CM Jagan: ఏపీలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చి త్వరలో మూడేళ్లు పూర్తి కాబోతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ప్రజా సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే ‘నవ రత్నాలు’ పేరుతో సంక్షేమ పథకాలకు రూపకల్పన చేశారు. జగన్ సీఎం కావడం వాటిని అమలు చేయడం చకచకా జరిగిపోయాయి. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 90 శాతం హామీలు నెరవేర్చామని సీఎంతో సహా వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు ఆ పధకాల అమలుకు నిధుల లేమి సమస్య వస్తోందనే వార్తలు వస్తున్నాయి.
పధకాలు వాయిదా..!
కరోనా పరిస్థితుల మధ్య ఈ రెండున్నరేళ్లలో జగన్ సంక్షేమ పథకాల అమలు చేస్తూనే ఉన్నారు. ఇందుకు రాష్ట్రం అప్పులు ఎక్కువ చేస్తోందనేది నిజం. రాబడి తగ్గింది.. ఖర్చులు పెరిగిపోయాయి. మళ్లీ కొత్త ఏడాది వచ్చింది. దీంతో పధకాలు యధావిధిగా అమలు చేయాల్సి ఉంది. కానీ.. నిధుల లేమితో ఇప్పుడు ప్రభుత్వం పధకాల అమలుకు నిధుల వేటలో పడిందని తెలుస్తోంది. ప్రతి ఏటా జనవరి నెలలో ఇస్తున్న అమ్మఒడి పధకం జూన్ కు వాయిదా వేయడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇదే నెలలో ఇవ్వాల్సి ఈబీసీ నేస్తం పధకం కూడా వాయిదా పడింది. 650 కోట్ల ఖర్చయ్యే ఈ పధకాన్ని కర్నూలు జిల్లాలో సీఎం (CM Jagan) ప్రారంభించాల్సి ఉన్నా వాయిదా పడిందని తెలుస్తోంది.
సీఎం ధృడ సంకల్పం..
ఉద్యోగులకు పీఆర్సీతో 10వేల కోట్ల అదనపు భారం కూడా ప్రభుత్వంపై పడనుంది. అయితే.. సంక్షేమ పధకాల అమలును (CM Jagan) సీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. కరోనా కష్ట కాలంలో కూడా ప్రజలకు పధకాల అమలు ద్వారా వారి మెప్పు పొందామని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే అభిమానం ఓట్లు పడేలా చేస్తాయనేది వైసీపీ నాయకుల ఆలోచన కూడా. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో పధకాల వాయిదా వేసినా.. వాటిని అమలు చేయాలనే ధృడ సంకల్పంతో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.
ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…
రీసెంట్గా `సర్కారు వారి పాట`తో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో మాస్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం…
హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…
అక్కినేని కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్నాడు. "జోష్"తో హీరోగా ఎంట్రీ ఇచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ఒకపక్క సౌత్…
సినిమా రంగంలో టాప్ హీరోలకు యాడ్ రంగంలో భారీ ఆఫర్ లు వస్తూ ఉంటాయి అని అందరికీ తెలుసు. ఈ క్రమంలో చాలామంది హీరోలు ప్రముఖ కంపెనీలకు…