NewsOrbit
రాజ‌కీయాలు

అమరావతిపై జగన్ కీలక నిర్ణయం.. ఇక పరుగులు పెట్టడమే..

Amaravati Scam: 1000 Crores Scam Proves YSRCP Allegations

ఏపీ రాజధాని విషయంలో సీఎం జగన్ వైఖరి ఏంటి? ఆయన వ్యతిరేకమా.. అనుకూలమా అనే విషయాలు కొన్నాళ్లుగా చర్చల్లో నిలుస్తున్నాయి. ఇందులో అందరూ ఏకపక్షంగా చెప్పే మాట ఆయన అమరావతికి వ్యతిరేకమనే. అయితే.. అమరావతిలో ఇప్పటివరకూ నిర్మితమైన కట్టడాలను జగన్  కొనసాగిస్తారా.. లేదా అనేదానిపై ఇప్పటివరకూ స్పష్టత లేదు. కానీ.. అమరావతిపై సీఎం జగన్ సమీక్ష చేయడం చర్చనీయాంశమైంది. అమరావతిలో కొనసాగుతున్న కట్డడాలను ఆపమని నిధులు సమీకరించుకుని నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

cm jagan key decision about amaravathi
cm jagan key decision about amaravathi

జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల్లో అమరావతి కూడా ఉంది. అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని జగన్ ప్రకటించారు. కాబట్టి ఇక్కడ గతంలో ఉన్న నిర్మాణాలను నిలిపేసే ప్రసక్తి లేదని అంటున్నారు. ఏపీ రాజధానిపై స్పష్టత తీసుకున్న సీఎం ఇప్పుడు అమరావతిపై కూడా దృష్టి సారించారు. ఇందులో భాగంగానే ఆర్దిక శాఖతో సమన్వయం చేసుకుని కట్డడాలు పూర్తి చేయాలని ఆదేశించారు. గతంలో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా పలు భవనాలను పరిశీలించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని పక్కన పెట్టట్లేదనే సంకేతాలు ఇచ్చారు సీఎం జగన్.

హ్యాపీ నెస్ట్ ను కొనసాగించండి: సీఎం జగన్

అమరావతిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు ‘హ్యాపీనెస్ట్’. సీఆర్డీలే చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఫ్లాట్స్ బుకింగ్ అనౌన్స్ చేసిన తొలి రోజే ఫ్లాట్స్ బుకింగ్ పూర్తైపోవడం అప్పటి ప్రభుత్వాన్నే ఆశ్చర్యపరచింది. ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలు.. ముఖ్యంగా ఎన్నారైలు ఈ ప్రాజెక్టుపై ఆసక్తి చూపడంతో ‘హ్యాపీనెస్ట్’ ప్రాజెక్టు సంచలనం సృష్టించింది. రెండో విడత ఫ్లాట్స్ బుకింగ్స్ కు కూడా సీఆర్డీఏ అప్పట్లో ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రభుత్వం మారిన తర్వాత కొందరు తమ డబ్బులు తిరిగి చెల్లించాలని కోరినట్టు వార్తలు వచ్చాయి. కానీ.. ‘హ్యాపీనెస్ట్’ ను కొనసాగించాలని సీఎం జగన్ ఇప్పుడు ఆదేశాలివ్వడంతో ప్రాజెక్టులో కదలిక రానుంది. ఫ్లాట్లు కొన్నవారికి ఇది శుభవార్త అనే చెప్పాలి.

author avatar
Muraliak

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju