేపాల్ కు హై ఓల్టేజి ట్రాన్స్ మిషన్ లైన్స్ కూడా వేసింది. చైనా హైడ్రో పవర్ ప్రాజెక్టును ప్రారంభిస్తే పొరుగు దేశాలకు భారీగా విద్యుత్ ను అందించగలదు. ఇది ఆయా దేశాలకు ఎంతో ఉపయోగం కూడా. అయితే..  ఈప్రాజెక్టు వల్ల ఈ నదికి దిగువున్న ఉన్న దేశాల నీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీనిపై చైనా తన పొరుగు దేశాలతో ఇప్పటికే స్నేహపూరిత సంబంధాలు ఏర్పరచుకున్నాయని అంటున్నారు.

చైనాకు ఒంటరిగా మిగిలేనా..?

అయితే.. ఈ ప్రాజెక్టు వల్ల భారత్ రక్షణ, భద్రతాపరమైన అంశాలపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనివల్ల రెండు దేశాల మధ్య వివాదం తలెత్తుతోంది. ఈ ప్రాజెక్టు వల్ల నదికి దిగువన ఉన్న భారత్ లోని నగరాలు వరద ముంపుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని అంటోంది. భౌగోళికంగా ఇది భారత్ కు దెబ్బ అని అంటున్నారు. గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా విదేశీ వ్యవహారాలపై ఇలాగే ఏకపక్షంగా వ్యవహరించారు. దీంతో సొంత దేశంలోనే వ్యతిరేకతకు గురై నష్టపోయాడు. చైనా కూడా ఇదే పద్ధతిని  అవలింబిస్తూ విదేశీ సంబంధాలపై దెబ్ తీసుకునేలా వ్యవహరిస్తోంది. ఇదే నియంతృత్వ ధోరణితో వెళ్తే విదేశీ వ్యవహారాల్లో చైనా ఒంటరిగా మిగిలిపోతుంది. ఏ దేశానికైనా విదేశాలతో సఖ్యత ఎంతో అవసరం. సున్నితమైన ఈ అంశాన్ని చైనా జటిలం చేసుకుంటుందనే చెప్పాలి.

 

author avatar
Muraliak

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?