బాబు మార్చబోయిన గీత..! జగన్ చెరిపేసిన గీత..! ఇదే ‘గీతం’ కథ..!!

‘నాకు దక్కనిది ఎవరికీ దక్కడానికి వీల్లేదు’ అని మగధీరలో ఫేమస్ డైలాగ్ ఉంది. ‘తన వారికి దక్కనిది.. ప్రభుత్వ శాఖలకు కూడా దక్కకూడదు’ అని గత ప్రభుత్వ సీఎం చంద్రబాబు కాస్త మార్చి రాసిన ‘గీతం’ ఇది. గీతం యూనివర్శిటీ గోడలు కూల్చివేతపై హైకోర్టు స్టే ఇచ్చినా.. వైసీపీ ప్రభుత్వం నిబ్బరంగానే ఉంది. ఆందోళన చెందాల్సింది ‘గీతం’ అయితే.. టీడీపీ ఉలిక్కిపడుతోంది. కిమ్మనకుండా ఉండలేక.. తాటాకు చప్పుడు చేస్తోంది. తప్పు పని చేసేవాడికంటే.. చేయించిన, ఉరికొల్పిన వాడికే కదా ఉలుకెక్కువ. జగన్ ప్రభుత్వం ఇంత దూకుడుగా వెళ్లటానికి కారణం.. గీతం విషయంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన సంఘటన.. మాజీ సీసీఎల్ఏ ఐవైఆర్ కృష్ణారావు పోస్ట్ కారణమని తెలుస్తోంది.

cm jagan big shock to chandrababu about gitam
cm jagan big shock to chandrababu about gitam

ప్రైవేటు భూమి కావాలంటూ గీతం పట్టు..

ఉమ్మడి ఏపీ.. రాష్ట్ర విభజన సమయం.. గీతం యూనివర్శిటీ చైర్మన్ దివంగత మూర్తి ఓ సందర్భంలో.. ఐవైఆర్ కు ఓ లేఖ రాశారు. యూనివర్శిటీకి ఆనుకుని 34 ఎకరాల భూమి తమకు ఇస్తే యూనివర్శిటీ మరింత అభివృద్ధిలోకి వస్తుందని.. కేటాయించాలనీ కోరారు. ఇందుకు ఐవైఆర్ ససేమిరా అన్నారు. బాధ్యతగా ఫైలు కమిటీకి పంపితే తిరస్కరణకు గురైంది. ఆ సమయంలోనూ మూర్తికి అనుకూలంగా ఓ కాంగ్రెస్ మంత్రి వత్తాసు తీసుకున్నారట. అయితే.. పర్యవసనాలు ఆలోచించిన ఐవైఆర్.. కొన్ని శాఖలను పిలిచి విశాఖలో భూముల అవసరం తెలుసుకుని ఆయా శాఖలకు అప్పగిస్తున్నట్టు విశాఖ కలెక్టర్ ద్వారా కేటాయించేశారు. దీనిపై హైకోర్టుకు వెళ్లారు మూర్తి. స్టే వచ్చింది.

అధికారంతో టీడీపీ చేసింది.. ఇదేనా..?

2014లో టీడీపీ వచ్చింది. మళ్లీ ఫైలు కదిలింది. తన వారు కావడంతో 2017లో చంద్రబాబు క్యాబినెట్ లో ఈ అంశాన్ని తెరమీదకు తెచ్చారు. ప్రభుత్వ భూమిని ప్రభుత్వ శాఖలకు, ప్రభుత్వ రంగ సంస్థలకు, ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వొచ్చని ఒక రూల్ ఉంది. ఆ ప్రకారంగా గీతంకు ఇద్దామని సీఎం హోదాలో చంద్రబాబు అన్నారు. రూల్ ప్రకారం ఖాళీగా ఉంటే ఇవ్వొచ్చు గానీ.. ఇప్పటికే ప్రభుత్వ శాఖలకు ఇచ్చిన భూమిని మళ్లీ ఎలా ప్రైవేటుకు ఇస్తారు? అని. దీంతో మిన్నుకుండిపోయిన బాబు.. కనీసం రద్దు చేద్దాం అని రద్దు చేశారట. ఇప్పుడు ఆ భూమే ఆక్రమణ అరోపణలు.. కూల్చివేతలు. ఇప్పుడు అర్ధమైందా.. ‘మగధీర’ డైలాగ్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందో.. టీడీపీ ఉలికిపాటుకు కారణమేంటో..!