NewsOrbit
రాజ‌కీయాలు సినిమా

అమితాబ్, రజినీ, చిరు పొలిటికల్ పోటీలో.. ‘చిరంజీవి’ హీరో..! ఇదే కారణం

chiranjeevi stood political hero among amitabh bachan and rajinikanth

భారతీయ చిత్ర పరిశ్రమలో తిరుగులేని మాస్ సూపర్ స్టార్స్.. అమితాబ్ బచ్చన్, చిరంజీవి, రజినీకాంత్. సినిమాల్లో ఎనలేని పేరు ప్రఖ్యాతులు సాధించిన ఈ ముగ్గురూ.. అదే ఇమేజ్ ను రాజకీయాల్లో కూడా చూపాలని ప్రయత్నాలు చేశారు. కానీ.. విఫలమయ్యారు. స్క్రీన్ పై చేసిన మ్యాజిక్ పొలిటికల్ గా వర్కౌట్ కాలేదు. అయితే.. వీరి ముగ్గురిలో చిరంజీవి మాత్రమే ప్రత్యేకం.. పొలిటికల్ హీరో అని చెప్పాలి. కారణం..

chiranjeevi stood political hero among amitabh bachan and rajinikanth
chiranjeevi stood political hero among amitabh bachan and rajinikanth

ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్.. సొంతంగా పార్టీ పెట్టలేదు. రాజీవ్ గాంధీతో ఉన్న స్నేహంతో ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఎంపీగా భారీ విజయం సాధించారు. కానీ.. రాజకీయాల్లో ఇమడలేక పోయారు. ఇండియన్ సూపర్ స్టార్ అయినా.. పార్టీ పెట్టే ధైర్యం చేయలేదు. . మళ్లీ సినిమాల్లో నటించారు. ఇన్నేళ్లలో మళ్లీ రాజకీయాల వైపు తలెత్తి చూడలేదు.

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. రజకీయాల్లోకి రావాలంటూ రెండు దశాబ్దాల క్రితమే ఒత్తిడి. కానీ.. సైలెన్స్. కరుణానిధి, జయలలిత లేని సమయంలో పొలిటికల్ ఎంట్రీ. 70 ఏళ్ల వయసులో ఆరోగ్య సమస్యలు. ఊరిస్తున్న అత్యున్నత పీఠం. ఫ్యాన్స్ తో సమావేశాలు. పార్టీకి అధ్యక్షుడిగా ఉంటాను.. సీఎం వేరే వ్యక్తి. ఆరోగ్య సమస్యలంటూ లేఖ. నాది కాదంటూ వివరణ. మళ్లీ ఫ్యాన్స్ తో మీటింగ్. చివరికి పార్టీ పెడుతున్నానంటూ ప్రకటన. డిసెంబర్ 31న తేదీ ఖరారు. కానీ.. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి కోలుకుని.. ఆరోగ్యం సహకరించడం లేదు.. రాజకీయాల్లోకి రావడం లేదు. పార్టీ పెట్టడం లేదంటూ డిక్లేర్. ‘రజినీ ఆరోగ్యం సహకరించలేదు.. లేకుంటేనా’ అని అందరూ అనుకునేలా ఓ సానుభూతి.. మరి ‘లోగుట్టు పెరుమాళ్ల కెరుక’.

తెలుగు మెగాస్టార్ చిరంజీవి.. 53 ఏళ్ల వయసులో సినిమా క్రేజ్ నిండు కుండలా ఉంది. రాజకీయాల్లోకి రావాలనే ఒత్తిడులు. రాష్ట్రంలో ‘వైఎస్’ చెప్పిందే వేదంలా నడుస్తున్న రోజులు. ధైర్యంగా ‘ప్రజారాజ్యం’ పార్టీ స్ధాపన. తిరుపతిలో జరిగిన పార్టీ ఆవిర్భావానికి వచ్చిన జన సందోహాన్ని చూసి ఇతర పార్టీల్లో కుదుపు. కానీ.. చిరంజీవి చరిష్మా రాజకీయాల్లో పనికి రాలేదు. రాజకీయ తెలివితేటల ముందు చిరంజీవి అమాయకత్వం పని చేయలేదు. పార్టీ ఓటమి.. చిరంజీవే ఒక చోట ఓటమి. కానీ.. ఉమ్మడి ఏపీలో 17 శాతం ఓటింగ్. 18 చోట్ల గెలుపు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం. కేంద్ర మంత్రిగా పదవి. అనంతర ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి. చిరంజీవి రాజకీయ ప్రస్థానికి దాదాపు ముగింపు. మళ్లీ సినిమాలు చేస్తుంటే అదే క్రేజ్.. అదే ఇమేజ్. ఏం మారలేదు. ఆయన వదిలి వెళ్లిన నెంబర్ వన్ స్థానం ఆయనకే.

ఇదీ.. ఈ ముగ్గురు ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్స్ రాజకీయ పయనం. అమితాబ్ పార్టీనే పెట్టలేదు. రజినీ పార్టీ పెడుతున్నానంటూ ఊరించి క్యాన్సిల్ చేసేశారు. మరి.. చిరంజీవి పార్టీ పెట్టారు. ప్రజల్లోకి వెళ్లారు. అవమానాలు భరించారు. పార్టీని నడపలేకపోయారనే అపప్రధను మోశారు. కానీ.. పొలిటికల్ గా ధైర్యం చేశారు. ముందడుగు వేశారు. మాస్ ఇమేజ్, ప్రేక్షకాదరణలో ఈ ముగ్గురికీ భారతీయ హీరోల్లో మరే హీరో సాటి రారనేది నిజం. కానీ.. పొలిటికల్ గా ఫెయిల్. అయినా.. పైన పేర్కొన్న ఉదాహరణల ఆధారంగా చూస్తే మాత్రం ఈ ముగ్గురిలో ‘పొలిటికల్ హీరో’ అంటే ‘చిరంజీవి’ పేరే చెప్పాలి.

author avatar
Muraliak

Related posts

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu