NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

MP RRR: ఎంపీ తగ్గేదెలే.. ఏపీ పోలీస్ వదిలేదేలే..!!

MP RRR: ఏపీ ప్రభుత్వం పాలిట కొరకరాని కొయ్యగా మారిన ఎంపీ రఘురామకృష్ణ రాజు.. సీఎం జగన్ పై రోజుకో కామెంట్ చేస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ నాయకులు అటు ఢిల్లీలో, ఇటు ఏపీలో కూడా రఘురామను నిలువరించలేక పోతున్నారు. ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఏపీలో జరుగుతున్న పరిణామాలను ఎండగడుతున్నారు. ఢిల్లీలోనే ఉంటూ.. సొంత నియోజకవర్గానికి రాని రఘురామ సంక్రాంతి పండుగ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాకు వస్తున్నట్టు స్వయంగా తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఐడీ పోలీసులు రఘురామను అరెస్టు చేసేందుకు హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఆయన ఇంటికి చేరుకున్నారు. రేపు విచారణకు రావాలని రఘురామకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది.

cid notice to mp raghuramakrishna raju
cid notice to mp raghuramakrishna raju

ఎంపీ సవాల్..

గత ఏడాది దేశద్రోహం కేసులో సీఐడీ పోలీసులు (MP RRR) రఘురామకు నోటీసులు ఇవ్వడం, విచారణ సందర్భంలో జరిగిన సంఘటనలు తెలిసిందే. అయితే.. ప్రస్తుతం రఘురామ ఏపీకి వస్తున్నాని సంక్రాంతికి రెండు రోజులు సొంత ఊరిలో ఉంటాను.. రక్షణ ఇవ్వండని కోరారు. తనపై అనర్హత వేయించడానికి ఫిబ్రవరి 5వరకూ వైసీప నేతలకు సవాల్ చేశారు. లేదంటే తాను రాజీనామా చేసి అమరావతి రాజధాని రిఫరెండంగా ఇండిపెండెంట్ గా ఉప ఎన్నికకు వెళ్తానని అన్నారు. ఈనేపధ్యంలో నోటీసుల వ్యవహారం కలకలం రేపుతోంది. అయితే.. ఉన్నట్టుండి ఆయనకు నోటీసులు ఇవ్వడం.. రేపు విచారణకు రావాలని ఆదేశించడం వెనుక రఘురామను ఏపీకి రాకుండా చేయాలనేనా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

కావాలనే చేస్తున్నారా..

(MP RRR) తనకు ఏ కేసుకు సంబంధించి నోటీసులు ఇచ్చారో తెలపలేదని రఘురామ అంటున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆయన్ను అరెస్టు చేసే అవకాశం లేదు. కేవలం.. ఆయన నరసాపురం వెళ్లకుండా అడ్డుకునేందుకే పోలీసులు నోటీసులిస్తున్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన సవాల్ విసరడం, ప్రభుత్వ విధానాలపై ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో సొంతూరికి వస్తే.. ఆయనపై సానుభూతి పవనాలు వ్యక్తం కావడం.. మీడియా ఇంటరాక్షన్ జరిగి మరింతగా ప్రభుత్వానికి డ్యామేజ్ చేసే ప్రయత్నం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఆయన్ను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే.. రఘురామ విచారణకు జనవరి 17న వస్తానని చెప్పడం విశేషం. ఈ అంశంలో మరెన్ని సంచలనాలు నమోదవుతాయో చూడాల్సి ఉంది.

author avatar
Muraliak

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!